మీరు చీజ్(Cheese), లవర్ అయితే , ఇది మీ కోసం! భారతీయ సంస్కృతి(Indian Culture)లో, శాఖాహారం(Vegetarian) లేదా శాకాహారిగా ఉండటం సర్వసాధారణం, మీరు కనీసం పనీర్(Paneer) గురించి విని ఉంటారు. పనీర్ అనేది భారతీయ చీజ్(Indian cheese), ఇది పెరుగు(Curd), పాలు(Milk), మరియు నిమ్మరసం(Lemon)తో తయారు చేయబడింది. పనీర్ తో రకరకాల వంటకాలు(different Dishes) ఎంతో రుచికరం(Tasty)గా చేసుకోవచ్చు. దహి పనీర్ గ్రేవీ(Dahi Paneer Gravy) రోటీ(Rotis)లోకి రుచిగా ఉంటుంది. మరి ఈ క్రీమీ పనీర్ కర్రీ(Creamy paneer Curry) కోసం గ్రేవీని తయారు చేయడానికి కీలకమైన పదార్థం(Key Ingredient) పెరుగు(Yogurt). అది ఎలా చేయాలో చూద్దాం
కావాల్సిన పదార్థాలు:
పెరుగు 2 కప్పులు
పనీర్ 1 కప్పు ముక్కలు
ఉప్పు తగినంత
కారం 2 చెంచాలు
గరం మసాలా 1 చెంచా
ధనియాల పొడి 1 చెంచా
అల్లం వెల్లులి ముద్దా 1 చెంచా
ఉల్లిపాయ 1
నూనె 4 చెంచాలు
తయారు చేయు విధానం:
- ముందుగా ఒక గిన్నె లో పెరుగు వేసి అందులో ఉప్పు కారం అల్లం వెల్లులి పేస్ట్ గరం మసాలా వేసి బాగా కలుపుకొని
- అందులో పనీర్ వేసి 10 నిముషాలు నానబెట్టుకోవాలి
- తరువాత ఒక బాణీ పెట్టుకొని అందులో నూనె జీలకర్ర వేసి వేగిన తరువాత ఉల్లిపాయ(Onion) వేసి వేయించుకొని నానబెట్టుకున పెరుగు, పనీర్ ని వేసి నూనె తేలే వరకు ఉడికించుకోవాలి అంతే,
దహి పనీర్ కర్రీ రెడీ(Ready) వీటిని రోటీలోకి చాలా టేస్టీ(Tasty)గా ఉంటుంది.