బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season 5) శుక్రవారం నాటి 62 వ ఎపిసోడ్ లో సూపర్ హీరోస్ వెర్సస్ విలన్స్(Heroes versus Vilans) టాస్క్ రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ రెండు టీమ్స్ తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి బిగ్ బాస్(Big Boss) ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ ఛాలెంజ్(Challenge) లో రెండు టీం సభ్యులు ఇతర టీం సభ్యులను ప్లాట్ఫారం మీద నుంచి కిందపడేయాలి అలా ఏ టీం సభ్యులైతే కింద పడిపోతారు వారి ఈ టాస్క్ లో ఓడిపోయినట్టు అని ప్రకటించారు. ఈ టాస్క్(Task) లో హీరోస్ టీం తరుపున మానస్ వన్ మ్యాన్ షో(One man show) చేసి విలన్స్ టీంలోని సభ్యుల్ని ఒక్కొక్కరిని కిందకి నెట్టేశాడు. దీంతో వాళ్లకి పాయింట్ లభించింది. తరువాత కీ లాక్‌ని విలన్ టీం దక్కించుకోవడంతో ఆ టీం కెప్టెన్(Captain) పోటీదారుల టాస్క్ లో గెలిచినట్టు ప్రకటించారు బిగ్ బాస్.
సూపర్ విలన్స్ టీం ఈ టాస్క్‌లో విజేతలు(Winners)గా నిలవడంతో ఆ టీంలో సభ్యుడైన జెస్సీకి ప్రియాంక వెనుక నుంచి హగ్ ఇచ్చింది. అయితే ఆమె వెనుకు నుంచి వంగి హగ్ ఇస్తుండగా జెస్సీ ఆమెకు ముద్దుపెట్టేశాడు. జెస్సీ ఒక్కసారిగా తనని ముద్దాడే సరికి షాక్ అయ్యింది ప్రియాంక. ఆమెను చూసి శ్రీరామ్ పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు. షణ్ముఖ్‌తో మనోడు జుర్రేశాడు అంటూ చూపించాడు. ఏంటీ ముద్దు పెట్టేశాడా? అని సన్నీ అడగ్గా ‘ఛీ నేను ఎందుకు పెడతాను. వాడే పెట్టాడు కంగ్రాట్స్(Congrats) అని కిందికి వంగాను సుద్దెంగా ముద్దు పెట్టేశాడు’ అని చెప్పి ఓ తెగ సిగ్గుపడిపోయింది ప్రియాంక.
ఆ తరువాత షన్ను, సిరి మధ్య చిన్నపాటి వాగ్వాదాన జరుగుతుంది.అసలు మీరు సూపర్ హీరోస్నా విలన్స్నా పిచ్చోళ్లు మాదిరిగా ఇన్నర్స్ ఎగరేస్తారా? అని సిరిని ఉద్దేశించి కాజల్ ముందు కౌంటర్ వేశాడు షణ్ముఖ్. అది విలనిజం అలాగే ఉంటుంది నేను బట్టలే ఎగరేశా అందులో ఇన్నర్స్ ఉన్నాయని నాకేం తెలుసు? అని చెప్పింది సిరి. కెప్టెన్(Captain)గా ఇల్లు సరిగా పెట్టలేదని నాగార్జున గారు నాకు క్లాస్ పీకుతారు. నిన్ను ఇన్నర్స్ తీసి లోపల పెట్టమన్నా పెట్టలేదు అందుకే కోపం వచ్చిందని చెప్పాడు షణ్ముఖ్. మరో వైపు మానస్ ప్రియనకను ఛీ కొడుతున్న, ఆమె మాత్రం ప్రేమ గీమా అంటూ మానస్ వెనుకు తోకలా తిరుగుతూనే ఉంది. చివరికి ఈరోజు ఎపిసోడ్లో సిస్టర్ అని అనేసినా ఆమెకు సిగ్గురాకపోగా మానస్ తనని ప్రేమిస్తున్నాడని సిరితో గుసగుసలాడింది.
మానస్ కూర్చుని తింటుండగా అతని దగ్గరకు వచ్చి వయ్యారాలు పోతుంది. ఏంటి కంటెంట్(Content) కోసం ట్రై చేస్తున్నట్టు ఉన్నావ్ అని మానస్ సెట్టైర్(settaire) వేస్తాడు. నువ్వు నన్ను అంటుంటే నేను చాలా ఫీల్ అవుతున్న అని పింకీ అంటే ఎందుకు అంత సీన్ చేస్తున్నావ్ తినాలా వెళ్లిపోవాలా? ఇక్కడ నుంచి అని మానస్ సీరియస్ అయ్యాడు. ఆ తరువాత సిరి దగ్గరకు వెళ్లింది ప్రియాంక. ఇలాంటి విషయాలో యమా యాక్టివ్‌గా ఉండే సిరి. మీ మ్యాటర్ ఎంత వరకూ వచ్చింది నాకు నిన్ననే తెలిసింది. మీ ఇద్దరూ లవ్ చేసుకుంటున్నారంట కదా అంటూ లవ్ గుర్తు చూపిస్తుంది. సైగ చేయకే అర్థం అయిపోతుంది అని ప్రియాంక తెగ సిగ్గుపడిపోగా అతనికి కూడా ఇష్టమేనంట కదా అని సిరి అన్నది. దీంతో ప్రియాంక నేనంటే ఇష్టం అని తెలుసు కానీ ఓపెన్ కాడు తనకి తెలుసు నేనేంటో అంటూ ప్రియాంక ఎమోషనల్(Emotional) అయ్యి ఏడ్వడం మొదలుపెట్టింది.‘ఏడ్వకు పింకీ మనల్ని అంటున్నారు అంటే మనపై చనువు ఉంటేనే అంటారు’ అంటూ ఊదరిచింది సిరి. మొత్తానికి పింకీ మానస్ విషయం లో మరి ఎక్కువగా ఆలోచిస్తుందోమో అనిపిస్తుంది.
ఆ తరువాత హౌస్ మేట్స్(House mates) కి కాపాటెన్సీ టాస్క్(Captaincy task) గా చిక్కకు దొరకకు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్(Big Boss) .ఈ టాస్క్ లో భాగంగా పోటీదారులు కొన్ని బాల్స్ ని డాట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి పొట్టి దారులు ఒక వెల్క్రో జాకెట్ ధరించి ఇతరులు మీ వైపు విసిరే బాల్స్ నుంచి తప్పించుకోవాల్సి ఉంటుంది. ప్రతి రంగు బాల్ కి ఒక్కొక్కొ విలువ ఉంటుంది. టాస్క్ లో భాగంగా సమయానుసారం టాస్క్ బజార్ మోగినపుడు పోటీదారులందరు ఇతరులు మీ వైపు విసురుతున్న బాల్స్ మీ జాకెట్ కి అతుకోకుండా చూసుకోవాల్సి ఉంటుంది. చివరకి ఏ పోటీదారైతే తక్కువ విలువ గల బాల్స్ వుంటాయో వారే విజేత(Winner)గా నిలిచి ఈ వారం కెప్టెన్ అవుతారు. అలా ఈ టాస్క్ లో చివరి వరకు ఆడి యాని మాస్టర్ హౌస్ లో కొత్త కెప్టెన్(Captain) గా గెలిచింది . హౌస్ లోకి వచ్చిన దగ్గరినుంచి యాని మాస్టర్ కెప్టెన్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న అవ్వలేదు. తాజాగా కెప్టెన్ అవ్వడంతో తన చిరకాల కల నెరవేరింది అని తెలిపింది.