ఈ మధ్య కాలంలో డయాబెటిస్ అనే పేరే అందరినీ వణికిస్తోంది. మనకంటే పశ్చిమ దేశాల వారు దీని బారిన పడుతున్నారు. అయితే అందుకు మనమూ ఏమీ మినహాయింపు కాదు. గణాంకాలలో డయాబెటిస్ కు సంబంధించి మనకూ ఒక ప్రత్యెక స్థానం ఉంది. అయితే ఇందుకు కారణం జీవన విధానంలో పెను మార్పులు, మొదలైనవి చెప్పుకున్నా ఇప్పుడు ఆ జాబితాలోకి వాయు కాలుష్యం కూడా వచ్చి చేరింది. అందరం చూసీ చూడనట్టు వదిలేసే ఈ వాయు కాలుష్యం డయాబెటిస్ కు ఎలా కారణం కానుందో ఇప్పుడు చూద్దాం.

జర్మనీ లోని Helmholtz Zentrum Muenchen మరియు German Center for Diabetes Research (DZD) సంస్థలకు చెందిన పరిశోధకులు ప్రొ. Annette Peters మరియు బృందం చేసిన పరిశోధనలో తేలింది ఏమంటే వాయు కాలుష్యానికి గురయ్యేవారిలో టైపు 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కనుగొన్నారు. ఇందుకు గాను వీరు ఒక ప్రయోగం చేసారు. అదేంటంటే వీరు జర్మనీ లోని Augusburg ప్రాంతo మరియు దాని చుట్టు పక్కల మరో రెండు కౌంటీలలోని 3000 వేల మందిని విచారించి, భౌతిక వైద్య పరీక్షలు చేసి వారి రక్త నమూనాలను కూడా సేకరించారు. వీరిలో డయాబెటిస్ ఉన్నవారికి fasting blood sample తీసుకున్నారు. అలాగే డయాబెటిస్ లేని వారికి కూడా Oral glucose tolerance test నిర్వహించారు. ఇది ఎందుకంటే అప్పటికే డయాబెటిస్ లేని వారికి వారి గ్లూకోస్ metabolism పని తీరును తెలుసుకునే కోణంలో ఈ పరీక్ష చేసారు.

అలా పరిశోధకులు సేకరించిన వారి రక్తంలో Insulin Resistance, leptin మొదలైన వాటికి సంబంధించిన blood marker ల ను గూర్చి పరీక్షించారు. అటు పైన అక్కడి గాలిలోని వాయు కాలుష్య కారకాలు అక్కడి ప్రజల ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయోనని పరిశోధిoచగా ఆ ఫలితాలు ఇలా ఉన్నాయి. వాయు కాలుష్యానికి అధికంగా గురైన వారు pre-diabetecs (Type 2) అవుతున్నారనీ తేలింది. పైన చేసిన పరిశోధనలో పాల్గొన్న వారి రక్తంలోని blood marker లెవెల్స్ మీద గాలిలోని pollutants concentrations యొక్క ప్రభావం ప్రస్పుటంగా కనిపించడం విశేషం అని పేర్కొన్నారు Kathrin Wolf. ఆ విధంగా వీరు వాయు కాలుష్యానికి ఎక్కువగా గురైతే టైపు 2 డయాబెటిస్ వచ్చే అవకాశం అధికంగా ఉన్నాయని నిర్ధారించారు. యురోప్ లోని విధింపబడిన గాలిలోని కాలుష్య కారకాల స్థాయి, WHO ప్రమాణాల కన్నా కూడా చాలా ఎక్కువ. అందువల్ల వీరు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ స్థాయిని తగ్గించాలని సూచిస్తున్నారు. ఈ పరిశోధన Diabetes Journal లో ప్రచురించబడింది.

దీనిని బట్టి ప్రభుత్వాలు కూడా ఈ కాలుష్య కారకాల స్థాయిని నియంత్రించడం మీద దృష్టి పెడితే అస్తమా, ఊపిరితిత్తుల కాన్సర్, ఎలర్జీ లనే కాదు డయాబెటిస్ ను కూడా అరికట్టవచ్చు.

Courtesy