బాలీవుడ్ స్టార్(Bollywood star) బాద్షా(Badshah) షారుఖ్ ఖాన్(Sharuh khan) అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులైన 50 మంది నటుల జాబితాలో ఇండియా(India) నుంచి ఒకే ఒక్క నటుడుగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు చోటు లభించింది. బ్రిటన్(Britain)కు చెందిన ఎంపైర్ మ్యాగజైన్(Empire Magazine) రిలీజ్ చేసిన జాబితాలో షారుఖ్ పేరు మాత్రమే ఉంది.
50 గ్రేటెస్ట్ యాక్టర్స్(Greatest Actors) ఆల్‌టైమ్(All time) పేరుతో ఈ మ్యాగజైన్ విడుదల చేసిన ఈ జాబితాలో హాలీవుడ్(Hollywood) నుంచి మహా మహుల పేర్లు ఉన్నాయి. హాలీవుడ్ నుంచి ఈ లిస్ట్ లో టామ్ హాంక్స్, డెంజల్ వాషింగ్టన్, ఆంథోనీ మార్లన్ బ్రాండో వంటి దిగ్గజాలతోపాటు ఇండియా నుంచి ఏకైక స్టార్ గా షారుఖ్ ఖాన్‌కు చోటు దక్కింది.
ఈ మధ్య చాలా ఇబ్బందులు పడ్డాడు బాద్ షా. వరుస డిజాస్టర్ల(Disasters) తో డీలా పడ్డాడు. జీరో సినిమా ధారుణ పరాజయంతో.. సినిమాలకు నాలుగేళ్లకు పైగా గ్యాప్ ఇచ్చి ఫ్రెష్ గా సెకండ్ ఇన్నింగ్స్(Second Innings) స్టార్ట్ చేశాడు. జవాన్(Jawan) మూవీతో త్వరలో అభిమానుల ముందుకు రాబోతున్నాడు షారుఖ్.
ఇక బాలీవుడ్ లో 40 సంవత్సరాల షారుఖ్ ఖాన్ ప్రస్థానం, ఆయన సాధించిన సక్సెస్(Success), సినిమా రంగానికి షారుఖ్ ఖాన్ చేసిన సేవలు(Services) ఆయన ఫాన్స్ గురించి ఎంపైర్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. అంతేకాదు, ఓ సినిమాలో అతడు చెప్పే జీవితం రోజూ మన ఊపిరిని కొద్దికొద్దిగా హరిస్తుంది.. అదే బాంబు అయితే ఒకేసారి ప్రాణం తీస్తుంది అన్న డైలాగ్ గురించి చెబుతూ.. షారుఖ్ కెరియర్(Career)లోనే ఈ డైలాగ్ ఉత్తమమైనదని కొనియాడింది.
ఇలా షారుఖ్ కు సబంధించిన ప్రతీ విషయం గురించి ఈ ఈవెంట్ లో వెల్లడించారు. షారుఖ్ నటించిన అద్భుతమై సినిమాల గురించి కూడా ప్రస్తావించారు. దేవ్‌దాస్, మై నేమ్ ఈజ్ ఖాన్, కుఛ్ కుఛ్ హోతా హై లాంటి సినిమాల్లో ఆయన నటనను కొనియాడారు. ఇక ఎంపైర్ మ్యాగజైన్ కథనాన్ని షారుఖ్ మేనేజర్ పూజా దద్లానీ(Pooja Dadaalini) సోషల్ మీడియా(Social Media)లో షేర్(Share) చేశారు.
ప్రస్తుతం షారుఖ్ నటించిన పఠాన్(Pathan) రిలీజ్(Release) కు రెడీగా ఉంది. అయితే రిలీజ్ కు ముందే ఈమూవీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ మూవీలో ఓ సాంగ్ విషయంలో భారీ విమర్షలు ఫేస్ చేస్తున్నారు మూవీ టీమ్. బేషరమ్ రంగ్ పాటపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. షారుఖ్ ఖాన్ కు మంత్రుల నుంచి కూడా అక్షింతలు తప్పలేదు.
ఇక ఈ సినిమాను నిషేధించాలంటూ నిరసనలు కూడా స్టార్ట్ అయ్యాయి. బాయ్‌కాట్ పఠాన్(Boycott Pathan) హ్యాష్‌టాగ్(Hashtag) ట్విట్టర్(Twitter)లో ట్రెండ్(Trend) అవుతోంది.
అంతే కాదు కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు, మంత్రులు కూడా సినిమాను తమ రాష్ట్రంలో రిలీజ్ అవ్వనివ్వం అంటున్నారు. ఇక ఒక మంత్రి అయితే షారుఖ్ కు సూటి ప్రశ్న వదిలారు. మీ కూతురుతో సినిమా చూడగలరా అంటూ విమర్షలు కూడా చేశారు.