బీట్‌రూట్ శాస్త్రీయ నామం తెలుసా , ‘బేటా వల్గురీస్. వారానికి కనీసం రెండు ,మూడుసార్లు ఏదో ఒక రూపంలో బీట్‌రూట్‌ను తీసుకున్నట్లయితే.. మన శరీరానికి రక్త ప్రసరణ వ్యవస్థ బాగా మెరుగవుతుంది.

తద్వారా గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు. బీట్‌రూట్ మానవ  శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఇది ఒత్తిడిని ఎదుర్కోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది.

అంతేగాక కేవలం రెండు రోజులపాటు 400 ఎంఎల్ చొప్పున బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగిన వృద్ధుల్లో కూడా మెదడు భాగంలో రక్త ప్రసరణ వేగం పెరిగి ఆలోచనల్లో చురుకుదనం కనిపించినట్లు తాజాగా ఒక  అధ్యయనంలో పేర్కొన్నారు.

అందుకని ,చిక్కని ఎర్ర రంగులో ఆకట్టుకునే బీట్‌రూట్‌ను మరి ఇంకెప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు.

బీట్ రూట్ జ్యూస్‌ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీకు తెలుసా…

beetroot juice

బీట్ రూట్ – రక్తహీతనకు చెక్ పెడుతుంది

ఐర‌న్ తక్కువగా ఉంటే తొందరగా  రక్తహీనతకు గురవుతారు.

అలాంటివారు బీట్‌ రూట్ జ్యూస్ రోజూ క్రమం తప్పకుండా  తాగితే ఐరన్ పుష్కలం గా  పెరుగుతుంది.

అంతేకాకుండా  బ్లడ్ లో హిమోగ్లోబిన్‌ స్థాయి కూడా చాలా త్వరగా పెరుగుతుంది.

నీరసం పోతుంది

మనలో చాలా మంది తరచూ నీరసంతో ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారు ప్రతీ రోజూ కొన్ని బీట్ రూమ్ ముక్కలు తిన్నా,ఏదో ఒక రూపం లో బీట్ రూట్ ని తీసుకున్నా , లేదా కొంచెం బీట్ రూట్ జ్యూస్ తాగినా సరిపోతుంది.

దీంతో క్రమంగా నీరసం పోయి శరీరానికి ఫుల్ ఎనర్జీ వస్తుంది.

కొవ్వు కరిగిపోతుంది

ప్రతీ రోజూ బీట్ రూట్ జ్యూస్‌ తాగడం వలన చెడు (బ్యాడ్) కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.

మద్యం తాగడం వలన పాడైపోయిన లివర్‌ను కాపాడేందుకు కూడా ఇది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది.

అది ఎలాగంటే బీట్ రూట్ శరీరంలోని విష వ్యర్థాలు అన్నీ  తరిమికొట్టే యాంటీఆక్సిడెంట్స్ (Antioxidants) కూడా పుష్కలం గా  కలిగివుంది.

అంతే కాకుండా ,

విటమిన్ A, B6, ఐరన్ ఇలాంటివి  బీట్ రూట్ జ్యూస్‌లో అబ్దుతం గా ఉన్నాయి.

అందుకే బీట్ రూట్ జ్యూస్‌ని సూపర్ ఫూడ్‌గా కూడా చేర్చారు.

బీట్ రూట్ జ్యూస్ అనేది  లివర్ లో మంటను బాగా తగ్గించడానికి తోడ్పతుంది. శరీరానికి శక్తిని కలిగిస్తుంది.

beetroot piecesగర్భిణీలకు చాలా మంచిది

బీట్ రూట్ గర్భిణీలకు బాగా  మంచిది. ఎలా అంటే గర్భిణీలకు కావాల్సిన ఫోలిక్ యాసిడ్ అంతా కూడా బీట్ రూట్ ద్వారా శరీరానికి అందుతుంది.

గర్భంలోని పిండం ఎదుగుదలకు  బీట్ రూట్ జ్యూస్ చాలా బాగా పని చేస్తుంది అని వైద్య నిపుణులు చెప్తున్నారు .

చర్మానికి రక్షణ :

తీవ్రమైన ఎండ, ఇతర అనేక రకాల కాలుష్యాల నుంచీ చర్మాన్ని కాపాడుకోవడం మనకి ఎంతో అవసరం.

ఫ్రీ రాడికల్స్ అనేవి చర్మంలోకి వచ్చి మన చర్మ కణాల్ని నాశనం చేస్తుంటాయి.

సరిగ్గా అలాంటప్పుడు బీట్ రూట్ జ్యూస్ శరీరం లోనికి ప్రవేశించి ఫ్రీ రాడికల్స్ అంతు చూస్తుంది.

అంతే కాకుండా బీట్ రూట్ జ్యూస్‌లో లైకోపీన్ కూడా ఉంటుంది. ఇది సూర్యుడి నుండి వచ్చే సూర్యకిరణాల  నుండి  మన చర్మాన్ని కాపాడుతుంది.

విటమిన్స్

బీట్ రూట్‌ లో శరీరానికి కావాల్సిన అన్ని విటమిన్స్ ఉంటాయి.బీట్ రూట్ నుండి  బీ సీ విటమిన్స్ అందుతాయి.

అంతే కాకుండా బీట్ రూట్‌లో కాల్షియంతో పాటు మెగ్నిషియం ,పొటాషియం కూడా అధికంగానే ఉంటాయి . ఇవన్నీ మానవ శరీరానికి  చాలా అవసరం.

ఉల్లాసంగా ఉంటారు

బీట్ రూట్ జ్యూస్ తాగితే మనిషి ఉల్లాసంగా ఉండగలుగుతారు. మూడీగా అనిపిస్తున్నపుడు  తరచూ కొంచెం బీట్ రూట్ జ్యూస్ తాగుతూ ఉండండి.

మీలో ఎక్కడలేని శక్తి ఆటోమేటిక్ గా వస్తుంది.

బీట్‌రూట్ వల్ల రక్తంలో ని నైట్రేట్ అనేది  రెట్టింపవుతుంది. దీనివలన  కండరాలు బాగా చురుగ్గా పనిచేస్తాయి. ప్రతిరోజూ బీట్ రూట్ రసం తాగితే శరీరంలో ని కొవ్వు త్వరగా కరుగుతుంది.

బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్ లో క్రమం తప్పకుండా రోజు బీట్‌రూట్ జ్యూస్ తాగడం వలన మంచి ఫలితం ఉంటుంది .

బీట్ రూట్ లో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూసారా ….  మరి మీరు కూడా మీ రోజు వారీ ఆహారం లో బీట్ రూట్ ని చేర్చుకుని ప్రతీ రోజూ ఉల్లాసం గా , మంచి ఆరోగ్యం గా జీవించండి ..