సాంకేతికత పెరుగుతూ వస్తోంది. అందుకు మనం నిత్యం వాడే చరవాణి (సెల్ ఫోన్) ఉదాహరణ. ఇంకా దానిని మించి స్మార్ట్ హోం అప్లికేషన్స్ చాలా వచ్చేసాయి. ఒక్క పరికరంతో ఎన్నో పనులు తేలిగ్గా చేసుకునేందుకు వీలుగా అంటే స్మార్ట్ గా తయారు చేయబడుతున్నాయి పరికరాలు. సరిగ్గా ఈ రోజు అలాంటి ఒక పరికరం గూర్చే చెప్పుకోబోతున్నాం. Bixi ఇది ఒక మల్టీ ఫంక్షనల్ రిమోట్. అంటే మన ఇంట్లో ఉండే అనేక రకాల వస్తువులను కేవలం ఈ చిన్న పరికరంతో మనం నియంత్రించవచ్చు. అది కూడా ముట్టుకోకుండా కేవలం చేతి వేళ్ళ కదిలకల ద్వారా అంటే ఆశ్చర్యం కలుగక మానదు. రండి మరి ఈ bixi ఏంటో ఎలా పని చేస్తుందో చూద్దాం.
ఈ bixi చూడడానికి గుండ్రంగా ఉండి ఒక చిన్న డిస్ప్లే కలిగిన ఒక పరికరం. దీనితో మన ఫోన్, టీవి, కార్ లలో చేసే పనులను ముట్టుకోకుండా కేవలం చేతి కదలికల ద్వారా నియంత్రించవచ్చు. అంటే ఫోన్ లో అలారం, మ్యూజిక్, ఫోటోలు, ఆఫీస్ లో పవర్ పాయింట్ ప్రేజెంటేషన్, కారులో నావిగేషన్, మ్యూజిక్, ఫోన్ లో sms, ఇంట్లో తలుపులకు సైతం ఒక స్మార్ట్ లాక్ లాగ ఉపయోగించవచ్చు. ఇలా వీటన్నిటినీ ముట్టుకోకుండా ఒక్కో పనికీ ఒక్కో నిర్దిష్టమైన సంజ్ఞ్యల ద్వారా ఉపయోగించచ్చు. ఇలా ఎందుకు అనుకుంటున్నారా. ఎందుకంటే మన నిత్య జీవితంలో మనం ఏదైనా ఒక వస్తువును వాడేటప్పుడు మన పని ఒత్తిడి వల్ల ఫలానా వస్తువును ముట్టుకోకుండా ఉండాల్సిన పరిస్థితి చాలా సార్లే ఎదురవుతుంది. అలాంటప్పుడు ఆయా వస్తువును నియంత్రిచేందుకు ఈ bixi ఎంతగానో ఉపయోగపడుతుంది.
మనం వంట చేసేటప్పుడు ఫోన్ ఉపయోగించాల్సి రావడం, కార్ నడిపెటప్పుడు నావిగేషన్, ఇంట్లో ఎక్కడో స్మార్ట్ బల్బుల కాంతిని నియంత్రించాల్సి రావడం మొదలైనవన్నీ సరిగ్గా ఈ bixi వంటి పరికరాల అవసరాన్నే గుర్తు చేస్తాయి.
అయితే వీటన్నిటికీ ఇప్పటికీ ఫోన్లో వాయిస్ కంట్రోల్ పరికరాలు ఉన్నాయి కదా అంటే – వాటికి ఒక్కోసారి వాటి పరిధి దాటిపోతే అవి సరిగా పని చేయలేవు. కానీ ఈ స్మార్ట్ రిమోట్ ను మీరు ఎక్కడంటే అక్కడ పెట్టుకుని మీ చేతి వేళ్ళతో ఉపయోగించాల్సి రావడం తో ఇవి వాయిస్ కంట్రోల్ పరికరాల కంటే మెరుగైన సామర్ధ్యం కలిగి ఉంటుంది.
ఇక ఇది ఒక యాప్ ద్వారా పని చేస్తుంది. మీ ఇంట్లోని స్మార్ట్ హోం అప్లికేషన్స్ ను దీనికి అనుసంధానం చేసుకుంటే చాలు. మీరు ఆయా వస్తువులను ముట్టుకోకుండానే వాడుకోవచ్చు.
ఈ bixi ధర $79 – $130 వరకు ఉండవచ్చు. ఇది త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుంది. దీనిని Bluemintlabs సంస్థ రూపొందించింది. ఇది USB పోర్ట్ ద్వారా ఛార్జ్ చేయబడి, ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం రోజుల పాటు పని చేయడం విశేషం. దీనిని ఈ సంస్థ ఈ సంవత్సరం జరుగుతున్న CES 2017 show లో సైతం, దీనికి స్థానం దక్కింది.