బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season 5) లో ప్రియా ఎలిమినేట్ (Eliminate) అవ్వగా, ఎనిమిదో వారం లోకి అడుగుపెట్టిన హౌస్ మేట్స్(House mates). మొత్తం 19 కంటెస్టెంట్స్(Contestants) తో మొదలైన షో ప్రస్తుతం హౌస్ లో 13 మిగిలారు.ఇక సోమవారం అంటేనే చాలా ఆసక్తికరంగాను, ఉత్కంఠంగానూ ఉంటుంది. ఎందుకంటే నామినేషన్స్(Nominations) ప్రక్రియ జరిగే రోజు, ఎవరు ఎవరిని నామినెటే చేస్తారో తెలిసే రోజు.
ఇప్పటికే 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ లో పెద్ద ట్విస్ట్(Big Twist) ఇచ్చాడు. ఈ నామినేషన్స్ తో హౌస్ మేట్స్ అందరు బాగా ఎమోషనల్(Emotional) అయ్యారు.
ఇంతకీ ఎవరు ఎవరిని నామినెటే చేసారో? బిగ్ బాస్ ఇచ్చిన బిగ్ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే 51వ ఎపిసోడ్ లో చదివేద్దాం.
యాని, ప్రియాంకతో ప్రియా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మనల్ని బాగా ఆడాలని చెప్పింది. మనం ఎవరి కోసమో ఆడొద్దు మనకోసం మనం ఆడుదాం. రవి ఎలా స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడో చూస్తున్నాం కదా, రవి లోబోకు చాలా సపోర్ట్ చేస్తాడు, కానీ లోబో మాత్రం రవికి సపోర్ట్ చేయడు, ఫ్రెండంటాడు, కానీ నామినేట్ చేస్తాడు అని పింకీతో చెప్పుకొచ్చింది యానీ మాస్టర్.
మరో వైపు రవి-లోబో ల ఫ్రెండ్షిప్ మధ్య గాప్ వచ్చింది. ఇంతలో లోబో నమాజ్ చేసుకుంటూ ఏడ్చేశాడు. ఇది చుసిన రవి లోబో దగ్గరకు వెళ్లి, పక్కకి వెళ్లి మాట్లాడటం వెనక్కి వెళ్లి మాట్లాడటం కరెక్ట్ కాదు, నాకు తెలిసిన లోబో అలాంటి వాడు కాదు.
లోబో అంటే ముఖంపైనే మాట్లాడతాడు. ఫ్రెండ్ తప్పు చేసినప్పుడు ఫ్రెండ్ క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారు అంటూ రవి అతడిని దగ్గరకు తీసుకుని ఓదార్చాడు.
బిగ్‌బాస్(Big Boss) హౌస్‌లో కంటెస్టెంట్లు(Contestants) అడుగుపెట్టి 50 రోజులు పూర్తయిందన్న బిగ్‌బాస్.. మీకు ఎంతో ఇష్టమైన వారి నుంచి లేఖను పొందే ఛాన్స్ వస్తుందని అసలు కలిగించాడు కానీ.. ఏదైనా దక్కించుకోవాలంటే ఇంకేదైనా వదులుకోవాల్సి వస్తుందని నామినేషన్(Nomination) గురించి చేపక్కనే చెప్పేసాడు.
నామినేషన్ ప్రక్రియలో భాగంగా పోస్ట్ మ్యాన్ ఇద్దరు ఇంటిసభ్యుల(House mates)ను పవర్ రూమ్‌కు పిలుస్తుంటాడు. వారి ముందున్న బ్యాగ్‌లోని రెండు లేఖల్లో ఒక్కరికి మాత్రమే లేఖ ఇచ్చి మిగతాది చింపివేయాల్సి ఉంటుంది. లెటర్ అందుకోలేనివాళ్లు నామినేట్ అయినట్లు అని మెలికపెట్టాడు బిగ్ బాస్.
ముందుగా పవర్ రూమ్(Power Room)లోకి వెళ్లిన మానస్, శ్రీరామ్‌లకు లోబో, ప్రియాంక లేఖలు అందాయి. దీంతో లోబో మాట్లాడుతూ తన భార్య గర్భవతి అని, అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందంటూనే పింకీ కోసం తన లేఖను త్యాగం చేశాడు. కానీ కన్నీళ్లను మాత్రం ఆపుకోలేకపోయాడు. తర్వాత షణ్ను- రవిలకు విశ్వ, సిరి లేఖలు అందాయి.
అయితే విశ్వ కోసం తన బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ రాసిన లేఖను ముక్కలు చేయడానికి రెడీ అయింది సిరి. ‘నాకు పుట్టకపోయినా నా దగ్గర కూడా ఒక బాబు ఉన్నాడు, కాబట్టి నీకు పుట్టిన పిల్లల కోసం ఎంత తపన ఉంటుందో నేను అర్థం చేసుకోగలను’ అంటూ విశ్వకు లెటర్ ఇవ్వమని చెప్తూ ఎమోషనల్(Emotional) అయింది.
పింకీ- కాజల్‌కు యానీ మాస్టర్, మానస్‌ల లేఖలు అందాయి. యానీ పరిస్థితి అర్థం చేసుకున్న మానస్ తన లేఖను త్యాగం చేశాడు. కానీ పింకీ మాత్రం మానస్ కి లెటర్ దక్కకపోవడం తో బాధ పడింది.
విశ్వ-లోబోలకు రవి, శ్రీరామ్ లెటర్స్ వచ్చాయి. అయితే పెద్ద మనసు చేసుకున్న శ్రీరామ్ రవి కోసం తన లెటర్‌ను వదులుకునేందుకు రెడీ అయ్యాడు. కానీ లోబో మాత్రం రవి తన ఫ్యామిలీని గుర్తు చేసుకునేందుకు బొమ్మ, టీ షర్ట్, లెటర్ ఉన్నాయి, కాబట్టి శ్రీరామ్‌కే లెటర్ ఇవ్వాలన్నాడు. దీంతో రవి తన లెటర్‌ను చింపివేసి శ్రీరామ్‌కు వచ్చిన లేఖను చదివి వినిపించాడు.
తర్వాత కాసేపటికి ఆ లేఖను పట్టుకుని ఒంటరిగా కూర్చున్న శ్రీరామ్ కు ఫామిలీ గుర్తు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇది చూసిన పింకీ అతడిని ఓదార్చింది.
తర్వాత యానీ- సిరిలకు షణ్ముఖ్, కాజల్ లెటర్స్ వచ్చాయి. దీంతో మొదటిసారి కాజల్ తన కన్నీళ్లు ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఇది చూసి కరిగిపోయిన షణ్ను కాజల్‌ను లెటర్ తీసుకోమన్నాడు. అయితే సిరి మాత్రం ‘నేనెలాగో అందుకోలేకపోయాను, కనీసం నువ్వైనా తీసుకో’ అంటూ ఏడ్చేసింది.
కానీ షణ్ను కాజల్ కే ఇవ్వమని చెప్పడంతో షన్ను లెటర్ కాస్త ముక్కలైంది. ఇది చూసి ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటూ షణ్ను, ‘అమ్మా, క్యాన్సర్‌ను జయించావు, అమ్మమ్మ చనిపోయినప్పుడు ఆ బాధ నుంచి కోలుకున్నావు, నువ్వే నా ఇన్‌స్పిరేషన్(Inspiration), నేను స్ట్రాంగ్ అని చెప్పుకొచ్చాడు. కానీ లోపలకు వెళ్లి బాగా ఏడ్చేశాడు.
ఇక కెప్టెన్ సన్నీకి స్పెషల్ పవర్ లభించింది. దీని ద్వారా జెస్సీ లెటర్‌ను సన్నీ చేతిలో పెట్టాడు బిగ్‌బాస్(Big Boss). జెస్సీకి లెటర్ ఇచ్చి సేవ్ చేయాలంటే అంతక ముందు సేవ్ అయినవాళ్ల దగ్గరి నుంచి లేఖ అందుకోవాలని చెప్పాడు.
దీంతో శ్రీరామ్ జెస్సీ కోసం తన లేఖను త్యాగం చేసి నామినేట్ అవ్వడానికి సిద్ధం అయ్యాడు. కానీ షణ్ను, సిరి, జెస్సీ శ్రీరామ్‌కు హగ్గిచ్చి వాళ్ళమధ్య వున్న గ్యాప్ ని తీసేయాలని రవి కండీషన్ పెట్టాడు. ఇప్పుడు ఇలాంటి కండిషన్ పెట్టడం కరెక్ట్ కాదని, కానీ మా మధ్య గ్యాప్ అంతా క్లియర్ అయిపోయిందని ఒక్కరిఒక్కరు హాగ్ చేసుకుని వాళ్ళ మధ్య వున్న గ్యాప్ ని దూరం చేసుకున్నారు.
దీంతో శ్రీరామ్ నామినేషన్(Nominations)లోకి వెళ్లి జెస్సీని సేవ్ చేశాడు. తర్వాత కెప్టెన్(Captain) సన్నీకి లేఖ రావడం తో హ్యాపీ గా ఫీల్ అయ్యాడు.
ఇంతటితో నామినేషన్ ప్రక్రియ పూర్తవగా రవి, సిరి, లోబో, శ్రీరామ్, షణ్ముఖ్, మానస్ ఈ వారం నామినేట్(Nominate) అయ్యారు.