క్యాలీ ఫ్లవర్ లో(Cauliflower) ఆరోగ్యాన్ని పెంచే చాలా గుణాలున్నాయి. దీన్ని ఎక్కువగా గోబీ(Gobi) అని పిలుస్తారు. ఇందులో విటమిన్ బి(Vitamin B) పుష్కలంగా లభిస్తుంది. పోషకాలు(Nutrients) ఎక్కువ గానూ, క్యాలరీలు(Calories) తక్కువగానూ గోబీలో ఉంటాయి. అలాగే ఇందులో సంవృద్ధిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లూ(Anti Oxidants), క్యాన్సర్(Cancer) నుంచి రక్షించే ఫైటో న్యూట్రియంట్లూ(Phyto Nutrients) కూడా ఎక్కువగా ఉంటాయి.
క్యాలీఫ్లవర్ లో పీచు(Fiber)తో పాటు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల శరీర బరువును(Weight Loss) తగ్గిస్తుంది. అంతేకాదు జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచేలా చేయడంలో సహాయపడతాయి. మధుమేహం, ఊబకాయం, హృద్రోగాల బారిన పడకుండా రక్షించడంలో క్యాలీఫ్లవర్ తోడ్పడుతుంది. ఇందులోని విటమిన్ కె(Vitamin K) ఎముకల దృఢత్వాని(Bone strength)కీ దోహదపడుతుంది. అంతేనా చక్కటి పూవు ఆకారంలో ఉండే గోబీ లేదా క్యాలీఫ్లవర్ లో చాలానే ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) ఇమిడి ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం!
క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టాలంటే క్యాలీఫ్లవర్ రసం ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లూ క్యాన్సర్ నుంచి రక్షించే ఫైటో న్యూట్రియంట్లూ ఎక్కువగా ఉంటాయి. ఉదయాన్నే పరకడుపున అరకప్పు గోబీ రసాన్ని(Gobi Juice) ప్రతిరోజు తీసుకుంటే క్యాన్సర్ తగ్గుముఖం పడుతుంది.
పెద్ద ప్రేగులు(Big Intestine) శుభ్రమై మెరుగైన ఆరోగ్యం సొంతమవుతుంది. అంతే కాకుండా క్యాలీ ఫ్లవర్ లో ఇండోల్ 3 కార్బినాల్(Indol 3 Carbinal) అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది స్త్రీ, పురుషలిద్దరిలోనూ రొమ్ము, ప్రత్యుత్పత్తి అవయవ క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి. కూరగాయలు(Vegetables), మొలకెత్తిన ధాన్యా(Sprouted Millets)ల్లో ఉండే పోషకాలు, కెమికల్స్ క్యాలీ ఫ్లవర్ లో పుష్కలంగా ఉంటాయి. ఇవి మగవారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ ని అరికట్టడానికి సహాయపడుతుంది.
కిడ్నీ(Kidney) సంబంధిత రోగాలకు క్యాలీఫ్లవర్ దివ్యౌషధం(Medicine)గా పని చేస్తుంది. క్యాలీఫ్లవర్లో విటమిన్ సి, పీచు అధికంగా ఉండటంతో కిడ్నీ వ్యాధులు దరిచేరవు. క్యాలీ ఫ్లవర్ పచ్చి ఆకులను రోజూ 50 గ్రాములు తీసుకుంటే దంత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. వీటిని నమలడం వల్ల దంతాలపై చేరుకున్న క్రిములు నశిస్తాయి. కాలీఫ్లవర్ లో పోషకాలు ఎక్కువగానూ, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ డైట్ లో క్యాలీఫ్లవర్ ను చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
కూరల ద్వారా లేదా సలాడ్ ల రూపంలో వీటిని తీసుకుంటూ ఉంటే త్వరగా బరువు తగ్గవచ్చు. విదేశీయులు బ్రొకోలిగా పిలుచుకునే గ్రీన్ క్యాలీఫ్లవర్ లో కూడా పోషకాలు, విటమిన్ ఎ, యాంటి ఆక్సిండెంట్స్ ఉంటాయి. ఉడికించిన లేదా పచ్చి క్యాలీఫ్లవర్ లేదా బ్రొకోలి(Broccoli)ని వ్యాయామానికి ముందే లేదా తర్వాత తీసుకుంటే కండరాల నొప్పులు ఉండవు. యూరినరీ ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడటానికి క్యాలిఫ్లవర్ చక్కటి పరిష్కారం.
యూరినరీ ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవాలంటే వారానికి రెండు లేదా మూడు సార్లు క్యాలీఫ్లవర్‌ను డైట్(Diet)లో చేర్చుకోవాలి. శరీరంలోని మలినాలను యూరిన్ ద్వారా బయటకు పంపించడంలో క్యాలీఫ్లవర్ సహాయపడుతుంది.
రక్తహీనత తగ్గించడానికి క్యాలీఫ్లవర్ ను డైట్ లో చేర్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో శరీరంలో బ్లడ్ సెల్స్ లెవల్స్ తగ్గిపోయి రక్తహీనత ఏర్పడుతుంది. దీనివల్ల నీరసం, అలసట వస్తాయి. ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే క్యాలీఫ్లవర్‌ను ఉడికించి కూరలు లేదా సలాడ్స్ రూపంలో తీసుకోవడం ఉత్తమం.
గాయాలను మాన్పించడంలో క్యాలీఫ్లవర్ పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. గోబీ పచ్చి ఆకుల రసం(Leaf Juice) అర గ్లాసు చొప్పున రోజుకు ఐదుసార్లు తాగితే గాయాలు నయమౌతాయి. అంతేకాదు ఈ రసాన్ని గాయాలపై రాసి కట్టు కట్టడం వల్ల కూడా గాయాలు తగ్గిపోతాయి. క్యాలీఫ్లవర్ జుట్టు ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. ఈ ఆకులను నిత్యం పచ్చిగా తీసుకుంటే జుట్టు రాలిపోయే సమస్య తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
క్యాలీఫ్లవర్ రసం బ్లీచింగ్(Bleaching) లా ఉపయోగపడుతుంది. మచ్చలు, ఎండకు కమిలిన చర్మంపై క్యాలీఫ్లవర్ రసం రాసుకుని, ఆరిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా వారం రోజులు చేస్తే మంచి నిగారింపు(Glow Skin) సొంత మవుతుంది. ఇన్ని గుణాలు వున్న క్యాలిఫ్లవర్‌ను రోజు వారి ఆహారంలో చేరిచుకోవడం ద్వారా మంచి ఆరోగ్య ఫలితాలు(Health Results) ఉంటాయి.