Obesity, స్థూలకాయం అనేది ఒకప్పుడు ఎక్కడో ఎవరికో ఉండేది కానీ ఇప్పుడు మనలో చాలా మంది చిన్నా పెద్దా అని తేడా లేకుండా దీని బారిన పడుతున్నారు. అయితే స్థూలకాయం అనేది వ్యక్తిగత సమస్య కానీ ఏకంగా ఒక ఖండాన్నే కుదిపేసే సమస్యగా మారుతుంది అంటే, ఆశ్చర్యంగా ఉంది కదూ. రానున్న పదేళ్లల్లో ఐరోపా లోని అత్యధిక దేశాల్లోని 5వ వంతు జనాభా స్థూలకాయులు అవుతారని ఒక పరిశోధన ఖచ్చితంగా తేల్చి చెప్పింది. ఆ వివరాల్లోకి వెళ్దామా…

UK లోని Imeprial College London లోని School of public health కు చెందిన ప్రొఫెసర్ Majid Ejjati తన బృందం తో కలిసి ఈ పరిశోధన చేపట్టారు. ఇలాంటి ఒక పరిశోధన ఇంత పెద్ద స్థాయిలో జరగడం విశేషం. ఇందుకోసం ఈయన ఇంచుమించు 1975 నుంచీ ఇప్పటి వరకూ ఉన్న గణాoకాలను పరిశీలించి, 2025 నాటికల్లా బ్రిటన్లో ఐరోపా ఖండానికంతటికీ అత్యధికమైన స్థూలకాయులు ఉంటారని వెల్లడించారు. తదుపరి స్థానాల్లో ఐర్లాండ్ (Ireland), మాల్టా (Malta), లిథుయేనియా (Lithuania) మరియు స్పెయిన్ (Spain) వంటి దేశాలు ఉంటాయని సూచించారు. అయితే ఇందుకు అగ్ర రాజ్యం అమెరికా కూడా ఏమీ మినహాయింపు కాదు. బ్రిటన్ ను మించిన అధిక శాతం స్థూలకాయులు రానున్న పదేళ్ళలో పెరుగుతారని కూడా ఈయన వెల్లడించారు. ఇందుకు కారణం అక్కడ వారు తినే, తాగే ఆహారంలో అధికంగా చక్కెర కలిగి ఉండడమే కారణం.

ఇప్పటికే బ్రిటన్ లో చక్కెర (added sugar) వినియోగం పట్ల పన్ను విధించే పనిలో అక్కడి ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి అక్కడ ఒక చట్టమే రూపు దిద్దుకోనుంది. అక్కడ లభించే processed food అంతటికీ ధరలు పెంచి కూరలు, పళ్ళ పట్ల ధర తగ్గించడం ద్వారా ఈ స్థూలకాయానికి మూలమైన sugar consumption ను అదుపు చేయాలని యోచిస్తోంది.

అయితే స్థూలకాయం అనేది వ్యక్తిగత సమస్య కదా, ఇందుకు ఆ దేశం అంత హైరానా పడిపోవడం ఎందుకు అనుకుంటున్నారా? దీని ద్వారా అధిక శాతం మంది జనాభా డయాబెటిస్, పలు రకాల కాన్సర్లు, స్ట్రోక్ మరియు అకాల మరణాల బారిన పడతారు. దీని వల్ల health care costs పెరిగిపోతుంది. అలాగే వీరి సామర్ధ్యమూ తగ్గిపోతుంది. తద్వారా దేశ ఆదాయానికి గండి పడుతుంది. ఇంకా పలు దుష్ప్రయోజనాలు ఉన్నాయి.

ఇదీ అక్కడి పరిస్థితి. హమ్మయ్య ఇదేదో మనకు లేదని సంతోష పడనక్కరలేదు. మన దేశంలో కూడా స్థూలకాయుల శాతం పెరుగుతోంది. అన్నిటికీ మించి పిల్లల్లో కూడా ఈ ధోరణి కనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా మంచి పరిణామం కాదు. ప్రపంచీకరణ, పెరుగుతున్న సాంకేతికత దృష్ట్యా ఏది కావాలన్న మన చేతుల్లోకి వచ్చి పడటంతో శారీరక శ్రమ తక్కువై పోతోంది. దీనికి తోడూ మనం తినే ఆహారంలోని పోషకాలు గూర్చి మనకు అవగాహన లేకపోవడంతో మనం చేతులారా మన కడుపులోకి అత్యంత ఎక్కువ చక్కెర ఉన్న పదార్ధాలను పంపిస్తున్నాము.

అందువల్ల UK లో మాత్రమే కాదు ప్రపంచమంతటా processed foods లో కలిపే added sugar పట్ల నియంత్రణ అవసరం. అలాగే పట్టణాలు, పల్లెలు అని చూడకుండా మనకు లభించే ఆహారం, వండుకునే ఆహారంలో, రెడీ మేడ్ ఆహారంలో ఎలాంటి పదార్ధాలు ఉన్నాయి, అవి తింటే ఏమవుతుంది అనే విషయం పట్ల అవగాహనా సదస్సులు నిర్వహించాలి. అప్పుడే ప్రపంచమంతటా యువతను నిర్వీర్యం చేసే ఈ స్థూలకాయం వంటి సమస్యలను తరిమి కొట్టగలం.

Courtesy