బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వివిధ పోస్ట్ ల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు 15 నవంబర్, 2021 నుండి వివిధ గ్రూప్C పోస్ట్ ల రిక్రూట్మెంట్(Recruitment) కోసం ఆన్లైన్(Online) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) గ్రూప్ C అప్లికేషన్ లింక్(Application Link) 29 డిసెంబర్ 2021న , 11:59 PM. మూసివేయబడుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్(Official Website) www.rectt.bsf.gov.inలో చివరి తేదీ కంటే ముందే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కార్పెంటర్, ప్లంబర్, సేవర్మ్యాన్, జనరేటర్ ఆపరేటర్, జనరేటర్ మెకానిక్ మరియు లైన్మెన్ వంటి గ్రూప్ C(Group C)’ కాంబాటైజ్డ్ (నాన్ గెజిటెడ్-నాన్ మినిస్టీరియల్) సేవలలో ASI, HC మరియు కానిస్టేబుల్(Constable) కోసం 70 కంటే ఎక్కువ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. గ్రూప్ సి(Group C) విభాగంలోకి వచ్చే ఈ పోస్టులకు పదవతరగతిని(Tenth) విద్యార్హతగా (Educational Qualification) నిర్ణయించారు. ఆయా పోస్టులను బట్టి ఎంపికైన అభ్యర్థులకు(Candidates) నెలకు రూ.21700 నుంచి రూ.69100 వరకు జీతం(Salary) ఇవ్వబడుతుంది.
కాగా, ఏఎస్ఐ(ASI) పోస్టుకు రూ.29200 నుంచి రూ.92300, హెచ్సీ పోస్టు(HC Post)కు రూ.25500 నుంచి రూ.81100 వరకు జీతం ఇవ్వనున్నారు.
ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల కోసం పరీక్ష ఫీజు తేదీల ప్రకటన
ఆంధ్రప్రదేశ్(AP)లో ఇంటర్ బోర్డు 2022, ఫస్టియర్, సెకండియర్ పరీక్ష కోసం పరీక్ష ఫీజు(Inter Fee) తేదీలు విడుదల చేయబడింది. మార్చి 2022 కోసం 2వ సంవత్సరం రెగ్యులర్ మరియు ఫెయిల్ అయినా విద్యార్థులు (జనరల్ & వొకేషనల్.) మొదలైన వారికి పరీక్ష ఫీజు చెల్లింపు కోసం ఇంటర్మీడియట్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బోర్డ్ కార్యదర్శి ఎం.వి.శేషగిరి బాబు పరీక్ష ఫీజు షెడ్యూల్ (Schedule) లేదా గడువు తేదీలను ప్రకటించారు. .
ఇంటర్ విద్యార్థులు పరీక్ష ఫీజు(Exam Fee) చెల్లించేందుకు డిసెంబరు 13వ తేదీ వరకు గడువు ఇచ్చారు. మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులంతా(Students) మార్చి 2022లో పరీక్ష రాసేందుకు అపరాధ రుసుం లేకుండా డిసెంబరు 13 వరకు ఫీజు చెల్లించవచ్చు.
ఆ తర్వాత రూ.120 అపరాధ రుసుముతో 23 వరకు, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబరు 30 వరకు, రూ.వెయ్యి అపరాధ రుసుముతో జనవరి 4 వరకు, రూ.5000 అపరాధ రుసుంతో జనవరి 20 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశముంది.
సాధారణ ఇంటర్ గ్రూప్(Inter Group)లకు మొదటి ఏడాది పరీక్ష ఫీజు రూ.500, వొకేషనల్ కోర్సుల(Vocational Course)కు రూ.700. బ్రిడ్జికోర్సు(Bridge Course) సబ్జెక్టులకు రూ.145, మ్యాథ్స్ బ్రిడ్జి కోర్సు(Maths Bridge Course)కు రూ.200, వొకేషనల్ బ్యాక్లాగ్ ప్రాక్టికల్ (Vocational Backlog Practical) పరీక్షలకు రూ.200 ఫీజు(Fees)గా నిర్ణయించారు.
ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించి ఫీజులను (పేపర్ల వారీగా, సంవత్సరాల వారీగా), ఇతర అంశాలను సర్క్యులర్(Circular)లో పొందుపరిచారు.