చందమామ రావే,జాబిల్లి రావే అని పాడించుకుంటూ పెరిగిన వాళ్ళమే మనమంతా .. మామా,చందమామ అని ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటూ ఉంటాం. అలాంటి మనందరి మూన్ మిషన్‌కు (Moon Machine) చంద్రయాన్-3ని చేరువ చేసేందుకు బాహుబలి రాకెట్‌ను మన భారతీయులు ప్రయోగించారంటే ఎంతో గర్వించదగ్గ విషయమే.
మేర భారత్ మహాన్ అంటూ కోట్లాది ప్రజల విశ్వంసల తో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి చంద్రయాన్-3 జువ్వంటూ నింగిలోనికి దీసుకుపోయింది జులై 14,2023 న.
మరి ఇప్పుడు ఈ క్నాద్రయాణ్-3 గురుంచి మరిన్ని వివరాలు చూసేద్దామా !
ఫెయిల్యూర్ ఆధారిత విధానంతో అభివృద్ధి చేసిన టెక్నాలజీ (technology) తో చంద్రయాన్ 3 ప్రయోగం జరిగింది. నిజానికి భారత్ (Bharath) ఒక్కటే కాదు చంద్రయాన్ 3 ప్రయోగం కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఇస్రో సక్సెస్ రేటుకు తోడు భారతీయ శాస్త్రవేత్తల పరిజ్ఞానం..
అంతరిక్ష ప్రయోగాల్లో ఇప్పటికే భారత్‌ను తిరుగులేని శక్తిగా మార్చింది. చంద్రయాన్ సిరీస్‌లో ఇదో మూడో ప్రయోగం.
2019లో చేపట్టిన చంద్రయాన్ -2 (Chanrayan-2) ప్రయోగం విఫలమైన నేపథ్యంలో, ఈ మూన్ మిషన్ చంద్రయాన్-3 ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ఇస్రో. దీన్ని విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లనూ చేసింది.
వారి అంచనాలకు అనుగుణంగా తొలి దశలో చంద్రయాన్-3 ప్రయాణం చాలా సవ్యంగా సాగింది. ప్రయోగాత్మకంగా ,దశలవారీగా అన్ని రాకెట్ నుంచి విడిపడినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇపుడు చంద్రయాన్-3, చంద్రయాన్-3లో ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉన్నాయి. దీని బరువు దాదాపు 3,900 కేజీలు.
ఇది LVM3M4 రాకెట్ ద్వారా పంపబడింది , ఇంతకుముందు ఈ రాకెట్‌ను GSLVMK3 అని పిలిచేవారట .
భారీ పరికరాలను మోసుకెళ్లడం అనేది దీని ప్రత్యేకత..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంతరిక్ష శాస్త్రవేత్తలు దీనికి మరో పేరు కూడా పెట్టారు,అదేంటో తెలుసా , ‘ఫ్యాట్ బాయ్’.. .
ఉపరితల వాతావరణం, చంద్రశిలలు, మట్టి నమూనాలను సేకరిస్తుంది.
చంద్రుడి కక్ష్య నుంచి భూమి యొక్క స్పెక్ట్రల్- పోలారిమెట్రిక్ కొలతలను అధ్యయనం చేయడానికి స్పెక్ట్రో-పోలరిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (షేప్) పేలోడ్‌ను (Payload )ఈ రాకెట్‌తో పాటూ పంపించారు.
ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్, ఆల్ఫా పార్టికల్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్, లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పోక్ట్రోస్కోపీ ఇటు వంటివి ఈ రాకెట్ పేలోడ్స్.
ఈ రాకెట్. , ఆ గస్టు 23 లేదా 24 తేదీల్లో చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది చంద్రయాన్-3. ల్యాండింగ్ సమయంలో చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన ల్యాండర్‌కు సంబంధించిన ఎలక్ట్రో మేగ్నటిక్ ఇంటర్ఫెరెన్స్/ఎలక్ట్రో మేగ్నటిక్ కాంపాటిబిలిటీ, ఆటో కాంపాబిలిటీ టెస్ట్, రేడియో ఫ్రీక్వెన్సీ సిస్టమ్, యాంటెన్నా పోలరైజేషన్, ల్యాండర్, దానికి అమర్చిన రోవర్, అన్ని సవ్యంగా పని చేయాల్సి ఉంటుంది.చందమామ దక్షిణ ధృవం వద్ద ల్యాండ్ అవుతుంది.
ఈ విజయంలో , పలువురు ప్రముఖులు భారత్ ని ప్రశంసల వర్షం లో కురిపించి ,ఇస్రో (ISRO) శాస్త్ర వేత్తల ల కష్టానికి జోహార్లు చెప్తున్నారు.
చంద్రయాన్-3 విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మన కేంద్రమంత్రి జితేందర్ సింగ్ (jitendra singh)..
జితేందర్ సింగ్, ఇస్రో శాస్త్రవేత్తల ప్రతిభను అభినందించారు. అమెరికన్లు (Americans) భారత ప్రతిభను గుర్తించి, ఇండియన్ ఆస్ట్రానాట్స్ ను స్పేస్‌లోకి పంపేందుకు ఆసక్తి చూపుతున్నారు అన్నారు
అభినందించిన మోడీ (Narendra Modi) ..
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రో శాస్త్రవేత్తలను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
చంద్రయాన్-3 ఎంత విజయవంతంగా దూసుకుపోయిందో అంతే విజయవంతంగా భవిష్యత్‌లో చంద్రుని పై ల్యాండ్ అయ్యి భారత్ ఘనత ని చాటిచెప్పాలని కోరుకుందాం … ఆల్ ది వెరీ బెస్ట్ (All the best) చంద్రయాన్ -3 , భారత్ మాతా కి జై …