పన్నీర్ (Panner).. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. పన్నీర్ కర్రీ అంటేనే.. నోరూరుతుంది.దాదాపు ప్రతి రకపు భారతీయ వండే పద్ధతిలో, పనీర్ వాడతారు. పన్నీర్ శాకాహారులకి చాలా ఫేవరెట్ పదార్థం. పన్నీర్ ను గ్రేవీ లేదా పొడి కూరల్లో మరియు తీపి వంటకాలలో కూడా దీన్ని ఎక్కువగా వాడతారు.
ప్రాచీనకాలం నుంచి పన్నీర్ వంటకాలు ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ (North Indians)ప్రతీ రోజూ దీనిని ఆహారం లో ఒక భాగం చేసుకుంటారు.
పన్నీర్… చాలా మందికి నచ్చే ఫుడ్ ఇది. కేవలం పాలతో మాత్రమే తయారయ్యే ఈ పన్నీర్ ని పిల్లల దగ్గర నుండి ,పెద్ద వాళ్ళ వరకు ఇష్టపడతారు….దీనితో రుచికరమైన ఎన్నో వంటకాలు తయారుచేసుకోవచ్చు.
అయితే.. చాలా మందిలో ఈ పన్నీర్ విషయంలో పలు రకాల అనుమానాలు ఉన్నాయి.
అయితే పన్నీర్ (Panner) తింటే లావుగా అవుతారు అనే భయంతో చాలా మంది పన్నీర్ అంటే మక్కువ ఉన్నా దూరంగా పెట్టేస్తున్నారు.
నిజంగానే పన్నీర్ తింటే లావు అవుతారా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం….
మనం వాడే ప్రతీ ఒక్క ఆహార పదార్థానికీ పలురకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.అలాగే పన్నీర్ లో కూడా ..
పన్నీర్ లో ఉన్న ప్రయాజనాల గురుంచి తెలుసుకుందామా మరి….
30 తర్వాత శరీరంలో కాల్షియమ్ (Calcium)శాతం తగ్గుతూ వస్తుంది. కాబట్టి దీని అవసరం చాలా ఉంది.పన్నీర్ స్త్రీలు ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన వారు ఖచ్చితంగా తినాలని ఆహార నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే దీనిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. …
గుండెకి
గుండె జబ్బులకి పన్నీర్ రక్షణ కల్పిస్తుంది. ప్రతీ రోజూ పన్నీర్ తీసుకుంటుంటే హృద్రోగాలు (Heart stroke) వచ్చే అవకాశాలు తగ్గి, రక్తపోటు, లిపిడ్ శాతాలు కూడా క్రమంగా అదుపులో ఉంటాయట
పన్నీర్ లోని పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది.
పన్నీర్ జీవక్రియను పెంచుతుంది. దీనిలోని పీచుపదార్థం జీవక్రియను పెంచి బరువు తగ్గటంలో సాయపడుతుంది.
ఎముకల కోసం
పచ్చి పనీర్ తీసుకోవడం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. అందుకే రెగ్యులర్ (Regular)గా పనీర్ తీసుకోవాలి. దాంతో పాటు జాయింట్ పెయిన్స్ కూడా తగ్గుతాయట.
ఇందులో విటమిన్ డి, హెల్తీ ఫ్యాట్స్, కాల్షియం ఉంటాయి.ఎర్ర రక్తకణాల అభివృద్ధికి సహకరిస్తుంది
మధుమేహం (Diabetics) రాకుండా నిరోధిస్తుంది
పన్నీర్‌తో ఎముకలు, దంతాలు ధృఢంగా ఉంటాయి
శరీరంలోని కొవ్వును (Fat) కరిగిస్తుంది
గర్భంలోని పిండాభివృద్ధికి సహకరిస్తుంది
రొమ్ము క్యాన్సర్‌ను నివారిస్తుంది
వెన్నునొప్పి, కీళ్ల బాధల్ని తగ్గిస్తుంది
మోతాదుకు మించి తీసుకుంటే
అవునండీ ..ఏ ఆహార పదార్థం అయినా మోతాదు ని మించి తీసుకుంటే ప్రమాదమే .. అలాగే పన్నీర్ కూడా మోతాదుకు మించి తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్‌లో నూనెలో వేయించిన పన్నీర్ ఎక్కువగా తింటే మాత్రం బరువు పెరుగుతారు.
పరిమిత మోతాదులో, అంటే ప్రతీ రోజుకు 60 -70 గ్రాములకు గ్రాములకు మించకుండా పన్నీర్ తీసుకుని, మిగతా ఆహారాన్ని కూడా కెలోరీ పరిధికి లోబడి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
మధుమేహం (Diabetics) ఉన్నవారు కూడా
మాంసకృత్తులు ఎక్కువగా ఉన్నా, పిండి పదార్థాలున్నప్పటికీ పన్నీర్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి మధుమేహం ఉన్నవారు ఏ మాత్రం సందేహం లేకుండా కూడా తీసుకోవచ్చు.
వంద గ్రాముల పన్నీర్ లో దాదాపుగా 250 నుండి 300 కెలోరీలు ఉంటాయి…
బరువు తగ్గాలనుకునే వారు – Weight loss
అధిక బరువు ఉన్నవారు కూడా పనీర్ తీసుకోవచ్చు. పానీర్లోని మాంసకృత్తుల వలన ఆకలి త్వరగా వేయదు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు కూడా ఓ పూట పనీర్ తీసుకొంటే బరువు తగ్గేందుకూ బాగా ఉపయోగ పడుతుంది. …
చూసారా ?? పన్నీర్ లో ఎన్ని లాభాలు ఉన్నాయో … ఇక ఆలస్యం ఎందుకు ,ఇన్ని ప్రయాజనాలు ఉన్న ,ఎంతో రుచికరమైన పన్నీర్ ని ఎటు వంటి సందేహం లేకుండా రోజు వారి ఆహారం లో భాగంగా చేసుకుని ఆరోగ్యంగా జీవించండి.