మనకు ఇప్పటికే మార్కెట్లో మనం తినే ఆహారంలో ఎన్ని పోషకాలు ఉన్నాయో, ఎన్ని కెలొరీ లు ఉన్నాయో చెప్పే పరికరాలు వచ్చేసాయి. అవి మన అర చేతిలో పట్టే చిన్న పరికరాలు (food scanner) వంటివి, అలాగే గతంలో మనం చెప్పుకున్న palette, ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక రకం అయితే ఇప్పుడు చెప్పబోయేది ఇందుకు పూర్తిగా భిన్నం. అదేంటంటే ఒక నెక్లెస్ మనం తినే ఆహారం – మనం ఆహారాన్ని నమిలి తినడం ద్వారా వచ్చే శబ్దాన్ని బట్టి అందులో ఎన్ని కెలొరీ లు ఉన్నాయో చెప్పగలదు. ఆశ్చర్యంగా అనిపించే ఆ నెక్లెస్ విశేషాలు ఇవిగో.

చైనా లోని Northeastern University కి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ Wenyao Xu మరియు అమెరికా లోని University at Buffalo (UB) కు చెందిన పరిశోధకులు ఈ AutoDietary అనే నెక్లెస్ ను తయారు చేసారు. వీరి మాటల్లో చెప్పాలంటే ఒక్కో ఆహారానికీ దాన్ని మనం నమిలి తినేటప్పుడు ఒక్కో శబ్దం వస్తుంది. ఈ నెక్లెస్ ఆ శబ్దాన్ని గుర్తించి ఆ సమాచారాన్ని బ్లూ టూత్ ద్వారా ఫోను లోని యాప్ కు పంపిస్తుంది. ఇక ఈ యాప్ లో పరిశోధకులు ముందుగానే ఆ ప్రత్యేకమైన శబ్దం గల ఆహార పదార్ధానికి ఎన్ని కెలొరీ లు ఉన్నాయో రాయబడి ఉంటుంది. ఇందుకోసం వీరు ఎన్నో రకాల ఆహార పదార్ధాలను నమిలేటప్పుడు వచ్చే శబ్దాలను ఒక లైబ్రరీ లా తయారు చేసారు. ఈ నెక్లెస్ లో ఉండే మైక్రో ఫోన్ ఆ శబ్దాన్ని ఒక algorithm ఆధారంగా గుర్తించగానే ఆ ఆహార పదార్ధానికి ఎన్ని కెలొరీ లు ఉన్నాయో సులువుగా తెలిసిపోతుంది.

ఇక ఇది ఎలా పని చేస్తుంది అంటే ఈ నెక్ లేస్ ను మెడకు ధరించాలి. దీంట్లో మెడ వెనుక భాగంలో ఒక మైక్రో ఫోన్, మన సాధారణ జిప్ అంత పరిమాణంలో ఉంటుంది. ఇది మనం తినే ఆహార శబ్దాన్ని గుర్తించి ఆ సమాచారాన్ని బ్లూటూత్ ద్వారా మన ఫోనులోని యాప్ కు పంపిస్తుంది. ఇక యాప్ లో మనకు ఎన్ని కెలొరీ లు ఉన్నాయి అనే సమాచారం తెలుస్తుంది. అయితే ఇక్కడ మైక్రో ఫోన్ శబ్దాన్ని గుర్తించడం కీలకం. అలాగే మనం ఆహారాన్ని నమిలేటప్పుడు ఒక్కో పదార్ధానికీ ఒక్కో రకమైన శబ్దం వస్తుంది అన్న అంశం ఆధారంగా ఈ నెక్లేస్ ను తయారు చేయడం విశేషం.

 

దీనిని 13 నుంచీ 49 సంవత్సరాల వయసున్న వారిలో 12 మందిని ఎంపిక చేసి వారికి మంచి నీటితో సహా ఆరు రకాల ఆహారాలైన – ఆపిల్స్, కేరేట్స్, పొటాటో చిప్స్, కుకీస్, పల్లీలు మరియు వాల్ నట్స్ తినిపించిగా ఈ AutoDietary స్మార్ట్ నెక్లెస్ 85 శాతం విజయవంతంగా వారు తినే ఆహారాన్ని గుర్తించి అందులోని కెలొరీ లను చూపించింది.

అయితే ఇటువంటి వాటికి ఉండే ఒక పరిమితి ఏంటంటే పలు రకాల ఆహార పదార్ధాలతో వండిన/చేసిన ఆహార పదార్ధంలో ఎన్ని కెలొరీ లు ఉన్నాయో ఇవి అంచనా వేయలేవు. ఈ పరిమితిని అధిగమించడానికి Xu, ఈ algorithm ను మార్పు చేసి అలాగే ఈ నెక్లెస్ అనుబంధంగా మరొక చిన్న పరికరాన్ని తయారు చేయడం ద్వారా దీనికి పరిష్కారం లభిస్తుంది అంటున్నారు. ఈ పరిశోధన IEEE Sensors జర్నల్ లో ప్రచురించబడింది.

Courtesy