2016 సంవత్సరం ప్రారంభంలోనే ఈ ఏడాది మన ముందుకు రానున్న సరికొత్త గాడ్జెట్లు వాటిని విడుదల చేయబోతున్న కంపెనీలు, లాస్ వేగాస్ లోని CES (Consumer Electronics Show) 2016 లో పోటీ పడ్డాయి. అయితే ఇందులో మనకు ఆశ్చర్యo కలిగించేవి, ఇది ఇంత సులభంగా సాధ్యమేనా అనిపించే సాంకేతిక పరిజ్ఞ్యానంతో తయారైన గాడ్జెట్లు ఎన్నో ఉన్నాయి. ఆ విశేషాలేoటో చూసేద్దామా…

Faraday Future EV concept

Faraday Future FFZero1 Concept Car: కార్లంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ ఈ మధ్య డీజిల్, పెట్రోల్ పోయి హైబ్రిడ్, ఎలక్ట్రిక్ ఇంకా ఎన్నో కొత్త కొత్త హంగులతో సరి కొత్త కార్లు తయారవుతున్నాయి. అలాంటిదే ఈ CES 2016 లో ప్రదర్శించిన ఈ FFZero1 ఎలక్ట్రిక్ కార్. Faraday Future అనే సంస్థ దీనిని తయారు చేయనుంది. ఈ సంస్థ ప్రకారం ఈ కారు పూర్తిగా ఎలక్ట్రిక్, అలాగే ఎలక్ట్రిక్ కార్లు అందుకోలేని వేగాన్ని ఈ కారు ఇస్తుందని ఈ సంస్థ చెబుతోంది. ఇది స్టార్ట్ చేసిన 3 సెకన్ల లోపే 0-60 స్పీడ్ అందుకుంటుందని, అలాగే ఇది గంటకు 200 మైళ్ళ వేగాన్నిస్తుందని ఈ సంస్థ చెబుతోంది. చూడడానికే అద్భుతంగా ఉన్న ఈ కారు, ఏ మేరకు వాగ్దానాలను నిలుపుకుంటుందో చూడాలి.

Ehang2

Ehang Passenger Drone: ఇప్పుడు హవా అంతా డ్రోన్లదే. అయితే ఇది అన్ని డ్రోన్ ల కంటే ఒక మెట్టు పైనే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇది కేవలం గాలిలో ప్రయాణించి ఫోటోలు అవీ తీయడమే కాకుండా ఒక పాసెంజర్ ను కూడా మోయగలదు. అంటే, ఒక చిన్న సైజు పర్సనల్ హెలికాప్టర్ లా అని చెప్పచ్చు. ఇది తనంత తాను లోపలి కూర్చున్న వ్యక్తి నియంత్రణ లేకుండానే గమ్యానికి చేరుస్తుంది. దీనిని చైనా కు చెందిన ఒక సంస్థ తయారు చేసింది.

parrot disco

Parrot Disco: ఇది CES లో ప్రదర్శితమైన మరొక డ్రోన్. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే, సాధారణ డ్రోన్ల లా కాకుండా ఇది ఒక పక్షి ఆకారాన్ని పోలి ఉంటుంది. దీనిని ఎలాంటి శిక్షణా లేకుండా ఎవ్వరైనా గాలిలో ఎగురవేయవచ్చు. ఒక గాలిపటంలా దీనిని ఎగురవేస్తే, అదే గాలిలోకి ఎగిరిపోతుంది. దీనిలో ఉండే సెన్సర్స్ (accelerometer, gyroscope, magnetometer, barometer, Pitot మరియు GPS) గాలిలోకి ఎగిరినప్పుడు ఈ డ్రోన్ స్థిరంగా ఎగిరెట్టు సహాయ పడతాయి.  అంతే కాదు అలా ఎగిరినప్పుడు మీరు దీని కంట్రోలర్ ద్వారా దీని గమనాన్ని నిర్దేశిoచచ్చు లేదా దీని యాప్ లో ఒక మ్యాప్ వేసినా అదే దానికి తగ్గట్టు ఎగురుతుంటుంది.  ముందు భాగంలో ఒక కెమెరా ఉంది. అక్కడి నుంచి లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది. అలాగే దీని రెక్కలు (wings) detachable కావడం వల్ల దీనిని ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. దీని flight time 45 నిముషాలు.

Scio

DietSensor SCiO: ఎవరైతే diet conscious గా ఉంటారో వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ పరికరం లోని సెన్సర్ ఒక చిన్న spectrometer ఆధారంగా పని చేస్తుంది. ఈ పరికరం ఒక యాప్ కు అనుసంధానంగా పని చేస్తుంది. దీనిని మనం తినే ఆహారం మీద ఉంచి స్కాన్ చేస్తే ఇందులోని స్పెక్ట్రోమీటర్ ఆ ఆహారంలోని రసాయనాల ఆధారంగా (chemical composition) స్కాన్ చేసి, ఆ ఆహార పదార్ధంలోని పోషక విలువలను ఈ యాప్ లో చూపిస్తుంది. అయితే ఇది (non-homogenos food) కు పని చేయదు. అంటే నాలుగైదు పదార్ధాలు కలిపి తయారు చేసిన కూల్ డ్రింక్స్, burgers, pizzas వంటివాటికి పని చేయదు. అటువంటి వాటి వివరాలు కావాలంటే ఈ యాప్ లో ఒక్కొక్క పదార్ధం వివరాలు ఫీడ్ చేస్తే అప్పుడు ఆ పదార్ధంలోని పోషకాలను ఈ యాప్ లో చూపిస్తుంది.

Courtesy