బీటెక్, బీఈ పాసైన వారికి శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సర్వీస్(Survey and Land records services) విభాగంలో 6 అసిస్టెంట్ డైరెక్టర్(Assistant Director) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఈ పోస్టులకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్(Job Notification)ను కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) రిలీజ్ చేసింది.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 12. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి విద్యార్హత పాటు తదితర పూర్తి వివరాలు తెలుసుకోవాలి.
వీటితో పాటు 4 డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(DRPO) పోస్టులకు, 39 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు, 5 తెలుగు రిపోర్టర్ పోస్టులకు, 151 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు, 35 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 6 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది.
ముఖ్య సమాచారం:
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ(University) నుంచి బీఈ లేదా బీటెక్ (సివిల్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 2021 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీజు రూ.250 , రూ.120 పరీక్షా ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ రూ.120 పరీక్షా ఫీజు చెల్లిస్తే చాలు.
వేతనం: రూ.37,100 బేసిక్ వేతనం(Basic Salary)తో మొత్తం రూ.91,450 వేతనం లభిస్తుంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 22, 2021
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 12, 2021
ఎలా అప్లై చేసుకోవాలంటే
ముందుగా https://psc.ap.gov.in/ వెబ్సైట్(Website) ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (One Time Profile Registration) పైన క్లిక్ చేయాలి.
తరువాత న్యూ రిజిస్ట్రేషన్ (New Registration) పైన క్లిక్ చేయాలి.
అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది.
ఆ తర్వాత లాగిన్ అయి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి.
తరువాత https://psc.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేసి వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో లాగిన్ కావాలి.
ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్(Online Application Submission) బటన్ పైన క్లిక్ చేయాలి.
యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.
పోస్టు పేరు సెలెక్ట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసి దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.