బిగ్ బాస్ సీజన్ 5(Big Boss season 5) లో ఈ వారం హౌస్ మేట్స్(House mates) ఆడిన గేమ్స్ రసవత్తరంగా రక్తి కట్టించారు. అంతేకాకుండా ఏడో వారం ఎలిమినేషన్ కి జరిగే నామినేషన్ ప్రక్రియ రొటీన్ కి బిన్నంగా ప్లాన్ చేసిన బిగ్ బాస్(Big Boss).
ఇక కెప్టెన్సీ పోటీదారుల కోసం బంగారు కోడి పెట్ట టాస్క్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో సన్నీ ప్రియా మధ్య గొడవ తార స్థాయి కి పోయింది. ఒక్కరి మీద ఒక్కరు నోరు పారేసుకుంటూ ఫిసికల్ ఎటాకింగ్ కి దిగారు.
సీజన్ మొదటి నుంచి సన్నీ అంటే పడని ప్రియా.
ఈ వారం ప్రియా తన వింత చేష్టలతో అందరిని ఆట ఆడేసుకుంది. మరి కాజల్ ని అయితే తన మాటలతో వెక్కి వెక్కి ఏడిచేలా చేసింది. త్రిమూర్తులు గా చెప్పుకునే జెస్సీ , సిరి, షన్ను ల మధ్య సీక్రెట్ టాస్క్ ఇచ్చి వాళ్ళ మధ్య గొడవ పెట్టేసిన బిగ్ బాస్. దీనితో అలక పాన్పు ఎక్కిన షన్ను. ఆ అలక తీర్చడానికి తెగ ట్రై చేసిన సిరి.
ఇక లోబో సీక్రెట్ రూమ్ కి వెళ్లడం, ఆ తరువాత సీక్రెట్ రూమ్ నుంచి వచ్చి కెప్టెన్సీ కోసం పొట్టి పడుతున్న వాళ్లలో నుంచి బ్లాక్ ఎగ్ ఇచ్చి శ్రీరామ్ ని తొలిగించి, గోల్డ్ ఎగ్ ని కాజల్ కి ఇచ్చి కెప్టెన్సీ(Captaincy) పోటీదారుల్లో చోటు ఇచ్చిన లోబో. ఆలా మొత్తంగా ఈ టాస్క్‌లో ఐదుగురు పోటీదారులు కెప్టెన్ పోటీదారులుగా నిలిచారు.
మానస్, విశ్వ, సన్నీ, యాంకర్ రవి, కాజల్‌లు కెప్టెన్ పోటీదారులు కావడంతో ఈ వారం కెప్టెన్ గా సన్నీ గెలిచాడు.
మరిన్ని వివరాల కోసం శుక్రవారం ఎపిసోడ్ ఇక్కడ చూద్దాం.
తరువాత బిగ్‌బాస్(Big Boss) హౌస్‌లోని హౌస్ మేట్స్(House Mates) అందరు వారు జీవితంలో ఏర్పడ్డ అడ్డంకుల గురించి చెప్పాలంటూ ఓ టాస్క్ ఇచ్చారు. ముందు గా సన్నీ మాట్లాడుతూ అమ్మ పేరు కళావతి.
ఒక మహిళ ముగ్గురు అబ్బాయిలను పెంచడం అనేది ఎంత చాలెంజింగో నాకు బాగా తెలుసు. మా డైరెక్టర్ పేరు కృష్ణ. నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు చాలామంది నన్నెన్నో మాటలు అన్నారు. అవి విన్నాక నా వల్ల కాదు, వేరేవాళ్లను చూసుకోమని డైరెక్టర్ గారికి చెప్పాను.
కానీ ఆయన వాళ్ళే నీ ఆశీర్వాదం, వాళ్లందరూ నిన్ను పొగిడేలా చేసుకో అని ధైర్యం నూరిపోశాడు. అలా నా ప్రయాణం మొదలై ఇక్కడిదాకా వచ్చాను’ అని చెప్పుకొచ్చాడు.
తర్వాత షణ్ముఖ్ మాట్లాడుతూ ‘ఇంటర్ సెకండియర్ తర్వాత బెంగళూరులో సీటు వచ్చింది. అదే టైం లోనే లవ్ బ్రేకప్ (love breakup) కావడంతో నా సగం జీవితం పోయిందని చాలా ఫీల్ అయ్యాను.సూసైడ్ చేసుకుందామనుకున్నా, సరిగ్గా అదే సమయంలో నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చి డోర్ కొట్టాడు. కానీ నేను తీయలేదు.
తర్వాత అతడు నేరుగా లోపలకు వచ్చి నాలుగు పీకాడు. వాడివల్లే నేను బతికున్నాను. వైవా అనే షార్ట్ ఫిలిం ద్వారా నాకు బ్రేక్ వచ్చింది. నా ఫేస్‌లో స్మైల్ (smile) తెప్పించిన పేరెంట్స్, కజిన్స్ కు రుణపడి ఉంటా అని తెలిపాడు.
జెస్సీ మాట్లాడుతూ ‘నాన్న చనిపోయాక చదువుతూ పార్ట్ టైం జాబ్ చేశాను. ఒకసారి లైవ్‌లో ఫ్యాషన్ షో చూశా, ఇదే నాకు సరైనది అనిపించింది. కానీ అక్కడున్న సీనియర్ మోడల్స్ నన్ను హేళన చేశారు. పుట్టుకతోనే నాకు వోకల్ ప్రాబ్లెమ్ వుంది. కానీ నేను దాన్ని దాటుకుని ముందుకు వెళ్లి వారిని ఓడించి టైటిల్ కూడా గెలిచాను. గిన్నిస్ బుక్ రికార్డుకెక్కాను. కానీ ఎప్పుడూ మా అమ్మ నేను మోడల్ అని బయటకు చెప్పుకోలేదు.
ఎప్పుడైతే బిగ్‌బాస్(Big Boss) ఆఫర్ వచ్చిందో అప్పుడు అందరి ఇంటి తలుపులు కొట్టి మరీ నా కొడుకు మోడల్ అంటూ చాటింపు చేసింది అని ఎమోషనల్(Emotional) అయ్యాడు.
సిరి తన మెమోరీస్ ని గుర్తు చేసుకుని ఎమోషనల్(Emotional) అయింది.’నేను వేరేవాళ్లను పెళ్లి చేసుకోబోగా అది ఆగిపోయింది, ఆ తర్వాత నేను ప్రేమించినవాడు చనిపోయాడు. అప్పుడు అందరూ అన్నారు తల్లేమైనా పద్ధతిగా ఉందా? కూతురు ఉండటానికి అని. అప్పుడే డిసైడ్ అయ్యాను. నేనేంటో చూపిస్తానని ఇంట్లో చెప్పా పెట్టకుండా హైదరాబాద్ వచ్చి కెరియర్ మొదలుపెట్టాను ‘ మా రిలేటివ్స్‌కి ఇప్పుడు చెప్పేది ఒకటే నేను పద్ధతి గానే ఉన్న, పద్దతిగానే పెరిగానుఅని చెప్పుకొచ్చింది సిరి.
మొత్తానికి ‘స్మైల్ చేయండి, టాస్క్ చేయండి’ అన్న ఈ టాస్క్ లో జెస్సీ గెలుపొందాడు. అతడు ఈ ఆనందకర మూమెంట్స్ ని షణ్ముఖ్, సిరితో సెలబ్రేట్ చేసుకున్నాడు.
ఇక మరో వైపు తిననంటూ మారాం చేసిన సిరికి గోరుముద్దలు తినిపించాడు షణ్ను. తర్వాత బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్(Task) ఇచ్చాడు. ఇందులో ఎవరు ఎక్కువ సేపు బెలూన్లు ఉంచుకోగలిగితే వారే గెలిచినట్లు, ఇందులో మొదటి బజర్‌లో జెస్సీ సూది గెలిచి, సూదిని కాజల్ కి ఇచ్చాడు .
ఇప్పటికే రెండుసార్లు కెప్టెన్ అయ్యావంటూ విశ్వను పోటీ నుంచి తప్పించాలనుకుంది కాజల్. ఆమె చెప్పిన కారణం విన్న విశ్వ అక్కడి నుంచి ఆవేశంతో వెళ్తుండగా అతడి బెలూన్ పగిలిపోయింది.
రెండో బజర్ నొక్కేందుకు విశ్వ పరిగెత్తే క్రమంలో అతడు పింకీని తోసేశాడు. దీంతో మండిపడ్డ పింకీ తనకు కూడా అడ్డం వస్తే తంతానని హెచ్చరించింది ఇచ్చింది.
ఇక విశ్వ తన సూదిని రవికి ఇవ్వగా అతడు దాని సాయంతో మానస్ బెలూన్ ని పగలగొట్టాడు.
మరోవైపు లోబో సంపాదించిన సూదిని రవికివ్వగా అతడు కాజల్ బెలూన్ పగలకొట్టాడు. దీనితో ఎమోషనల్(Emotional) అయ్యిన కాజల్ ప్రియా ను పట్టుకుని ఏడ్చేసింది.
ఇక చివరి బజర్‌లో మాత్రం యానీ మాస్టర్ పిన్ సంపాదించగా దాన్ని తీసుకెళ్లి సన్నీ కి ఇచ్చింది. దీంతో ఎమోషనల్ అయిన సన్నీ రవిని ఓడించి కెప్టెన్(Captain) అయ్యాడు.
తనను గెలిపించిన యానీని ముద్దు పెట్టి థాంక్స్ చెప్పాడు. సెన్సార్ బోర్డు యాక్సెప్ట్ చేయదని ఇంగ్లీష్ కిస్ పెట్టలేదని కామెంట్ చేశాడు.
మొత్తానికి అనుకున్నది సాధించిన సన్నీ కెప్టెన్ డ్రెస్ వేసుకుని ఇల్లంతా తిరిగాడు. మరి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే వీకెండ్ కూడా వచ్చేసింది.
ఈ వారం హౌస్ మేట్స్(House Mates) మధ్య చోటు చేసుకున్న పరిణామాల గురించి హోస్ట్ నాగ్ ఎలా స్పందించనున్నారో…..