GPS (Global Positioning System). దీని గురించి దీని వాడకం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మన దేశంలో కూడా దీని వాడకం తక్కువేమీ కాదు పెద్ద పెద్ద నగరాలలో కాల్ టాక్సీ దగ్గర నుంచీ కావాల్సిన restaurant వరకూ అన్ని దీని ద్వారానే తెలుస్తాయి. కార్లలో, ఫోన్లలో దీని ద్వారా మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. సాటిలైట్ల ద్వారా పని చేసే ఈ GPS సేవలు బాగానే ఉన్నా దీనికీ కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏదైనా ఊరిలో ఏ రోడ్ మీద ఉన్నామో చెప్పగలదు కానీ అదే రోడ్ మీద ఎక్కడ ఉన్నామో చెప్పలేదు. అంటే మీటర్ల కంటే సెంటీ మీటర్ల లో చెప్పగలిగే accuracy లోపించింది అన్న మాట. అందువల్లనే మరింత మెరుగైన GPS ను గూర్చి పరిశోధనలు జరుగుతున్నాయి.
University of California లో Bourn’s College of Engineering లోని ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ ఇంజనీరింగ్ ప్రొ. Jay Farrel తన బృందం తో కలిసి మెరుగైన GPS ను తయారు చేసారు. వారి పరిశోధన ప్రకారం ప్రస్తుతం మనం ఉన్న చోటు నుంచీ 10 మీటర్ల మేర వరకూ ఖచ్చితంగా చూపించగలిగే GPS, ఇప్పుడు మరింత మెరుగై 1 మీటరు పరిధి వరకూ మనం ఉన్న చోటును చూపించగలదు. దీనినే DGPS (Differential GPS) అంటారు. అయితే ఇంతటితో తృప్తి పడలేదు Farell. ఒక్క సెంటీ మీటరు వరకూ accuracy ని పెంచేందుకు సాటిలైట్ల ద్వారా వచ్చే సమాచారాన్ని, మన పరికరాల్లోని సెన్సార్ల కు అనుసంధానం చేసి ఒక్క సెంటీ మీటరు వరకు accuracy ని సాధించగలిగారు. అయితే గతంలో ఈ పనికి పెద్ద పెద్ద కంపూటర్లు కావాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఈ పని కంప్యూటర్ algorithms, low-power processors ద్వారా సాధ్య పడింది. అందువల్లే ఈ 1 cm accurate GPS మన కార్లలోనూ, ఫోన్లలోనూ ఉపయోగించడానికి వీలవుతుంది.
ఇప్పుడు దీని వల్ల ఏంటి లాభం అనుకుంటే భవిష్యత్తులో డ్రైవర్ లెస్ కార్లకూ, వ్యాపార వాణిజ్య అవసరాలలో పెను మార్పులకు కారణమవుతుంది. వినియోగదారులకు మరింత సౌకర్యంగా ఉంటుంది అని అంటున్నారు Farell. ఈ పరిశోధనను “IEEE Transactions on Control Systems Technology” లో ప్రచురించారు.