తమిళ స్టార్ హీరో దళపతి విజయ్(Vijay), పూజా హెగ్డే(pooja Hegde) జంటగా నటిస్తున్న చిత్రం ‘బీస్ట్’(Beast). ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్(Sun Pictures) ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.షూటింగ్(Shooting) మొదలై చాల రోజులైనా, ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్(Updates) లేవు. అయితే వేలంటైన్స్ డే(Valentine’s Day) సందర్భంగా సోమవారం ఈ మూవీ నుంచి అరబిక్ కుత్తు(Arabic Kuthu) అనే పాటను విడుదల చేశారు.దింతో ఫాన్స్(Fans) ఎదుచూపులకు తెర దించుతూ, బీస్ట్ చిత్ర యూనిట్(Movie Unit) తాజాగా సినిమాలోని ఫస్ట్ సింగిల్(First Single)ను విడుదల చేసింది. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ పాటను ప్రముఖ హీరో శివ కార్తీకేయన్(Siva Karthikeyan) రాయడం.
నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dileep Kumar) దర్శకత్వం(Direction) వహిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్(Pan India Range)లో రిలీజ్ చేయనున్నారు. రాజకీయ(Political) నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్(Post Production) పనులు జరుపుకుంటోంది. అనిరుద్ రవిచంద్రన్(Anuridh Ravichandran) సంగీతం(Music) అందించిన ఈ పాటను ఆయనతో పాటు జోనితా గాంధీ(Jonitha Gandhi) పాడారు. పాటలో కొన్ని అరబిక్ పదాలు(Arabic Words), తమిళ పదాలు, ఇంగ్లీష్ పదాలు మిక్స్ చేసి ఉన్నాయి. లవ్ సాంగ్(Love Song)ను గ్రాండియర్‌గా కమర్షియల్ స్టైల్లో స్టెప్పులు(Commercial Style Steps) వంటి భారీ హంగామా(Hungama)లో తెరకెక్కించారు. ఇందులో విజయ్, పూజా హెగ్డే స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. వేలైంటైన్స్ డే సందర్భంగా తమ అభిమాన హీరో ఇచ్చిన ఈ గిఫ్ట్(Gift) చూసి దళపతి విజయ్ ఫాన్స్(Vijay Fans) చాలా సంతోషం(Happy)గా ఫీలవుతున్నారు.
కొన్ని రోజుల ముందు సదరు అరబిక్ కుత్తు సాంగ్‌కు సంబంధించి ఓ చిన్న వీడియోను విడుదల చేయగా, ఫాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అందులో అనిరుద్, డైరెక్టర్ నెల్సన్, శివ కార్తీకేయన్ చేసిన జోష్ అందరినీ ఆకట్టుకుంది. సినిమాలను ఎంటర్టైనింగ్గా రూపొందించడంలో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఆయన గత చిత్రాలు కొలమావు కోకిల, డాక్టర్లను చూసినట్లయితే ఆ సంగతి తెలుస్తుంది. బీస్ట్ సినిమాను కూడా అభిమానులకు కావాల్సిన కమర్షియల్ హంగులు కలిపి ఎంటర్టైనింగ్గా తెరకెక్కించారు. ఏప్రిల్ 14న బీస్ట్ రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తర్వలోనే రానుంది.