బిగ్ బాస్ సీజన్ 5 మొదలయ్యి అప్పుడే రెండో రోజు కు వచ్చేసింది.
బిగ్ బాస్ షో అంటే కాంట్రవర్సరీ షో. ఎంటర్టైన్మెంట్, టాస్క్ లు, ఎమోషన్స్ , గొడవలు, హీట్ ఆర్గ్యుమెంట్స్, కొత్త పరిచయాలు ఇలా అన్ని కలబోసి పండించే ఈ షో రెండో రోజు ప్రేక్షకుల ముందుకు అలరించడానికి డ్రామా షురూ చేసింది.
ప్రతి ఒక్కలు మైండ్ గేమ్ ఆడడానికి అంత ప్రిపేర్ అయ్యి వచ్చినట్లు అనిపిస్తోంది, ఎవరి గేమ్ స్ట్రాటజీ వాళ్ళు ఫిక్స్ చేసుకున్నట్టు వున్నారు. హౌస్ మేట్స్ ఎవరు ఏమి చెప్పిన ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసి గొడవకు దిగుతున్నారు.
ట్రాన్స్ జెండర్
ఇక రెండో రోజు ఎపిసోడ్ లో అర్థరాత్రి ప్రియాంక హౌస్ మేట్స్ తో తను ట్రాన్స్ జెండర్ గా మారిన సంగతులు, అలాగే ఆ టైం లో తాను పడిన కష్టాలు చెప్పుకుని ఎమోషన్ అయ్యింది.
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
ఉదయం ‘సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్’ అనే పాట కు మన హౌస్ మేట్స్ ఫుల్ జోష్ లో డాన్స్ స్టెప్పులు వేశారు. కిచెన్ పనుల్లో హెల్ప్ చేయకుండా జిమ్ లో, లౌంజ్ లో సమయం గడిపేస్తున్నారని హౌస్ మేట్స్ పై సీరియస్ అయినా ఉమా, అక్కడే పని చేస్తున్న సరయు, శ్వేతలు మీరు కాస్త అర్థమయ్యేలా చెప్పండి అని ఉమా కి చెప్పారు.
డిస్కషన్
మరో పక్క లహరి-కాజల్‌ల మధ్య డిస్కషన్ నడిచింది. మన ఇద్దరి మధ్య వున్న గ్యాప్ ను క్లియర్ చేసుకోవాలని కాజల్ లహరి తో చెప్పడంతో, అది వెంటనే జరగదని కొంచెం టైం పడుతుందని చెప్పింది లహరి.
పవర్ రూమ్
ఈ సీజన్‌లో కొత్తగా పవర్ రూమ్‌ను తీసుకొచ్చిన బిగ్‌బాస్. ఈ రూమ్‌లోకి వెళ్లేందుకు హౌస్ మేట్స్ కి టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్. ఈ పవర్ రూమ్ టాస్క్ లో ఎవరైతే పవర్ ని గెల్చుకుంటారో, వారికి ఆటను మార్చగలిగే శక్తి దొరుకుతుందని చెప్పాడు.
శక్తి చూపరా డింభకా
అందులో భాగంగా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ‘శక్తి చూపరా డింభకా’ను ప్రవేశపెట్టాడు. ఇంట్లో ఉరుముల సౌండ్ వచ్చిన ప్రతిసారి హౌస్ మేట్స్ వెళ్లి పవర్ రూం ముందు ఉంచిన బటన్‌ని ప్రెస్ చేయాలని ఎవరైతే అందరికంటే ముందు వెళ్లి బటన్‌ని ప్రెస్ చేస్తారో వాళ్లకే పవర్ రూం శక్తి లభిస్తుందని టాస్క్ రూల్స్ ని తెలిపిన బిగ్ బాస్.
ఈ పవర్ రూం టాస్క్‌లో ఫస్ట్ ఉరుముల సౌండ్ వచ్చినపుడు మొదట బటన్ ను ప్రెస్ చేసి విశ్వ విజేతగా నిలిచాడు. ఇంట్లో ఇద్దరు సభ్యుల వస్తువులతో పాటు ఒంటిపై ఉన్న బట్టలతో సహా స్టోర్ రూంలో పెట్టాల్సి ఉండంతో యాంకర్ రవి, ప్రియ పేర్లు చెప్పాడు విశ్వ.
ఫిటింగ్
అయితే ఇక్కడ ఫిటింగ్ ఏంటంటే, వాళ్లు ఆపోజిట్ జెండర్ బట్టలు వేసుకోవచ్చని చెప్పారు బిగ్ బాస్.
ఇక వాష్ రూం క్లీనింగ్‌లో ఉన్న లోబో బట్టలు, బనియన్లు ఎక్కడపడితే అక్కడ వేస్తున్నారని, వాటిని నేనే మడత పెట్టాలంటూ కామెడీ గా సెటైర్లు వేశాడు. ఆ తరువాత ప్రియాంక రవి, విశ్వాలను అన్నయ్య అని పిలుస్తానని, మానస్ ను అన్నయ్య అని పిలవను అని చెప్పడం తో మానస్ ని హౌస్ మేట్స్ లవర్ బాయ్ అని ఆటపట్టించడం క్యూట్ గా అనిపించింది.
లేడీ గెటప్‌లో ఉన్న రవిని కాసేపు ఎత్తుకుని తిప్పిన విశ్వ తన తమ్ముడిని గుర్తు చేసుకుని ఎమోషనలయ్యాడు. గతేడాది తమ్ముడిని కోల్పోయానని కన్నీటి పర్యంతమయ్యాడు. రవి తనను అన్న అని పిలుస్తాడని, నా కోసం ఈ టాస్కు ను ఒప్పుకున్నాడంటూ ఎమోషనల్ అయ్యాడు. దీంతో రవి అతడిని హత్తుకుని ఓదార్చాడు.
కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో తర్వాత మానస్ పవర్ బటన్ ని ప్రెస్ చేసి పవర్‌ను గెల్చుకున్నాడు. అతడు సెలెక్ట్ చేసుకునే హౌస్ మాటే హౌస్‌లోని ఇంటి సభ్యులందరూ పడుకున్నాకే నిద్రపోవాల్సి ఉంటుందని బిగ్‌బాస్ ఆదేశించాడు. లేదంటే పెద్ద సౌండ్‌తో అలారమ్ మోగుతుందని చెప్పాడు. మానస్ ఆర్జే కాజల్ కు ఈ టాస్క్ ను ఇచ్చాడు.
ఎల్లహే
ఇక సిరి, లోబోల మధ్య గొడవ పీక్ కి వెళ్ళింది. ‘ఏయ్, నీకు ప్రాబ్లమ్ ఉంటే నాకు చెప్పు, వాళ్లకు వీళ్లకు చెప్పకు’ అని లోబో అనగానే సిరి మాత్రం సింపుల్‌గా ‘ఎల్లహే’ అని అంటుంది. దీనికి ఒక్కసారిగా సీరియస్ అయిన లోబో సక్కగా మాట్లాడు అని అంటాడు. దీనికి సిరి బదులిస్తూ ‘నన్ను గెలికితే ఇలాగే మాట్లాడుతాను’ అని దురుసుగా రిప్లై ఇస్తుంది. అంతటితో ఆగని లోబో, ‘అద్దంలో మొహం చూసుకో పో’ అంటాడు.
దీంతో సిరి మొహం గురించి మాట్లాడితే మొహం పగిలి పోద్ది అని అనడం తో, వీరిద్దరి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఒక్కసారిగా హౌజ్‌లో హీట్ వాతావరణం ఏర్పడింది. ఈ గొడవ అంత సరదాగా చేసాం అని లోబో, సిరి చెప్పడం తో అందరు రిలాక్స్ అయ్యారు. అయితే కంటెంట్ కోసం ఇలాంటివి చేయదు అని సరయూ, సిరి కి వార్నింగ్ ఇచ్చింది.
కిచెన్ పనులను షేర్ చేసుకుందామని కాజల్ అందరి తో డిస్కస్ చేయడానికి ఇనీషియాట్ తీసుకోవడం తో రచ్చ మొదలైంది. మరి అంత హైపర్ అవ్వకని, నార్మల్‌గా మాట్లాడండి, కావాలని కంటెంట్ క్రియేట్ చేయాలని చూడొద్దని
హైడ్రామా
కాజల్ ను హెచ్చరించింది లహరి. చాలా హైడ్రామా చేస్తున్నారని చురకలంటించింది. నీలో పాజిటివ్ వైబ్స్ లేవు, అటాకింగ్ పొజిషన్‌కి వస్తే నేను ఊరుకోను అని నువ్వు ఇక్కడి ఎందుకు వచ్చావో నేనూ అందుకే వచ్చానాని, బిగ్ బాస్ నీకు డ్రీమ్ ఎలాగో నాకూ డ్రీమ్ అంతే అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
అయితే కాజల్ మాత్రం వెనక్కి తగ్గి, లహరికి సారీ చెప్పి ఎమోషనల్ అయ్యింది. తరువాత రవి, మానస్‌లు ఆమెను ఓదార్చారు.
తరువాత అందరు కబుర్లు చెపుకుంటుండగా సిరి కూర్చున్న కుర్చీ లో హమీదా కూర్చుంటే ఆమెను అక్కడి నుంచి లేవమన్నాడు జెస్సీ. దీనితో చిన్న పాటి డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత మరో ఖాళీ కుర్చీ దొరికితే దాని మీద కాలేసి కూర్చున్నాడు.
ప్లీజ్ …రిక్వెస్ట్…
అక్కడికి వచ్చిన యానీ మాస్టర్ తనకు చెయిర్ ఇవ్వమని రిక్వెస్ట్ చేసింది. ప్లీజ్ అంటున్నా అతడు నిరాకరించడంతో యానీకి కోపం వచ్చింది. నాటకాలు చేయకు, నీ గొంతే కాదు నా వాయిస్ కూడా లేస్తుంది, అక్కడ కాళ్లెందుకు పెట్టినవ్ అని జెస్సీ మీద పెద్ద గా అరుస్తూ ఊగిపోయింది .
ఇంతలా ఆవేశపడ్డ యానీ మాస్టర్ తన బెడ్ దగ్గరకు వెళ్లి ఏడ్చారు. అయితే ఈ సీన్ చూస్తుంటే ఎందుకో యాని మాస్టర్ కావాలనే జెస్సి తో గొడవపడినట్టు అనిపిస్తుంది.
మొత్తం మీద ఈ ఎపిసోడ్ లో జరిగిన రచ్చ చూస్తే, హౌస్ మేట్స్ అందరిలోనూ యాటిట్యూడ్ కనిపిస్తోంది.
ఎవరికి వాళ్ళు తగ్గేదే లేదన్నట్టు ఉన్నారనిపిస్తుంది. ప్రతి ఒక్కలు మైండ్ గేమ్ తో పాటు, ఎమోషన్స్ ని కూడా హౌస్ లోకి పట్టుకొచ్చినట్టు వున్నారు.
హౌస్ మేట్స్ అందరు ఎమోషన్ అయ్యి బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ మోనాల్ ని గుర్తుచేస్తున్నారు. మునుముందు ఎవరు స్ట్రాంగ్ గా అవుతారో, యాటిట్యూడ్ ని తగ్గించి చివరి దాక నెట్టుకొస్తారో చూడాలి.
ఇక రేపటి ఎపిసోడ్ ఎలా ఉంటుందో మరి….