సుగంధ ద్రవ్యాల(Aromatic Spices)లో ఒకటిగా చెప్పుకోదగినది జీలకర్ర. ప్రకృతి ప్రసాదించిన(Nature Gift) జీలకర్ర(Cumin Seeds)ను మనం తప్పనిసరిగా ప్రతి వంట(Recipes)ల్లో వాడుతుంటాం.
ఆహారానికి సువాసన(Aroma)తో పాటు రుచి(Taste)ని కూడా తీసుకొస్తుంది. జీలకర్రలో అద్భుతమైన ఔషధ గుణాలు(Medicinal Properties) పుష్కలంగా వున్నాయి.
ఆరోగ్యంతో పాటు అందాన్ని ఇచ్చే జీలకర్ర వలన కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
జీలకర్ర జీర్ణక్రియ(Digestive system)ను మెరుగుపరుస్తుంది. జీలకర్ర లో థైమోల్(Thymol) అనే కెమికల్(Chemical) ఉంటుంది. ఆహారపడరాదలను త్వరగా జీర్ణమవటానికి ఉపయోగపడే లైపేజ్(Lipase), ఏమైలేజ్ ప్రోటియిజ్(Amylase Protease), బైల్ జ్యూస్(Bile Juice) వంటి జీర్ణాది రసాయాలని(Chemicals), ఎంజయ్మ్స్(Enzymes) ని బాగా ఉత్పత్తయ్యేట్టు చేస్తుంది. జీలకర్ర(Cumin Seeds) ముఖ్యంగా స్థూలకాయం(Obesity)తో అధిక బరువుతో బాధపడుతున్నవారు రోజూ చిటికెడు జీలకర్రతో చాలా తక్కువ రోజుల్లోనే పరిష్కారం పొందవచ్చని కొన్ని అధ్యాయనా(Survey)లు తెలుపుతున్నాయి.
కేవలం జీలకర్ర వంటలకు మాత్రమే కాదు ఆరోగ్యం మెరుగుపడేలా కూడా సాయం చేస్తుంది. అయితే అలాంటి జీలకర్రను నీటిలో నానబెట్టి(Soak in Water) లేదా మరిగించి తాగితే ఆరోగ్యవంతంగా ఉండొచ్చంటున్నారు వైద్య నిపుణులు. జీలకర్ర నీరు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. జీలకర్రలో శరీరంలోని కొవ్వును కరిగించే గుణం ఉంది. కావున జీలకర్ర నీటిని ఉదయాన్నే తాగడం వల్ల శరీరంలోని కొవ్వును సులువుగా తగ్గించుకోవచ్చు.
కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉన్నా దూరం అవుతుంది. శరీరంలోని వ్యర్థాలు(Wastage) కూడా బయటకు వెళ్లిపోతాయి. తరచూ ఒత్తిడి(Stress)కి గురయ్యే వారు.. జీలకర్రని నీటిలో మరిగించి అందులో కొంచెం నిమ్మరసం(Lemon), తేనె(Honey) కలిపి టీలా తాగితే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు(Experts) పేర్కొంటున్నారు. ఇలా సులువుగా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. షుగర్ వ్యాధి(Diabetes)తో బాధపడేవారు కూడా జీలకర్ర నీటిని తాగేతే మంచిది.
ప్రతిరోజూ ఈ నీటిని తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంటాయి. రక్తపోటు(BP) సమస్య కూడా అదుపులో ఉంటుంది. దీంతో రక్త సరఫరా(Blood Circulate) మెరుగుపడి గుండె సమస్యలు(Heart Attack) రాకుండా ఉంటాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే జీలకర్ర ఆకలిని పెంచుతుంది.
కడుపులో ఏర్పడే అల్సర్(Ulcer) లను మరియు పరాన్న జీవులను కూడా నివారిస్తుంది. ఇందులో వుండే యాంటీ ఇంఫలమటరీ(Anti-Inflammatory) లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మ సమస్యల(Skin Problems)ను నివారిస్తుంది. చర్మం పై ఏరపడ్డ ముడతలు(Wrinkles) మరియు పొడిబారి(Dryness) సమస్యలను తగ్గిస్తుంది.
చర్మానికి కావాల్సిన పోషకాల(Nutrients)ను అందించి ముకానికి నిగారింపును అందిస్తుంది. మూత్రాశయ సమస్యల(Urinary infections)ను తగ్గిస్తుంది.
జీరా వాటర్‌ను తీసుకోవడం వలన కిడ్నీ ఏరపడ్డ రాళ్లు(Kidney Stones) సైతం కరుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.శరీరంలోని హానికరమైన టాక్సిన్(Toxins) లను బయటకు పంపుతుంది. ప్రేగు(Intestines)ల్లో వున్నా వ్యర్దాలను తొలగిస్తుంది. జీలకార సేవించడం వల్ల కడుపులో ఏర్పడ్డ వికారం మరియు కడుపు ఉబ్బరంగా వుండే సమస్యలను నివారిస్తుంది. అంతే కాకుండా అతిగా వచ్చే త్రేన్పులు సమస్యను తగ్గిస్తుంది.
ఉదర ఆరోగ్యాన్ని పెంచుతుంది. మొలల వ్యాధి(Piles Problem) నుండి ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలో ఏర్పడే అనారోగ్యాలను తగ్గిస్తుంది. జలుబు(Cold), దగ్గు(Cough)లను కూడా తగ్గిస్తుంది. మలబద్దకం మరియు గ్యాస్ సమస్యల(Gas Problems)నునివారించడంలో జీలకర్ర బాగా పని చేస్తుంది.బరువు తగ్గేందుకు కూడా జీలకర్ర అమోఘంగా దోఁహదపడుతుందని వైద్య నిపుణులు సెలవిస్తుంటారు. జీలకర్రలో ఉండే యాంటీఆక్సిడెంట్స్(Anti Oxidants) వల్ల ఇది వ్యాధినిరోధకత(Immune system)ను పెంచుతుంది.
జీలకర్ర ద్రవాన్ని(Jeera Water) తాగితే ఆ రోజంతా మీరు ఫ్రెష్(Fresh)గా ఉంటారు. అమెరికా(America)లోని సౌత్ కరోలినాలో గల క్యాన్సర్ రీసెర్చ్ ల్యాబరేటరీ ఆఫ్ హిల్టన్ హెడ్ ఐల్యాండ్ అధ్యయనం ప్రకారం.. జీలకర్ర క్యాన్సర్(Cancer)పై పోరాడుతుంది. శరీరంలో గెడ్డలను నివారించే శక్తి దీనికి ఉంది. కాలా జీరా(నల్ల జీలకర్ర)లో ఈ గుణాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.
జీలకర్రలో ఉండే పోటాషియం(Potassium) హార్ట్ పేషెంట్ల(Heart Patients)కు మేలు చేస్తుంది. బీపీ, హార్ట్ రేట్లను నియంత్రిస్తుంది. శ్వాస సమస్యలు(Breathing Problems), వాపు, జాయింట్ ఇన్ఫెక్షన్లు(Swelling Joint Infections), పేగు సంబంధిత వ్యాధులు, కంటి సమస్యలు, పంటి నొప్పికి(Teeth Pain) ఇది మంచి ఔషదం.
ఒళ్లు వేడెక్కడం(Body Heat), దురదలు(Rashes) రావడం వంటి సమస్యలు ఏర్పడితే నీటిలో వేసి మరిగించి, చల్లారిన తర్వాత ఆ నీటితో స్నానం(Bath) చేయండి.
మరింత ఆరోగ్యంగా ఉండడానికి జీలకర్రను ఆరోగ్యపరంగా ఎంత మోతాదులో తోసుకోవాలో పౌష్టికాహార(Nutrients) నిపుణుల సలహా(Experts Advice) తీసుకోవడం మంచిది.