మంచి పోషకాహారం, మంచి ఆరోగ్యంతో పాటు అనేక పరిస్థితుల నివారణ మరియు చికిత్సతో ముడిపడి ఉంటుంది.
ప్రతిరోజూ ప్రణాళిక ప్రకారం విటమిన్(Vitamins)లను పొందడం పోషకాహార సమీకరణంలో ముఖ్యమైన భాగం, మరియు నివారణ సంరక్షణకు బి విటమిన్లు అవసరం.
ప్రస్తుతం విటమిన్లు మన నిత్య జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.విటమిన్లు లేని ఆహారం తీసుకుంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు మనలని చుట్టూ ముట్టే ప్రమాదముందని వైద్యులు చెప్తున్నారు.
ముఖ్యంగా బి విటమిన్లు వుండే ఆహారం తీసుకుంటే శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది.
మరి ఆ బి విటమిన్లు(Vitamin B) ఏయే ఆహారం లో లభిస్తుంది. వీటి వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
శరీరంలో జీవక్రియలు సాఫీగా జరగాలంటే అవసరమైన ఎంజయ్మేలు(Enzymes) ఉత్తేజంగా పని చేయడానికి విటమిన్లు చాలా ఉపయోగపడతాయి.
శరీరంలో ఏదైనా విటమిన్ లోపం కనిపించినట్లైతే జీవక్రియలు కుంటు పడి వ్యాధి లక్షణాలు బయటపడతాయి.
విటమిన్లు ద్రావణీయత ఆధారంగా కొవ్వులొ కరిగే విటమిన్లు, నీటిలో కరిగే విటమిన్లు అని రెండు రకాలుగా ఉంటాయి. కొవ్వులొ కరిగే విటమిన్లు ఏ, డి, ఈ, కె, నీటిలో కరిగే విటమిన్లు బి, సి లు. విటమిన్లు ఎంజైమ్ లకు సహాయ ఎంజైమ్ లుగా పని చేస్తాయి. ఇవి సూక్ష్మ పోషకాలుగా వ్యవహరిస్తాయి.
విటమిన్ బి ఎనిమిది(Eight) రకాలుగా ఉంటాయి. బి విటమిన్లు కణాలా జీవక్రియలు విశిష్ట పాత్ర పోషిస్తాయి.
కొన్ని రసాయన నిర్మాణ లక్షణాల వలన విటమిన్ బి1, బి2, బి3, బి5,బి6,బి7,బి11, బి12 గా నిర్వచించారు.
థయామిన్(thiamine) లు బి1 గా పేర్కొంటారు. నరాలను ఆరోగ్యవంతంగా ఉంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
రిబోఫ్లేవిన్(riboflavin) ని విటమిన్ బీ2 అని అంటారు. బి2 అడ్రినల్ గ్రంథి(Adernal Gland) నుండి హార్మోన్ల స్రవణకు ఎర్ర రక్త కణాలు ఏర్పడ్డానికి గ్లైకోసైన్(Glycocine) అనే హార్మోన్ ఉత్పత్తికి చాలా అవసరం.
పాలు, పప్పులు, అసలు తీసుకొని వారిలో బి2 లోపం కనిపిస్తుంది. దీని లోపం వాళ్ళ గ్లాసిటిన్, నాలుక పూత, యంగులర్ స స్తమటైటిస్, కంటి పొరల్లో మార్పులు కనిపిస్తాయి.
ఇక బి౩ విషయానికి వస్తే నియాసిన్(Niacin) గా పిలుచుకునే ఈ విటమిన్ వల్ల డియెన్ఏ(DNA), ఆర్యెన్ఏ(RNA) తయారీకి ఉపయోగపడుతుంది. దీని లోపం కారణంగా కణాలు సక్రమంగా పని చేయవు. నియాసిన్ లోపం వల్ల డెర్మటైటిస్, డయేరియా, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి.
పైరాడాక్సిన్ ను బీ6 విటమిన్ అంటాం. పైరాడాక్సిన్(Peradaxcin) లోపం వల్ల పెదవుల చివర పగుళ్లు వస్తాయి. రక్త హీనత వచ్చే అవకాశం ఉంటుంది.
ఫోలిక్ యాసిడ్(Folic Acid) గా పిలుచుకునే బీ9 విటమిన్ కణాల పెరుగుదల, కణ విభజనకు చాల అవసరం. గర్భిణల్లో దీని ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. ఎర్ర రక్త కణా(Red Blood Cells)లు పరిపక్వము చెందక అసాధారణ మార్పులకు గురవుతాయి.
బి విటమిన్ అన్నిటికంటే ముఖ్యమైనది బీ12. దీనినే సైనోకోబాలమిన్(Cyanocobalamin) అని పిలుస్తారు. జీర్ణాశయంలో మంచి బాక్టీరియా(Bacteria) ను ఉత్పత్తి చేస్తుంది. డియెన్ఏ ఉత్పత్తి లో పాల్గుంటుంది. ఎర్ర రక్త కణాల తయారీకి చాలా అవసరం. నరాలలో ఉత్పన్నమయ్యే ప్రేరణను వేగవంతం చేస్తుంది.
ఈ విటమిన్ లోపం కారణంగా వచ్చే సమస్యలను పేర్నిషియస్ అనీమియా(pernicious anemia) గా పేర్కొంటారు. బీ12 లోపం కారణం గా చర్మం పాలిపోవడం. శ్వాస తీసుకోలేకపోవడం, అతిసారం, శరీరం చల్ల బడిపోవడం జరుగుతాయి.
బి విటమిన్ లను, తృణ ధాన్యాలు,చిరు ధాన్యాలు, ఓట్స్ పాలు, పల పదార్థాలు, కాలేయం, గుడ్డు, మాంసం, నూనె గింజలు, ఆకు కూరలు, చిక్కులు, తాజా కూరగాయలను తీసుకోవడం ద్వారా పొందవచ్చు.
మనం ఆరోగ్యంగా జీవించడానికి బి విటమిన్ల(Vitamin B) అవసరం ఎంతైనా వుంది. రోజు వారి తీసుకునే ఆహారం లో అన్ని ఉండకపోవచ్చు. ఫలితంగా పలు వ్యాధులకు దారి తీయుట, సరైన పెరుగుదల ఉండకపోవడం, మంచి తెలివితేటలు పొందలేకపోవటం వంటివి జరిగే అవకాశం వుంది.
అందుకే మీరు తీసుకునే ఆహారంలో బి విటమిన్లు ఉండేలా చూసుకోండి……..