శీతాకాలంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. సాధారణంగా ఈ సీజన్‌లో సూర్యరశ్మి అతి తక్కువగా ఉంటుంది. దీనితో ఎండ ప్రభావం తక్కువగా ఉండటం వల్ల చాలా మంది లో విటమిన్ డి లోపిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ తగ్గిపోవడానికి కారణమవుతుంది. అంతే కాకుండా చలి గాలుల వల్ల మన శరీరంలోని రక్తనాళాలు కొంత వరకు కుంచించుకుపోయే అవకాశం ఉంది. నిరంతరం చల్లటి గాలిని తీసుకోవడం వల్ల సాధారణంగా శ్వాసకోశ సమస్యలు వస్తాయి.

అందువల్ల శీతాకాలంలో రోగనిరోధక శక్తిని తప్పనిసరిగా పెంచుకోవాలి. ఇందుకు చాలా మార్గాలు ఉన్నాయి.

కొన్ని రకాల ఆహార మార్పులు,మరియు ఈ  సీజన్‌లో లభించే కొన్ని రకాల పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చు.

రోగ నిరోధక శక్తి ని పెంచే కొన్ని రకాల ఆహార పదార్దాలు మరియు పండ్లు

బెల్లం

jaggery boost immunity

మన అందరికీ ఇష్టమైన ఈ తీయనైన బెల్లం అభ్ధుతమైన రోగ నిరోధక శక్తి ఔషదం.  ఎందుకంటే దీనిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.విటమిన్ సి, ఐరన్, ప్రోటీన్, పొటాషియం మరియు మెగ్నీషియం కలిగి ఉన్న బెల్లం మన రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి ని పొందవచ్చు.

ధనియాలతో

dhaniya boost immunity

ధనియాలలో మాంగనీస్, పొటాషియం, కోలిన్ మరియు బీటా కెరోటిన్ ఉంటాయి. రోగ నిరోధక శక్తి కి బాగా పనిచేస్తాయి. అంతే కాకుండా బెల్లం తో పాటు 2-3 ధనియాలు వేసి తినడం వల్ల ఆడ వారిలో  రుతుస్రావం సమయంలో వచ్చే కడుపు నొప్పి మరియు రుతు సమస్యలు తగ్గుతాయి.

ఎలాంటి పండ్లు తీసుకోవాలంటే…

ఆరెంజ్  ‌

orange

ఆరెంజ్  సిట్రస్ పండ్లు. అంటే దీనిలో సీ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. దీనితో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్ని నయం చేసుకోవచ్చు.మంచి రోగ నిరోధక శక్తి ని కలిగి ఉంటుంది .  డైరెక్ట్ గా ఆరంజ్ పండు తినడం ఇబ్బంది అయిన వారు  జ్యూస్ గా చేసుకొని తాగొచ్చు.

యాపిల్స్

Apple boost immunity

రోగ నిరోధక శక్తి కలిగిన పండ్ల లో ముందు యాపిల్ పండు మొదటిది ,దీనిని సూపర్ ఎనర్జీ ఫుడ్ అంటారు. దీనిలో ఫైబర్,  విటమిన్ బి, విటమిన్ సి,యాంటీఆక్సిడెంట్లు చాల ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ,జీర్ణక్రియ రేటును మరియు చర్మ ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తాయి.

 

దానిమ్మ

pomegranate

దానిమ్మ లో ఉండే ఔషధ గుణాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.క్యాన్సర్‌ వంటి వ్యాధిని కూడా రాకుండా నియంత్రించే శక్తి దీనికి ఉంది.  దీనిలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. శీతాకాలంలో ఎదురయ్యే చర్మ సమస్యలను నివారించి, చర్మాన్ని ఆరోగ్యం గా ఉంచడం లో తోడ్పడుతుంది. దానిమ్మను నేరుగా తినడం ఇష్టం లేని వారు  జ్యూస్ చేసుకొని కూడా తాగవచ్చు.

కివీ పండ్లు

Kiwi

కివీ పండులో విటమిన్ సి, పొటాషియంతో పాటు విటమిన్ ఇ, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఫోలేట్ వంటివి పుష్కలం గా ఉంటాయి.  కివీ ని  క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల తగినన్ని పోషకాలు శరీరానికి అందుతాయి .ఫలితం గా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ రేటును కూడా మెరుగు పరిచేందుకు కివీ పండు దోహదం చేస్తుంది.

ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. పెద్దలు చెప్పినట్టు గా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆనందం గా జీవితాన్ని సాగిద్దాం …

వీటిని మన ఆహార భాగాల్లో చేర్చుకుని ,శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తిని పొంది ఆనందం గా ఉంటారని ఆశిస్తున్నాం . ..