ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(AP State)లో కొన్ని ప్రత్యేక విభాగపు పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలను ఇంగ్లిష్తో పాటు తెలుగులోనూ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిర్ణయించింది. దీనివల్ల అభ్యర్థులందరికీ(Candidates) మేలు జరుగుతుందని APPSC కమిషన్ భావిస్తోంది.
ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. కొన్ని సాంకేతిక(Technical), ప్రత్యేక అర్హతల(Special Qualification)తో కూడిన పోస్టుల నియామకాల(Posting)కు APPSC ఇప్పటివరకు ఆంగ్లంలోనే పరీక్షలు నిర్వహిస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే.
ఇకపై వీటిని తెలుగు మీడియంలో కూడా నిర్వహించాలని గత కొంతకాలంగా గ్రామీణ, తెలుగు మీడియం(Telugu Medium) అభ్యర్థులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో APPSC ఈ పరీక్షలకు సంబంధించిన పేపర్–1ను ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో నిర్వహించాలని నిర్ణయించింది.
పేపర్–1లో జనరల్ స్టడీస్(General Studies), మెంటల్ ఎబిలిటీ(Mental Ability) ప్రశ్నలుంటాయి. ఇంగ్లిష్ ప్రశ్నలను తెలుగులో అనువదించి ఇస్తారు. అయితే ఈ రెండు మాధ్యమాల్లో ఆంగ్లంలోని ప్రశ్నలను మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇక పేపర్–2లో సబ్జెక్టు పేపర్లను మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే నిర్వహించనున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ(Women and Child Welfare)శాఖ(Department)లో మరో నోటిఫికేషన్(Notification) విడుదల(Release) చేయనుంది .ఇందులో భాగంగా 243 పోస్టుల్ని ఏపీపీఎస్సీ (APPSC) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది.
సూపర్వైజర్(గ్రేడ్-1) పోస్టులు 161, సీడీపీవో(CDPO)/ ఏసీడీపీవో(ACDPO)/ రీజినల్ వేర్ హౌస్(Regional Warehouse) మేనేజర్(Manger) పోస్టులు 61, బాలల గృహాల్లోని 21 సూపరింటెండెంట్(Superintendent) పోస్టుల్ని భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది.
ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి ఏప్రిల్ 3(April 3rd)న ఉత్తర్వులు(Orders) జారీ చేశారు. ఈ పోస్టులకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు(Full Details) తెలియాల్సి వుంది.