ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో (Biggest reality show) బిగ్ బాస్ ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో మనందరికీ తెలిసిన విషయమే. హిందీలో ప్రసారమైన ఈ షో ప్రేక్షకులను బాగా అలరించింది.
ఈ కాంట్రవర్సీ షో, అసలు సౌత్ (South Industry) ఆకట్టుకుంటుందో లేదో అనే అనుమానాలు ఉండేవి . ఇక ఫైనల్ గా తెలుగులో కూడా ఈ రియాల్టీ షో ఆరంభంలోనే భారీ స్థాయిలో క్రేజ్ (Craze) అందుకుంది.
ఇక కంటెస్టెంట్స్ విషయంలో లీక్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పనవసరం లేదు.
గత నాలుగు సీజన్స్ లో కూడా నిర్వాహకులు కంటెస్టెంట్ లిస్ట్ ఎంత సీక్రెట్ (secret) గా ఉంచినప్పటికీ ఈజీగా వాటి కి సంబందించిన లిస్ట్ బయటకు తెలిసిపోయేది .
ఈసారి కూడా 16 మంది హౌస్ (House) లోకి అడుగుపెట్టబోతున్నారు, అని అనేక రకాల కథనాలు వస్తున్నాయి. ఫైనల్ లిస్ట్ (Final list) కూడా బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఏడు మంది ఫైనలిస్ట్ లు ఖరారు అని తెలుస్తోంది.
ఇక ఈ షో రేటింగ్ (rating) విషయానికి వస్తే, బిగ్ బాస్ సీజన్ వన్ మొదలైనప్పుడు అసలు రేటింగ్స్ వస్తాయా లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి.
జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ సీజన్ (Jr.NTR first season)లో హోస్ట్ గా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, ఈ షో జనాల్లోకి ఈజిగానే వెళ్లింది. ఆ తరువాత నాని, నాగార్జున కూడా అదే తరహాలో కొనసాగించారు.
ఈసారి కూడా నాగార్జున హోస్ట్ (Nagarjuna Host) గా వస్తుండడం తో 5వ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజా గా బిగ్ బాస్ 5 ప్రోమో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక కంటెస్టెంట్స్ విషయం లో గత ఏడాది నిర్వాహకులు కాస్త నిరుత్సాహ పరిచినట్లు టాక్ (Talk) అయితే వచ్చింది. అయినప్పటికీ షోను నడిపించిన విధానంతో మంచి రేటింగ్స్ అయితే వచ్చాయి.
ఇక ఈసారి మాత్రం ఈ విషయంలో నిర్వాహకులు కాస్త జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లీకైన 16 మంది కంటెస్టెంట్స్ లో దాదాపు 13 మంది ఫిక్స్(fix) అయ్యినట్టు సమాచారం.
ఇప్పటికే ఫైనల్ అయ్యిన కంటెస్టెంట్స్ అందరు క్వారంటైన్ (quarantine) లో వున్నారు. ఇక బిగ్ బాస్ తెలుగు 5 ఫస్ట్ ఎపిసోడ్లో ఎప్పటిలానే డ్యాన్స్ లతో కంటెస్టెంట్స్ ను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారని తెలుస్తోంది.
బిగ్ బాస్ తెలుగు 5 లో కంటెస్టెంట్లుగా ఎంటర్ అయ్యే పార్టిసిపెంట్స్ (Participants) ఫైనల్ లిస్ట్ లో యాంకర్ రవి,యాంకర్ లోబో, యాంకర్ వర్షిణి, విజేసన్నీ, ఆర్జే కాజల్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ, సీరియల్ నటి ఉమా దేవి, యూట్యూబ్ సరయు, ఆటా సందీప్, లహరి శారీ, ప్రియాంక జబర్దస్త్, అనీ మాస్టర్, మానస్, నటరాజ్ మాస్టర్ లిస్ట్ లో వున్నారు.
ఈసారి బిగ్ బాస్ 5 లో ఏడు మంది ఫైనలిస్టులను కూడా ముందుగానే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఫైనల్ ఎపిసోడ్ వరకు టాస్కు లు (Tasks) చాలా డిఫర్నేట్ గా ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
ఇక ఫైనల్ లిస్టులో యాంకర్ రవి, యాంకర్ వర్షిణి, యాంకర్ లోబో, విజేసన్నీ, యూట్యూబ్ సరయు, ఆర్జే కాజల్, ఆటా సందీప్ వంటి వారు షో తొలి వారం నుంచి చివరి వారం వరకు కూడా పోటీలో ఉంటారని మరొక కీలకమైన విషయం తెలుస్తోంది.
ఏడుగురు కూడా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ (Non stop entertainment) తో పాటు కాంట్రవర్సీ గొడవలతో కూడా సరికొత్తగా అలరించనున్నట్లు సమాచారం.
ఇక ఈ షో లో కొంత మంది కంటెస్టెంట్స్ కొన్ని రోజులు ఉండడానికి మాత్రమే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే వారికి రెమ్యునరేషన్ మాత్రం ఎక్కువ గానే ఇస్తున్నారట. ఎందుకంటే బయట ప్రోగ్రామ్లను, రియాలిటీ షోలను వదులుకొని రావాలంటే బిగ్ బాస్ (Bigboss) నిర్వాహకులు అంతకంటే ఎక్కువ పారితోషికం ఇస్తేనే వారికి న్యాయం చేసినట్లు.
ఇక అందుకే కొంతమంది యూట్యూబ్ స్టార్స్ (Youtube stars) కి అడిగిన దానికంటే కూడా ఎక్కువగా ఇస్తున్నాట్లు సమాచారం. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ వారం రోజులు ఉన్నా కూడా పది లక్షలకు పైగా ఆదాయం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక మళ్లీ మనందరినీ ఆకట్టుకునేలా తెలుగు స్టార్ అక్కినేని నాగార్జున స్మాల్ స్క్రీన్ (Small screen) పై గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమం అఫిషియల్ గా సెప్టెంబర్ 5 (September 5) నుంచి ప్రారంభం కానుంది.
ఫస్ట్ ఎపిసోడ్ సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటల (September 5 , 5PM) కు స్టార్ మాలో ప్రారంభమవుతుంది.