భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో(BEL)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) రిలీజ్ చేసింది. ఇందులో ట్రైనీ ఇంజనీర్(Trainee Engineer) పోస్టులు 80 అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్(Project Engineer)కు 70 పోస్టులు ఉన్నాయి.
ఈసీఈ(ECE)లో ప్రాజెక్ట్ ఇంజనీర్(PE) 44, మెకానికల్)Mechanical)లో 20, ఈఈఈలో(EEE) 4, సీఎస్(CS)లో 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రైనీ ఇంజినీర్‌కు(Trainee Engineer) ఈసీఈలో 54, మెకానికల్‌లో 20, ఈఈఈలో 4, సీఎస్‌లో 2 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 3 ఆగస్టు(August 3rd) 2022.
ఈ రిక్రూట్‌మెంట్(Recruitment)లో భర్తీ చేయనున్న పోస్టులను కేవలం కాంట్రాక్ట్(Contract) ప్రాతిపదికన నియమించుకోనున్నారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్(Web site) ను చూడండి
ముఖ్య సమాచారం
వయోపరిమితి: ట్రైనీ ఇంజనీర్(TE)పోస్టుకు వయోపరిమితి(Age Limit) 28 సంవత్సరాలు. ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు వయోపరిమితి 32 సంవత్సరాలు.1 ఆగస్టు, 2022 వరకు 28 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఐదేళ్లు, ఓబీసీ వర్గాలకు మూడేళ్లు వయో సడలింపు(Age Exemption) ఉంటుంది.
విద్యార్హత:
ఈ పోస్టులకు AICTE గుర్తింపు పొందిన సంస్థ నుండి 4 సంవత్సరాల B.SC ఇంజనీరింగ్ లేదా B.Tech పూర్తి చేసి ఉండాలి. ఈ సబ్జెక్టులలో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి. కనీసం 55 శాతం ఉండాలి. SC, ST మరియు PWD అభ్యర్థులకు ఉత్తీర్ణులైతే(Qualify) దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం:
ట్రైనీ ఇంజనీర్‌కు 6 నెలలు అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్‌కు 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి . ట్రైనీ ఇంజనీర్‌కు మొదటి సంవత్సరంలో రూ.30,000, రెండో సంవత్సరంలో రూ.35,000 చెల్లించనున్నారు.మూడో సంవత్సరంలో రూ.40, 000 చెల్లించనన్నారు. ప్రాజెక్ట్ ఇంజనీర్‌కు మొదటి సంవత్సరంలో రూ.40,000, రెండోసంవత్సరంలో రూ.45,000, మూడవ సంవత్సరంలో రూ.50, 000 మరియు నాల్గవ సంవత్సరంలో రూ.55, 000 చెల్లించనున్నారు.
ఫీజు, పరీక్ష వివరాలు :
దరఖాస్తు చేసుకున్న అభ్యర్దులను రాత పరీక్షకు పిలుస్తారు. ఈ పరీక్ష 85 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూకు 15 మార్కులు కేటాయించబడ్డాయి. రాత పరీక్ష(Written Exam) మరియు ఇంటర్వ్యూ(Interview)లో జనరల్ , EWS , OBCలకు 35 శాతం మార్కులు అవసరం కాగా SC, ST మరియు PWBDలకు 30 శాతం మార్కులు అవసరం. జనరల్ , EWS, OBC అభ్యర్థులు ప్రాజెక్ట్ ఇంజనీర్ దరఖాస్తు(Application) ఫీజు రూ.472 కాగా ట్రైనీ ఇంజనీర్ పోస్టుకు దరఖాస్తు ఫీజు రూ.177 చెల్లించాలి.SC, ST మరియు PWDలకు ఎలాంటి ఫీజు లేదు. దరఖాస్తు రిజిస్ట్రేషన్ లింక్ 20 జూలై, 2022 నుంచి యాక్టివేట్(Activate) కానుంది.