గ్రీన్ టీ(Green Tea) చాలా సమస్యలకు పరిష్కారం, స్థూలకాయం తగ్గించుకునేందుకు రక్తపోటు నియంత్రణ(BP Controls)కు ఇలా చాలా రకాల అనారోగ్య సమస్యలు(Health Issues) దూరం చేస్తుంది.
అంతేకాదు ముఖ్యంగా గ్ర్రీన్ టీ సేవించడం వల్ల డయాబెటిస్ నియంత్రణ(Diabetes Control)లో ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.
గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. సన్నబడటానికి ఎక్కువగా గ్రీన్ టీ వాడుతుంటారు. అయితే గ్రీన్ టీ కేవలం డైటింగ్(Dieting) కోసమే కాదు..ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనకరమని(Benefits) తెలుసా మీకు.
గ్రీన్ టీ రోజూ సేవిస్తే గుండె(Heart) పదికాలాలపాటు పదిలంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
శరీరం(Body)లో రోగ నిరోధక(Immunity Power) శక్తి పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు క్రమం తప్పకుండా తీసుకుంటే..రక్తపోటు అదుపులో ఉంటుంది. క్యాన్సర్ కణాలు(Cancer Cells) వృద్ధి చెందకుండా ఉంటాయి.
టైప్ 2 డయాబెటిస్(Type 2 Diabetes) ఉన్నవారు ప్రతిరోజూ గ్రీన్ టీని సేవిస్తే..మీ శరీరంలో షుగర్ లెవెల్స్(Sugar Levels) అదుపులో ఉంటాయి. ఎందుకంటే గ్రీన్ టీలో కోట్లిన్ (Kotlin) అనే యాంటీ ఆక్సిడెంట్(Anti Oxidant) పుష్కలంగా ఉంటుంది.
మనిషి శరీరం..కార్బొహైడ్రేట్ల(Carbohydrates)ను త్వరగా జీర్ణం(Digestive) చేయకుండా నియంత్రిస్తాయి. ఫలితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్(Insulin Resistance) తగ్గుతుంది. బరువు ఎప్పుడైతే తగ్గుతుందో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. శరీరంలో ఉన్న ఇన్సులిన్ సరిగ్గా వినియోగం అవుతుంది.
దీంతో రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఈ విధంగా టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు రోజూ 2-3 కప్పుల గ్రీన్ తాగితే మంచిది.
అయితే గ్రీన్ టీ వైద్యుల సూచన(Doctors Advice) లేకుండా మధుమేహం నియంత్రణకు వాడకూడదు. వైద్యుల సూచన మేరకే గ్రీన్ టీ తీసుకోవాలి.
ఎందుకంటే గ్యాస్(Gas), ఎసిడిటీ(Acidity) , కెఫీన్ అలర్జీ(Caffeine Allergy) ఉన్నవారికి గ్రీన్ టీ అంత మంచిది కాదు. మితంగా తీసుకోవాలి. గ్రీన్ తాగినప్పుడు ఏదైనా సమస్యగా అన్పిస్తే మానేయడం మంచిది. డయాబెటిస్ సమస్య ఉన్నవారికి మాత్రం గ్రీన్ టీ ఓ దివ్యౌషధమే(Medicne) అనడంలో సందేహం లేదని వైద్యులు సూచిస్తున్నారు.
మార్కెట్లో ప్రస్తుతం గ్రీన్ టీ వివిధ రకాల రుచు(Different Tastes)ల్లో లభిస్తోంది.
గ్రీన్ టీ లెమన్(Green tea Lemon), గ్రీన్ టీ హనీ(Green tea Honey), గ్రీన్ టీ జింజర్(Ginger), గ్రీన్ టీ తులసి(Tulasi) ఇలా చాలా రకాలున్నాయి. మన అవసరానికి తగ్గట్టుగా ఎంచుకోవాలి.