బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల(Release) చేసింది. నోటిఫికేషన్లో భాగంగా ఆఫీస్ అసిస్టెంట్(Office Assistant), డేటా ఎంట్రీ ఆపరేటర్స్(Data Entry Operators) పోస్టులను భర్తీ చేయనున్నారు. సెలెక్టయినా అభ్యర్థులు ఢిల్లీ డెవలప్ మెంట్ ఆథారిటీ (DDA) ఆఫీసులో పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ (Online)విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలివే!
ముఖ్య సమాచారం:
మొత్తం ఖాళీలు : 378
ఆఫీస్ అసిస్టెంట్ – 200
డేటా ఎంట్రీ ఆపరేట్ – 178 పోస్టులు
విద్యార్హతలు: ఆఫీస్ అసిస్టెంట్(OA) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా డిగ్రీ(Degree) పూర్తి చేసి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్(DEO) పోస్టులకు అప్లై చేసుకునే వారు 12వ తరగతి(12TH Class) లేదా డిగ్రీ(Degree) ఉత్తీర్ణత సాధించాలి.
వయసు: అభ్యర్థుల వయసు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అసిస్టెంట్ పోస్టులను రాత పరీక్ష(Written Exam) ఆధారంగా ఎంపిక చేస్తారు. డేటా ఎంట్రీ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు హిందీ(Hindi) లేదా ఇంగ్లిష్(English)లో నిర్ణీత వేగంతో టైపింగ్(Typing) చేయగలగాలి.
దరఖాస్తు రుసుము: పరీక్ష ఫీజుగా జనరల్(General) అభ్యర్థులు ర.750, ఓబీసీ(OBC) రూ.750, ఎస్సీ/ఎస్టీ(SC/ST) రూ.450, ఎక్స్ సర్వీస్మెన్(EX-Servicemen) రూ.750, మహిళలు(Women) రూ.750, ఎడబ్ల్యూఎస్/పీహెచ్(PH) రూ.450 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరితేది: దరఖాస్తుల(Application) స్వీకరణకు 25-04-2022గా నిర్ణయించారు.