ఆంధ్రప్రదేశ్(AP) స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్(State Co-Operative Bank) లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల(Release) చేసింది. విజయవాడలోని బ్యాంకులో ఆప్కాబ్ శాఖల్లో బ్రాండ్ మేనేజర్(Brand Manager)/ అడ్మినిస్ట్రేటర్(Administrator) కమ్ కన్సల్టెంట్(Consultant) పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు(Register) చేసుకునే అభ్యర్థులు(Candidates) ఏదైనా విభాగంలో డిగ్రీ(Degree)తో పాటు సీఏఐఐబీ(CAIIB) ఉత్తీర్ణత(Qualified) సాధించి ఉండాలి. అలాగే బ్యాంకింగ్ రంగంలో 12 ఏళ్ల పని అనుభవం(Work experience) తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థులు ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి నవంబర్ 7th ఆఖరి తేదీ(Last Date). ఆసక్తి(Interested), అర్హత(Qualification) ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్(Official Website) ని సందర్శించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు(Full Details) ఇక్కడ తెలుసుకుందాం.
ముఖ్య సమాచారం:
పోస్టులు: ఈ నోటిఫికేషన్లో భాగంగా బ్రాండ్ మేనేజర్/ అడ్మినిస్ట్రేటర్ కమ్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
వయసు: అభ్యర్థుల వయసు(Age) 01-11-2022 నాటికి 40 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్(Offline) విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: దరఖాస్తులను మేనేజింగ్ డైరెక్టర్, ది ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ఎన్టీఆర్ సహకార భవన్, డి.నం.27-29-28, గవర్నర్పేట్, విజయవాడ అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
ఎంపిక: అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారం (Interview Based)గా ఎంపిక చేస్తారు.
జీతం: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.75,000 జీతం (Salary)గా చెల్లిస్తారు.
దరఖాస్తులకు చివరితేది: నవంబర్ 7, 2022
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://apcob.org/