ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళాకు (Job mela) సంబంధించి అధికారులు ప్రకటన విడుదల చేశారు.
ఈ నెల 29న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అర్హత(Qualified), ఆసక్తి(Interested) కలిగిన అభ్యర్థులు(Candidates) ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళా ద్వారా ప్రముఖ పేటిఏం(PayTM), జస్ట్ డైల్(JustDial), డిమార్ట్(DMart), జోయాలుక్కాస్(Joyalukkas) తదితర ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఈ జాబ్ మేళాను ఒంగోలు(Ongole)లో నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాకు సంబంధించి ఖాళీలు, విద్యార్హతల పూర్తి వివరాలు ఇక్కడ చూడచ్చు.
జస్ట్ డైల్: ఈ సంస్థలో 20 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ(Degree), బీటెక్(B.Tech), ఎంబీఏ(MBA) చేసిన వారు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్టయిన వారికి ఏడాదికి రూ.2.5 లక్షల వేతనం ఉంటుంది. వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ సైతం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, గుంటూరులో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18-27 ఏళ్లు ఉండాలి.
జోయాలుక్కాస్: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. సేల్స్ ఎగ్జిక్యూటివ్(Sales Executive), సేల్స్ ట్రైనీ(Sales Trainee), ఆఫీస్ బాయ్(Office Boy) తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, ఆపై విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్టయిన వారికి నెలకు రూ.16 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్(Incentives) ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులు ప్రకాశం జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి.
పేటిఏం: ఈ సంస్థలో 15 ఖాళీలు ఉన్నాయి. ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్(Field Sales Executive) విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఆ పై విద్యార్హతలు కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. సెలెక్టయినా వారికి ఏఢాదికి రూ.2.27 లక్షల వేతనం ఉంటుంది. ఎంపికైన వారు ప్రకాశం/బాపట్లలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18-23 ఏళ్లు ఉండాలి.
డి-మార్ట్: సేల్స్ ఎగ్జిక్యూటివ్(SE)/సేల్స్ ట్రైనీ(ST) మరియు క్యాషియర్స్(Cashier) విభాగంలో 25 ఖాళీలు ఉన్నాయి. టెన్త్(Tenth), ఇంటర్(Inter), డిగ్రీ(Degree) చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల వేతనం ఉంటుంది. ఒంగోలులో పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి. ఇంకా దీంతో పాటు PSR కన్స్ట్రక్షన్స్ సంస్థ(PSR Construction Company)లోనూ 15 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ(ITI), బీటెక్(B.Tech) చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి వివరాలు:
- అభ్యర్థులు ముందుగా apssdc.in వెబ్ సైట్లో(Website) రిజిస్ట్రేషన్(Registration) చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 29 ఉదయం 10 గంటలకు శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజీ, ఒంగోలు చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూల(Interview)కు హాజరుకావాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు Abdul Rehman, 7842004344, 9988853338 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.