మనందరికీ ఏదైనా సమాచారం కావాలంటే గూగుల్ మీదనే ఆధారపడతాం. “సెర్చ్” కు పర్యాయ పదంలా నిఘంటువు లో (dictionary) లో కూడా చేరిపోయిందంటే దాని మీద అందరం ఎంత ఆధారపడుతున్నామో తెలుస్తుంది. దీన్లో GK (జనరల్ నాలెజ్), సినిమాలు, దేశాలు, ఇలా ఒక్కటనేమిటి, దేనికైనా గూగుల్ లో సమాధానం దొరుకుతుంది. అయితే ఈ మధ్య ఆరోగ్య లక్షణాలను బట్టి ఏ వ్యాధి వచ్చి ఉంటుందోనని కూడా గూగుల్ లోనే తెలుసుకుంటున్నారు. ఇది ఎంత వరకు సరైనదని ఎప్పుడైనా ఆలోచించారా? ఒక వైద్యుని సలహా కంటే గూగుల్ మెరుగైన సమాచారాన్ని ఇస్తుందని గారంటీ ఏంటి. అసలు మనమిచ్చిన కీ వర్డ్స్ కు స్పందించిన గూగుల్, తద్వారా వచ్చిన సమాచారం మనకు ఎంత వరకు ఉపయోగపడుతుంది. ఈ ప్రశ్నలకు Guido Zuccon అనే వ్యక్తి శాస్త్రీయమైన పద్ధతిలో సమాధానాలు ఇచ్చాడు. అవేంటో చదవండి మరి.

Guido Zuccon

Guido Zuccon అనే ఆయన ఆస్ట్రేలియా లోని క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీ (Queensland University of Technology) లో “information retrieval” మీద అధ్యయనం చేస్తున్నారు. ఈయన ఒక ప్రయోగం చేసారు. అప్పటికే microsoft మరియు UC Berekely సంయుక్తంగా చేసిన ఒక ప్రయోగాన్ని ఆధారంగా తీసుకున్నారు. అందులో భాగంగా వారు కొంత మందికి alopecia, Jaundice మొదలుకొని urticaria వంటి 8 వ్యాధి లక్షణాలను యుట్యూబ్ లో వీడియోలుగా చూపించారు. అలా చూసిన వారిని గూగుల్ లో వ్యాధి లక్షణాలను బట్టి ఆ వ్యాధిని వెతకమన్నారు. వారు తాము చూసిన దాన్ని బట్టి సెర్చ్ చేయడానికి చేసిన keywords ను Zuccon ప్రయోగానికి ఉపయోగించారు. ఇప్పుడు ఆ keywords ను, దానివల్ల వచ్చిన సమాచారాన్ని కొంత మంది నిపుణులు ఎంత వరకూ సరైనవని విశ్లేషించారు. దాని ఫలితాలు ఇలా ఉన్నాయి.

మొదటి పేజిలో కేవలం 4 లేదా 5 మాత్రమే ఉపయోగకరంగా ఉన్నాయి. వాటిలో కూడా కేవలం 3 మాత్రమే సొంతంగా రోగ నిర్ధారణకు పనికొస్తాయి. అయితే సెర్చ్ చేసే వారు కేవలం మొదటి పేజి తో ఆగరు కనుక వెతికే కొద్దీ వారు పక్క తోవ పట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు Zuccon. ఇలా జరగడానికి 2 కారణాలు ఉన్నాయి. అవి 1. సెర్చ్ చేసే వారికి సరైన వైద్య శాస్త్ర ప్రావీణ్యం ఉండదు కనుక సరైన వైద్య పదజాలం ఉపయోగించకపోవడంతో కావాల్సిన సమాచారాన్ని రాబట్టలేరు. 2. ప్రస్తుత గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఉపయోగిస్తున్న ప్రోగ్రాం. ఎందుకంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ బాగా పేరున్న వ్యాధులనే ఎక్కువగా చూపిస్తుంది. ఉదా. మీరు ఏదైనా తల నొప్పి తో కూడిన ఫ్లూ లక్షణాన్ని గూగుల్ చేస్తే అది మీకు బ్రెయిన్ కు సంబంధించిన తీవ్ర వ్యాధులను చూపిస్తుంది. దీనితో మీరు మరింత కంగారు పడే అవకాశం ఉందని అంటున్నారు Zuccon.

ఈ medical query ల విషయంలో సెర్చ్ ఇంజిన్ సామర్ధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రపంచవ్యాప్తంగా 12 బృందాలు “CLEF 2015 eHealth Task2” అనే ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నారు.

అంతే కాదు ఇలా వ్యాధి లక్షణాలను వెతికిన తరువాత తమ ఆరోగ్యం గూర్చి మరింత ఆదుర్దా పడుతున్నారని, దీనినే “Cyberchondria” అంటారని వైద్యులు పేర్కొంటున్నారు. అందువల్ల తేలిందేమిటంటే హనుమంతుని ముందు కుప్పి గంతులలా మన గూగుల్ పరిజ్ఞ్యానం తో కష్టాలు కొని తెచ్చుకోకుండా వైద్యుడిని ఆశ్రయించడం మేలు.

Courtesy