ఈ రోజుల్లో పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న కర్మాగారాలు దృష్ట్యా ప్రపంచాన్నంతటినీ ఒకే సమస్య పీడిస్తోంది. అదే వాయు కాలుష్యం. ప్రపంచవ్యాప్తంగా దీని పైన చాలానే పరిశోధనలు జరుగుతున్నాయి. రోడ్డు మీదకు వస్తే ఉండే వాహనాల పొగ, ఫ్యాక్టరీల పొగ, దుమ్ము ధూళి వెరసి మనుషుల ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఇక పారిశ్రామిక వాడలు మరియు ఎయిర్ పోర్ట్ వంటి వాటికి దగ్గరగా ఉంటే ఇక అక్కడ గాలి నాణ్యత గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అక్కడ గాలిలో వీటన్నిటి వల్ల మరింత ఎక్కువగా వాయు కాలుష్యం ఉందని ప్రపంచ సంస్థలు పేర్కొంటున్నాయి.

అంతెందుకు ప్రపంచవ్యాప్తంగా చేసిన ఒక సర్వే లో అత్యంత కాలుష్య నగరoగా మన దేశ రాజధాని ఉందంటే మనం ఎలాంటి పరిస్థుతులలో బ్రతుకుతున్నమో అర్ధం చేసుకోవచ్చు. ఫలితంగా అక్కడి గాలిని పీల్చే ప్రజలకు గుండె, ఊపిరితిత్తుల సంబంధిత రోగాలు వస్తున్నాయి. మన దేశమే కాదు యురోప్ ఖండంలోని 90 శాతం మంది ఇప్పటికే తీవ్రమైన వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నారని WHO ఒక నివేదిక లో వెల్లడించింది. సరే, ఇంతకీ ఏమిటీ వాయు కాలుష్యం ఎలా నిర్వచిస్తారు అంటే ఈ పరిశ్రమల వ్యర్ధాల వల్ల, వాహనాల పొగవల్ల, విమానాల నుంచి విడుదల అయ్యే పోగాలోనూ మన కంటికి కనిపించని అతి సన్నని పదార్ధాలు ఉంటాయి. అవి ఎంత సన్నగా ఉంటాయి అంటే మన తల వెంట్రుకలో వందో వంతు మందంగా ఉంటాయి అని పేర్కొంటున్నారు. వీటినే Fine particles అంటారు. అంతే కాదు వీటిలో చాలా రకాలు ఉన్నాయి <100 నానో మీటర్లు ఉంటే వాటిని Ultra fine particles అంటారు. అంటే పర్యావరణం మీద వీటి తీవ్రత మరింత ఎక్కువన్నమాట.

అందువల్ల తాజాగా పర్యావరణ గాలిలోని ఈ కలుషిత పదార్ధాలను పూర్తిగా తొలగించేoదుకు డచ్ కు చెందిన Envinity సంస్థ ఒక వాక్యుం క్లీనర్ ను తయారు చేసింది. అది పూర్తిగా స్టీల్ తో తయారై 26 అడుగుల పొడవు ఉండి భవనాల పైన ఉంచాల్సి ఉంటుంది. అప్పుడు అది గాలిలో చుట్టుపక్కల కొన్ని మైళ్ళ వరకు మరియు అది ఉంచబడిన చోటు నుంచి 7 కిలో మీటర్ల పైవరకు ఉండే పరిధిలోని గాలిని గంటకు 80,000 క్యూబిక్ మీటర్ల మేర శుద్ధి చేస్తుంది.

ఆ సంస్థ చేసిన ఒక ప్రయోగం ప్రకారం ఇది fine particles ను 100 శాతం అలాగే ultra fine particles ను 95 శాతం హరించి వేస్తుందని పేర్కొంటున్నారు.

మరింకేం ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నాలు మరిన్ని జరగాలి. ఇది అన్ని దేశాల్లో అవసరమైన చోట వినియోగించి దానిని మరింత మెరుగుపరిచి ఆ విధంగా మరింత స్వచ్చమైన గాలిని తిరిగి అందరo పొందాలని ఆశిద్దాం.

Courtesy