ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇంచుమించుగా పరిచయం ఉండే పేర్లు డయాబెటిస్ మరియు హృద్రోగాలు. వీటికి ఏ దేశంలోనూ పరిచయం అవసరం లేదు. ఈ రోగాల బారిన పడిన వారు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సాంకేతికత సహాయంతో కొద్దో గొప్పో ఒక్కో చోట వైద్య విధానం వేరైనా వీరందరి కష్టం ఒక్కటే. డయాబెటిస్ అయితే ఎప్పటికప్పుడు ఇన్సులిన్ తీసుకోవాలి. అలాగే హృద్రోగులు అయితే ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అయితే ఈ కష్టాలను తీర్చగలిగేది మాత్రం పేరెన్నిక కలిగిన ఫార్మా సంస్థలే. మరి ఏమా సంస్థలు అవి అభివృద్ధి చేస్తున్న పరిజ్ఞ్యానం ఏంటో చూద్దామా.
GE సంస్థ ఒక వేరబుల్ (wearable) స్కిన్ పాచ్ అభివృద్ధి చేస్తోంది. ఇది ఒక బాన్డేజ్ అంత పరిమాణంలో ఉంది దీనిలో OLED (Organic Light Emitting Diode) ల తో తయారవుతుంది. అలాగే వాటర్ ప్రూఫ్ కూడా. దీనిని ఒంటికి తగిలించుకుoటే, దీనిలో ఉండే సెన్సర్ ఒంటి చెమటను విశ్లేషించి, బీపి, హార్ట్ రేట్ వంటి గుండెకు సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని సేకరించి వైర్లెస్ గా మన ఫోన్ కు సైతం పంపిస్తుంది. అంతే కాదు ఇది సుమారుగా ఒక electrocardiogram లాగ కూడా పని చేస్తుంది.
Johnson & Johnson సంస్థ త్వరలోనే ఇన్సులిన్ను డెలివరీ చేసేందుకు ఒక wearable ను అమెరికాలో విడుదల చేయనుంది. దీని పేరు OneTouch Via. ఇది ఒంటికి వేసుకునే ఒక పాచ్. దీని ద్వారా పెద్ద వారి డయాబెటిస్ అవసరాల మేరకు ఇన్సులిన్ ఈ పాచ్ ద్వారా శరీరంలోకి విడుదల చేయబడుతుంది. ఇది ఒక్కసారి వేసుకుంటే మూడు రోజులు దాకా పనిచేస్తుంది. ఇది పూర్తిగా వాటర్ ప్రూఫ్ కూడా. Johnson & Johnson సంస్థ ఈ పాచ్ ను American Diabetes Association conference లో కూడా ప్రదర్శించింది.
Abbott అనే సంస్థ బ్రిటన్లో ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న FreeStyle Libre అనే wearable కు అనుసంధానంగా ఒక యాప్ ను తయారు చేసింది. దీని పేరు LibreLink app. Diasend అనే స్వీడన్ సంస్థ దీనిని పూర్తిగా డయాబెటిస్ రోగుల కోసం రూపొందించింది. ఈ wearable ద్వారా ఈ యాప్ రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను ఎప్పటికప్పుడు సేకరించి ఈ మొత్తం సమాచారాన్ని వారి వారి వైద్యులకు సైతం పంపించే వీలు ఉండటం దీని ప్రత్యేకత. ఈ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇటువంటి పరికరాల అవసరం విదేశీయులకే కాదు మనకూ ఉంది. మన దేశీ సంస్థలు ఏమైనా ఇటువంటివి వృద్ధి చేస్తే మనకే కాదు అక్కడ విడుదల చేస్తున్న పరికరాలాకు సవాలు విసిరినట్టే. ఏది ఏమైనా ఇవి అందరికీ అందుబాటులోకి రావాలని ఆశిద్దాం.