డైరెక్టర్ హను రాఘవపూడి(Hanu Raghava pudi) దర్శకత్వం(Direction)లో, దుల్కర్‌ సల్మాన్‌(Dulquar Salman) హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

వైజయంతి మూవీస్(Vyjayanthi Movies) స‌మ‌ర్ప‌ణ‌లో స్వప్న సినిమా ప‌తాకం(Swapana Cinema Banner)పై  అశ్విని దత్‌, ప్రియాంక్‌ దత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌(Romantic Entertainmnet) లో మృణాళిని ఠాకూర్ సీత పాత్ర లో కనిపించనుంది. అఫ్రీన్‌ అనే కశ్మీర్‌కు చెందిన ముస్లిం యువతిగా రష్మిక నటిస్తోంది.

శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని ప్రకటిస్తూ ఓ వీడియోని(Video) రిలీజ్ చేశారు మూవీ మేకర్స్

ఈ సినిమాకి ‘సీతారామం’(Seethaaramam)అనే టైటిల్‌(Title)ని ఖరారు చేశారు. రష్మిక పాత్రలో హనుమాన్‌ షేడ్స్‌ ఉన్నాయి. రామాయణంలో శ్రీరాముడికి ఆంజనేయుడు సహాయం చేసినట్లుగా, యుద్దంలో మ‌ద్రాస్ ఆర్మీ ఆఫ‌స‌ర్ లెఫ్ట్‌నెంట్ రామ్‌ (హీరో దుల్కర్‌ సల్మాన్‌ రోల్ పేరు) కు రష్మిక హెల్ప్ చేస్తుంటుంది.

ఇది ఓ సైనికుడు శత్రువుకు అప్పగించిన యుద్దం అఫ్రీన్‌, ఈ యుద్దంలో సీతారాములను నువ్వే గెలిపించాలి’అనే సుమంత్‌ వాయిస్‌ ఓవర్‌(Sumanth Voice Over) ప్రారంభమైన ఈ స్పెషల్‌ వీడియో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.

ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖ‌ర్ (Vishal Chandra sekhar) మ్యూజిక్(Music) స‌మ‌కూరుస్తుండగా, దివాక‌ర్ మ‌ణి(Divakar Mani) సినిమాటోగ్రాఫ‌ర్‌ (Cinematographer)గా వ్యవ‌హ‌రిస్తున్నారు.

ఈ మూవీ విడుదల ఎప్పుడన్నది తెలియాల్సి ఉంటుంది.