ఏపీ ప్రభుత్వం(AP Government) నిరుద్యోగులకు శుభ వార్త ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్(Release) చేసింది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ఒక ప్రకటన జారీచేశారు.
మొత్తం పోస్టుల్లో రెవెన్యూ శాఖ(Revenue Department)లోని 670 జూనియర్ అసి స్టెంట్(Junior Assistant) కమ్ కంప్యూటర్ అసిస్టెంట్(Computer Assistant) పోస్టులు, దేవదాయ శాఖ(Endowment Department)లోని 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(Executive Officer) పోస్టుల భర్తీకోసం ఏపీపీఎస్సీ కమిషన్ నోటిఫికేషన్(APPSC Comission Notification) జారీ చేసింది. డిసెంబర్ 30 నుంచి 2022 జనవరి 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://psc.ap.gov.in/ అధికారిక వెబ్సైట్(Official Website)లో చూడొచ్చు. పోస్టుల వివరాలు, విద్యార్హత, వయసు తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
మొత్తం పోస్టుల సంఖ్య: 730
పోస్టు: జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్(రెవెన్యూ డిపార్ట్మెంట్): 670
అర్హత: ఏదైనా డిగ్రీ(Degree) ఉత్తీర్ణులై ఉండాలి. జిల్లా కలెక్టర్ నిర్వహించే కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్టు(CPT) ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది.
వయసు: 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష(స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్) కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల(Candidates)ను ఎంపిక చేస్తారు.
పోస్టు: ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–3(ఎండో మెంట్స్ సబ్ సర్వీస్): 60
అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ(Bachelors Degree) ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష(Written Test)(స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్) కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్(CPT) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ముఖ్య సమాచారం :
దరఖాస్తు విధానం: ఆన్లైన్(Online)లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.12.2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 19.01.2022
వెబ్సైట్: https://psc.ap.gov.in
దరఖాస్తు విధానం:
- అభ్యర్థులు ముందుగా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in/ ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కోసం One Time Profile Registration లింక్ పైన క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత New Registration పైన క్లిక్ చేయాలి.
- అభ్యర్థి పేరు(Candidate Name), పుట్టిన తేదీ(DOB), విద్యార్హతల(Education Qualification) వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
- యూజర్ ఐడీ జనరేట్(User ID Generate) అవుతుంది.
- అనంతరం లాగిన్ అయి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత https://psc.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేసి Online Application Submission పైన క్లిక్ చేయాలి.
- యూజర్ ఐడీ(User Id), మొబైల్ నెంబర్(Mobile Number) ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.
- పోస్టు(Post) పేరు సెలెక్ట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
- అప్లికేషన్ ఫామ్(Application Form) డౌన్లోడ్(Download) చేసుకొని భద్రపర్చుకోవాలి.
జిల్లాల వారీగా రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల వివరాలు:
శ్రీకాకుళం-38, విజయనగరం-34, విశాఖ-43, తూ.గో-64, ప.గో-48,కృష్ణా-50, గుంటూరు-57, ప్రకాశం-56, నెల్లూరు-46, అనంత-63, కర్నూలు-54, చిత్తూరు-66, కడప-51.
జిల్లాల వారీగా దేవదాయ శాఖ ఈవో గ్రేడ్-3 పోస్టుల వివరాలు:
శ్రీకాకుళం-4, విజయనగరం-4, విశాఖ-4, తూ.గో-8, ప.గో-7,కృష్ణా-6, గుంటూరు-7, ప్రకాశం-6, నెల్లూరు-4, అనంత-2, కర్నూలు-6 చిత్తూరు-1, కడప-1.