బిగ్ బాస్ సీజన్ 5(Big Boss season 5) ఈ షో ఫినాలే(Finale) కి చేరుకోవడానికి కేవలం రెండు వారాలు మాత్రమే మిగిలింది. సోమవారం నాటి 93 వ ఎపిసోడ్ లో సిరిని కాజల్ తో ఎక్కువ క్లోజ్ గా ఉండదు అని జాగ్రత్తగా ఉండని సలహా ఇస్తాడు షన్ను, దాంతో పాటు ఫ్రెండ్ షిప్ హాగ్(Friend ship Hug) అంటూ హాగ్ చేసుకుంటారు.
ఆ తరువాత కాజల్ సన్నీ కి దిష్టి తీస్తూ ఇంట్లో(House)వాళ్ల దిష్టి, ఆడియన్స్(Audience) దిష్టి, సోషల్ మీడియా(Social Media) దిష్టి అందరి దిష్టి పోవాలని తీస్తే, మరో పక్క షన్ను కి సిరి ఇంట్లో వాళ్ల దిష్టి, బిగ్ బాస్(Big Boss) దిష్టి, హౌస్‌లో ఉన్న ళ్ల దిష్టి పోవాలని తు తు తు అంటూ దిష్టి తీసింది.
బిగ్ బాస్ హౌస్ లో ఈ దిష్టి తీయడాలేంటో.
ఇక సన్నీ, మానస్ తింటూ ముచ్చట్లు పెట్టుకుంటారు. పింకీ కోసం తాను లవ్ పాట పాడినందుకు హ్యాపీ(Happy) ఫీల్ అయ్యి ఉంటుందా? అని మానస్ సన్నీని అడగ్గా. ఫుల్ హ్యాపీగా ఉంటుందిరా అని చెప్తాడు సన్నీ. ఇక నీకోసం ఏం రాసిపెట్టిందిరా? అని సన్నీ అడగ్గా ‘మిస్ యు ఆల్ ది బెస్ట్ విన్నర్’ అని రాసిందని చెప్తాడు మానస్.
ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా పింకీలా చూసుకునేవాళ్లు దొరకడం చాలా కష్టం. మా అందరికీ పింకీ ఫుడ్ పెట్టేది కానీ.. నీకు ఫుడ్ పెట్టడంలో చాలా ప్రేమ చూపించేదిరా అని మానస్‌తో అంటాడు సన్నీ.
ఆ తరువాత ప్రియాంక వెళ్లిపోయిన బాధతో మానస్ ఒంటరిగా కూర్చుంటే కాజల్, సన్నీ వెళ్లి అతడిని ఏడిపించారు. ప్రియాంక కోసం పాడిన లవ్ సాంగ్(Love song)ను పాడుతూ మానస్‌ను టీజ్(Tease) చేశారు. మాది ఫ్రెండ్షిప్(Friendship)రా, లవ్ కాదురా అని మానస్ మొత్తుకున్నప్పటికీ వాళ్లు వినిపించుకోలేదు.
ఆ తర్వాత మానస్, కాజల్, సన్నీ, సిరి ఇద్దరికీ లింకు పెడుతూ కాసేపు ఆటపట్టించారు. సిరి కనబడగానే నీ ఆలియాభట్ వస్తుందంటూ కామెంట్లు చేశారు. అయితే దీన్ని సరదాగా తీసుకోలేకపోయిన షణ్ను సిరిపై ఫైర్ అయ్యాడు.
మీ ఇద్దరి మధ్య ట్రాక్ క్రియేట్(Track create) చేయాలని చూస్తున్నారని, నువ్వు జాగ్రత్తపడకపోతే నీ క్యారెక్టర్(Character) బ్యాడ్ అవుతుందని సిరి కి వార్నింగ్ ఇచ్చాడు. వాళ్లు సరదాగా అన్నార్లే అని సిరి లైట్ తీసుకోవడంతో మండిపడ్డ షణ్ను, ఇది చెప్పడం వల్ల నాకు ఒరిగేదేమీ లేదంటూ విసురుగా వెళ్లిపోయాడు. దీంతో సిరి హర్ట్ అయ్యింది.
తర్వాతి రోజు ఉదయం సన్నీ నటించిన సకలగుణాభిరామ సినిమా(Movie)లోని సైకో సైకో పిల్లా సాంగ్(Song) వేయడంతో అతడు హ్యాపీ(Happy) గా ఫీల్ అయ్యాడు. అయితే షణ్ను మాత్రం మళ్లీ ఈ ఇంట్లో లో ఎందుకున్నాను అంటూ తనలో తానే సణుక్కున్నాడు.’నేను మోస్ట్ బోరింగ్ పర్సన్‌ను. ఇన్నివారాలు ఎలా ఉన్నానా? అనిపిస్తుంది.
ప్రతిసారి నేను ఓడిపోతూనే ఉన్నాను. కానీ నేను ఒంటరిగా పోరాడుతున్నాను, నా క్యారెక్టర్ ఇంతే, మొదటి రోజు నుంచి ఇప్పటివరకు నువ్వెక్కడా నాకు సాయం చేసినట్లు అనిపించలేదు బిగ్‌బాస్(Big Boss)’ అని కెమెరాల(Camera)తో తన గని ఎక్ష్ప్రెస్స్(Express) చేసాడు. షన్ను, సిరి దగ్గరకెళ్లి మనిద్దరం దూరం కావాలని వాళ్లు ప్లాన్లు చేస్తున్నారని తన అభిప్రాయపడ్డాడు. సన్నీతో గొడవ పెట్టుకున్న ప్రియ, రవి అందరూ వెళ్లిపోయారని కాజల్ ఆలోచిస్తుంది.
ఆమె తరువాత నీ దగ్గరకే వస్తుందంటూ సిరికి అడ్వైజ్ చేసాడు. ఆ తరువాత బిగ్‌బాస్(Big Boss) 1 నుంచి 6 ర్యాంకుల(1 to 6 Ranks) వరకు మీ స్థానాలను నిర్ణయించుకోవాలని హౌస్ మేట్స్(House mates) ని ఆదేశించాడు. దీంతో అందరూ ఏయే స్థానా(Places)ల్లో నిలబడాలో ఒక్కొక్కరిగా వారి అభిప్రాయాలను తెలిపారు.
మొదట గా షణ్ను మాట్లాడుతూ, ఫస్ట్ ప్లేస్‌లో నేను, సెకండ్ ప్లేస్‌లో శ్రీరామ్, మూడో స్థానంలో సన్నీ, నాల్గో స్థానంలో సిరి, ఐదారు స్థానాల్లో మానస్, కాజల్ ఉంటారన్నాడు. కాజల్ మాట్లాడుతూ, మొదటి స్థానంలో నేను 1, ఆ తరువాత స్థానాల్లో వరసగా సన్నీ, మానస్, శ్రీరామచంద్ర, సిరి, షణ్ముఖ్ ఉండాలని తెలిపింది.
ఇక మానస్ మాట్లాడుతూ, సన్నీ 1, కాజల్ 2, షణ్ముఖ్ 3, శ్రీరామచంద్ర 4, సిరి 5 స్థానాల్లో ఉండాలన్నాడు. శ్రీరామచంద్ర మాట్లాడుతూ, షణ్ముఖ్, సిరి 2, సన్నీ 3, కాజల్ 4, మానస్ 5వ ర్యాంకులో ఉండాలన్నాడు. మొదటి స్థానం ఆ దేవుడే నిర్ణయిస్తాడన్నాడు. తర్వాత సన్నీ వంతు రాగా, కాజల్ 1, మానస్ 2, సిరి 3, శ్రీరామచంద్ర, షణ్ముఖ్ 4, నేను 5వ స్థానంలో ఉంటానన్నాడు.
తర్వాత సిరి మాట్లాడుతూ, బిగ్‌బాస్ హౌస్(Big Boss House)కు అన్‌ఫిట్(Unfit) అనుకున్నాను, కానీ ఆ అభిప్రాయాన్ని షణ్ను మార్చాడు కాబట్టి అతడిని ఫస్ట్ ర్యాంక్‌లో చూడాలనుంది. వాడి పక్కనే రెండో ర్యాంక్‌లో నేను ఉండాలనుకుంటున్నాను. సన్నీ 3, శ్రీరామ్ 4, మానస్, కాజల్ 5 ర్యాంకుల్లో ఉంటారు అని చెప్పుకొచ్చింది.
అందరూ తమ అభిప్రాయాలు చెప్పడం ముగిసాక, సన్నీ 1, షణ్ను 2, కాజల్ 3, శ్రీరామ్ 4, మానస్ 5, సిరి 6 స్థానాల్లో నిలబడ్డారు.ఈ ప్రక్రియ తరువాత బిగ్‌బాస్(Big Boss) శ్రీరామ్ మినహా మిగతా హౌస్ మేట్స్(House mates) అందరూ 14వ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయ్యారని వెల్లడించారు. ర్యాంకుల టాస్కు(Ranking Task)లో తన అభిప్రాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని షణ్ను ఆరవ స్థానం(6th place)లో నిలబడటాన్ని సహించలేకపోయింది కాజల్.
ఇదంతా కావాలనే చేశాడని ఫీలైంది. అలా షణ్ను-కాజల్ మధ్య మరోసారి వాగ్వాదానలు జరిగాయి. దీంతో కాజల్ చాలా యాటిట్యూడ్(Attitude) చూపిస్తుందన్నాడు షణ్ను. అది ఓవర్ కాన్ఫిడెన్స్(Over Confidence) అని కాజల్ ని కామెంట్ చేసింది సిరి.
ఏదేమైనా ఈ వారం ఎలిమినేషన్(Elimination)తో టాప్ 5(Top 5)లో ఎవరుంటారనేది తెలిసిపోతుంది.