నిరాశ, దిగులు, మనసు బాగోకపోవడం ఇలాంటివి అందరి జీవితాల్లో ఎప్పుడొక్కసారి వస్తూనే ఉంటాయి. అయితే లక్షణాలు నిరంతరం వెంటాడుతుంటే దాన్ని డిప్రెషన్(Depression) గా పరిగణించాలి. మానసిక సమస్యలను అప్పటికప్పుడు తగ్గించే మందులు మనకు మెడికల్ షాప్లు(Medical Shop)ల్లో దొరకవు మానసిక వైద్యుల(Psychiatrists) వద్ద తగిన చికిత్స(Treatment) తీసుకోవాల్సి ఉంటుంది. అయితే డిప్రెషన్ నుండి మనలని తేలికగా బయట పడేసే మందు మన దగ్గరే వుంది, అదే వ్యాయామం.
అవును వ్యాయామం(Exercise)తో డిప్రెషన్ తగ్గించుకునే అవకాశం వుంది. ఆ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.
వ్యాయామం(Exercise) చేసినప్పుడు మన మెదడు(Brain)లో ఫీల్ గుడ్ రసాయనా(Feel Good Chemicals)లు విడుదలవుతాయి. ఇది డిప్రెషన్(Depression)ని తగ్గించడంలో చాలా బాగా పని చేస్తాయి. ఇప్పటికిప్పుడు వ్యామామ చేసేయాలా అనుకునే వారు, చిన్నపాటి నడకతో కూడా వ్యాయామం మొదలుపెట్టవచ్చు. నడక(Walk)తో శరీరానికి వ్యాయామం అవడమే కాకుండా, బయటి వాతావరణం మనసుకి శాంతిని, ఉపశమనం ఇస్తుంది. అలాగే యోగ(YOGA) తో కూడా శరీరం శక్తివంతంగా మారుతుంది. శ్వాస(Breathe)ని నియంత్రణ(Control)లో ఉంచే యోగాసనాలు సైతం మనసుని శాంతపరిచి, భావోద్వేగాల(Emotions)ను అదుపులో ఉంచుతాయి. డిప్రెషన్(Depression) నుంచి బయటపడేందుకు తోటపని(Garden Work) కూడా చాలా బాగా ఉపకరిస్తుంది. మతిలో చేసే తోట పనితో మెదడులోని సెరోటోనిన్(Serotonin) ఉత్పత్తి(Produce) అవుతుంది. ఇది డిప్రెషన్(Depression) ని తగ్గించడంలో తోడ్పడుతుంది. అలాగే టెన్నిస్ ఆట(Tennis Game) వలన కూడా మనలోని భావోద్వేగాలకు ఉపశమనం కలుగుతుంది. ఒక్కోసారి మన ఆలోచనలను నియంత్రించుకోవడం మనకు కష్టంగా మారుతుంది. ఇలాంటప్పుడు వాటినుంచి మన మెదడును మళ్లించాల్సివుంటుంది.
డెస్క్ జాబ్(Desk Job) చేసేవారు అప్పుడప్పుడు వర్క్ ప్లేస్(Work Place) నుంచి లేచి కాస్త నడవడం మంచిది. మనసు బాగాలేనప్పుడు ఎదో ఒక రూపంలో శరీరాన్ని కదిలించాలి. ఈత కూడా శరీరానికి చక్కని వ్యాయామం(Exercise) ఇస్తుంది. కొంతమందికి నెలల్లో ఉండడం వలన మనసుకి శాంతినిస్తుంది. స్టేషనరీ సైకిల్(Stationary Cycle) ని తొక్కడం వలన కూడా చక్కని వ్యాయామం జరుగుతుంది. వీలైతే చిన్నపాటి దూరాలకు సైకిల్ పైన వెళ్లడం వలన కూడా శరీరానికి వ్యాయామం జరిగి మనసుకి ఉపశమనం(Relax) కలుగుతుంది. వ్యాయామం చేయడం అలవాటు లేనివారు రోజుకి అరగంట చొప్పున వారానికి 3 నుండి 5 సార్లు వ్యాయామం చేసిన మంచి ఫలితం పొందవచ్చు. అలాగే వ్యాయామం తో శరీరం బలంగా, శక్తివంతంగా, అందంగా మారటం వలన కూడా మనసుకు ఉల్లాసంగా, ఉత్సహంగా అనిపిస్తుంది. చాలా తేలికపాటి ప్రయత్నాలు సైతం డిప్రెషన్ నుండి బయటపడేలా చేస్తాయి. మన మానసిక స్థితిని మార్చేసే డాన్స్(Dance) చేసిన, నలుగురితో కలసి మెలసి వుండే అవకాశం వున్న డిప్రెషన్ ఆలోచన నుంచి బయటపడవచ్చు.
డిప్రెషన్(Depression) తో బాధపడే వారు తప్పకుండ తమకు అనుకూలమైన వ్యాయామం(Exercise) ఎదో ఒకటి అలవాటు చేసుకోవడం మంచిది. తమ ఆరోగ్య స్థితిఃని(Health Condition) బట్టి వైద్యుల సలహా మేరకు వ్యాయామాన్ని ఎంపిక చేసుకోవాలి. వాకింగ్(Walking), జాగ్గింగ్(Jagging), యోగ(Yoga) లాంటి వాటిలో తమకు తగినది ఎంచుకోవాలి. అలాగే బాస్కెట్ బాల్ ఆటతో కూడా పరిగెత్తడం(Running), ఎగరడం(Jumping), గెంతడం లాంటివి చేసే అవకాశం ఉంటుంది. ఎక్కువ సమయం ఆట మీద ఏకాగ్రత(Concentration) పెట్టి ఆడడం వలన నెగటివ్ ఆలోచనలు(Negative Thought) తగ్గుతాయి. అలాగే టీంగా ఆడడం వలన ఒక్కరితో ఒక్కరికి అనుబంధం పెరిగి ఆహ్లాదనభవనాల (Pleasure)తో మనసునిండా అవకాశం వుంది. డిప్రెషన్ మన జీవితాల(Life)ను ఎన్నో రకాలుగా మార్చేస్తుంది. జీవితంలో అనుకున్నవి సాధించకుండా అడ్డుకుంటింది. డిప్రెషన్ తీవ్రమైతే మనం రోజు వారి చేసే పనులు సైతం కుంటుపడతాయి. అలాంటి స్థితికి చేరకుండా ఉండాలంటే శరీరాన్ని చురుకుగా ఉంచే వ్యాయామాలు చేయడం మంచిది. శరీరం(Body) చురుకుగా వున్నపుడు ఆ ప్రభావం(Influence)తో మనసు(Heart) కూడా ఉల్లాసంగా(Hilarious), ఉత్సహభరితం(Excited)గా మారుతుంది.