స్మాల్ స్క్రీన్ పై అత్యధిక రేటింగ్ ను దక్కించున్న రియాలిటీ షో బిగ్ బాస్ (Reality Show Big Boss). ఏ భాషలోనైనా ఈ షోకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ (Fans following) మాత్రం మాటల్లో చెప్పలేనిది.
తెలుగులో అయితే బిగ్ బాస్ రియాలిటీ షో కు వున్నా క్రేజ్(craze) అంతా ఇంతా కాదు. గత నాలుగు సీజన్లు ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ నాలుగు సీజన్ల షో టీఆర్పీ సైతం అద్భుతంగా సాధించి, మంచి సక్సెస్ తో షో ముగిసింది.
బిగ్ బాస్ 5 సీజన్ రేపటి నుండి ప్రారంభం కానుంది. స్టార్ మాలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి షో మొదలవుతుంది.
ఇప్పటికే 16 మంది కంటెస్టెంట్స్ ఖరారైన విషయం తెలిసిందే. కంటెస్టెంట్స్ భారీ స్థాయి లో రెమ్యూనరేషన్ అడుగుతున్నట్లు సమాచారం. అయితే 5 గురు మాత్రం వారానికి 40 వేలు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరిలో అనీ మాస్టర్,కార్తీకదీపం ఫేమ్ ఉమాదేవి, సీనియర్ ఆర్టిస్ట్ ప్రియ, షణ్ముఖ్ జశ్వంత్, యాంకర్ రవి, అత్యధిక పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అఫీషియల్ గా ప్రకటన వెలువడాల్సి ఉంది .
అయితే ఈ 5 గురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ షో లో పాల్గొంటారో లేదో తెలియాలంటే షో స్టార్ట్ ఆయె వరకు ఆగాల్సిందే.
ఈ షో కు ఎంపికైన కంటెస్టెంట్స్ జాబితా లో ప్రియ, నటరాజ్ మాస్టర్, అనీ మాస్టర్, శ్వేతా వర్మ, ఉమాదేవి, మానాస్, షణ్ముఖ్, వి.జె.సన్నీ, ప్రియాంక సింగ్, లోబో, శ్రీరామ్, సిరి హనుమంత్, ఆర్జే కాజల్, జశ్వంత్, లహరి, విష్ణు, సరయు, ఉన్నారు.
ప్రస్తుతం, వీరందరూ క్వారంటైన్ (quarantine)లో ఉండగా.. మొదటి ఎపిసోడ్లోనే అందరూ బిగ్ బాస్ హౌస్ (Big Boss House) లోకి ఎంటర్ కానున్నారు.
ఇక ఈ సీజన్ కి కింగ్ నాగార్జున హోస్ట్ (Nagarjuna Host) గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
బిగ్ బాస్ 5 సీజన్ కు రికార్డు స్థాయిలో రేటింగ్స్ (ratings) వస్తాయని నాగ అభిమానులు భావిస్తున్నారు.
ఏదేమైనా షో ప్రారంభమైతే కానీ ఈ షో కి సంబంధించిన రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడదు.