ఖర్జురమ్(Dates) ఈ పేరు వింటే చాలు నోట్లో నీళ్లూరుతాయి. ఈ ఖర్జుర పండు ఎండిన కూడా రుచిగానే ఉంటుంది. ఇందులో ఔషధ గుణాలు కూడా వున్నాయి.ఈ ఖర్జురాలను రోజు తింటే రోగ నిరోధక(immunity power)శక్తి ని పెంచే శక్తి పెరుగుతుందని వైద్యనిపుణులు చెప్తున్నారు. ఇందులో విటమిన్స్, మినరల్స్, కాల్షియమ్ మరియు ఐరన్ పుష్కలంగా వున్నాయి. ఈ హేల్ది ఫుడ్ ఎన్నో రకాల సమస్యలను తగ్గించడంలో సహాయ పడుతుంది. ఖర్జురమ్ దాగున్న మరిన్ని ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఖర్జురాలని(Dates) పోషక ఖజానాగా పిలుస్తారు. ఈ పండును ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వీటిని నేరు గా తినడంతో పాటు కుకీస్,పచ్చళ్ళు, హల్వా,చాక్లెట్, సిరప్ పాయసం తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఖర్జురాలని మూడు రకాలు గా విభజించారు. అందులో మొదటిది మెత్తనివి, ఇందులో తేమ ఎక్కువ, తీపి తక్కువగా ఉంటుంది. రెండు రకం కొద్దీగా ఎండినవి ఇందులో తేమ తక్కువ, తీపి ఎక్కువ ఉంటుంది. ఇక మూడవది పూర్తిగా ఎండినది. ముదురు రంగు ఖర్జురాలను కింగ్ అఫ్ డేట్స్(king of dates) గా పిలుస్తారు పోషకాహార నిపుణులు. ఖజురాలను ప్రోటీన్ పవర్ హౌస్(protein power house) అంటారు.
ఆ ఎడారి పండ్ల(desert fruit)కు ఉన్న విశిష్టత అంత ఇంత కాదు. ఈ ఖర్జురమ్(dates) ఎండితే మరింత తీయగా ఉంటుంది. ఖర్జురాల్లో ఫైబర్(fiber) చాలా ఎక్కువ గా ఉండడం వల్ల, అవి శరీరంలో చేదు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. హై బీపీ వున్నవారు వీటిని క్రమం తప్పకుండ తినడం వల్ల గుండె జబ్బులు,పక్షవాతం వంటివి కూడా తగ్గుముఖం పడతాయి. అంతే కాదు మూత్రపిండాలలో రాళ్ళూ కరగాలంటే ఖర్జురా పండ్లు తరుచుగా తినాలంటున్నారు పోషక ఆహార నిపుణులు. ఈ పండ్లను తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. అలాగే వడదెబ్బ నుండి ఉపశమనం లభిస్తుంది.
ఖర్జుర పండు చర్మ సౌందర్యానికి, జుట్టు అందానికి కూడా గొప్ప గా సహాయ పడుతుంది. ఇందులో ఐరన్(iron) , ఇతర విటమిన్స్(vitamins) అధికంగా ఉండడం వల్ల ఇది జుట్టు రాలడం తగ్గించి పెరిగేలా చేస్తుంది.ఆరోగ్యకరమైన బరువు పెంచేందుకు తోడ్పడుతుంది. కాబట్టి రోజువారీ ఆహారంలో ఖర్జురాని చేర్చుకోవడం మంచిది. వయసుతో సంబంధం లేకుండా అని వయసు వారు ఎంతో ఇష్టం గా తినే ఈ ఖర్జురాలను ప్రాసెసింగ్ ద్వారా చక్కర, జెల్లీ, జ్యూస్, సిరప్ గా మర్చి విక్రయిస్తున్నారు. మన దేశం (India)లో85 శాతం మంది యుక్త వారు మహిళల్లో రక్త హీనత ఎక్కువగా ఉండడం వల్ల వారు ఖర్జురాలను ఎక్కువ గా తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.ఖర్జురాల్లో ఐరన్ మరియు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాల్షియమ్, పొటాషియం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కప్పేర్ లు కూడా పుష్కలంగా ఉంటుంది. పిల్లలు, వ్రుదులు ఏదైనా జబ్బు నుంచి కోలుకునే వారికి ఇది మంచి ఆహారంగా పని చేస్తుంది. ఇది ఆరోగ్య ప్రయోజకారిగానే కాకుండా చర్మ సౌందర్యానికి, జుట్టు అందాన్ని ఇరుగు పరచడానికి సహకరిస్తుంది.
నానబెట్టి పొడికొట్టిన విత్తులు పశువుల మేతకి ఎలానూ పనికివస్తాయి. సబ్బులు, సౌందర్య సాధనాల తయారీలో విత్తనాల నుంచి తీసిన తైలం వాడతారు. ఆక్జాలిక్ ఆమ్లానికి ఈ విత్తులే మంచి వనరులు.కాఫీ బీన్స్ మాదిరిగా వీటిని కాఫీపొడిలో కలుపుతుంటారు. ఖర్జూర ఫలాలే కాదు, పుష్పాలూ( date )flowers రుచికరమైనవే. అందుకే ఆయా దేశాల మార్కెట్లలో వీటిని ప్రత్యేకంగా అమ్ముతారు. పూమొగ్గల్ని సలాడ్లలో ఎండుచేపల కూరల్లో వాడతారు. ఖర్జూరం(dates)తో వైద్యంపెద్దపేగులోని సమస్యలకు ఈ పండులోని టానిన్ చక్కగా ఉపయోగపడుతుంది.గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం లాంటివాటికి ఈ పండు గుజ్జు లేదా సిరప్ మంచి మందు గా పనిచేస్తుంది. డయేరియా, మూత్రాశయ సమస్యల్ని నివారించేందుకు కాండం నుంచి తీసిన జిగురును వాడతారు. చెట్టువేళ్లను నూరి పెట్టుకుంటే పంటినొప్పీ (tooth ache) కి ఉపశమనం కలుగుతుంది.