తెలంగాణ లో పోలీస్ శాఖ రిక్రూయిట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది.ఇందులో భాగం గా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ – ACP ) ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
హైదరాబాద్ లకడీకాపూల్ పోలీస్ నియామక మండలి ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 151 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు సంభందించిన దరఖాస్తుల (Applications) స్వీకరణ ఆగస్టు 11 ఉదయం 8 గంటల నుంచి ఆగస్టు 29 అర్థరాత్రి 12 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు.
అయితే తాజాగా దరఖాస్తు చివరితేదిని సెప్టెంబర్ 4 (September 4) వరకు పొడిగించారని పోలీస్ నియామక మండలి తాజాగా ప్రకటించింది..
ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు ? ఎన్ని ఖాళీలు ఉన్నాయో? తదితర వివరాలు తెలుసుకుందాం.
మొత్తం పోస్టులు: 151 పోస్ట్లు ఉండగా , ఇందులో మల్టీ జోన్-1లో 68 పోస్టులు, మల్టీ జోన్-2లో 83 పోస్టులు ఉన్నాయి.
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులను (Candidates) రాత పరీక్ష ఆధారం గా ఎంపిక చేస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ ఆబ్జెక్టివ్ విధానం లో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1/2 మార్కు చొప్పున 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. రెండో పేపర్
డిస్క్రిప్టివ్ విధానంలో మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
వయసు (Age): అభ్యర్థులు 2021, జూలై 1 నాటికి 34 ఏళ్ల లోపు ఉండాలి.
విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్ పూర్తిచేసి సంబంధిత న్యాయవాద రంగంలో అనుభవం కలిగి ఉండాలి.
జీతం (Salary): ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.54,220 నుంచి 1,33,630 వరకు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు (Application Fee): అప్లికేషన్ ఫీజును ఎస్సీ, ఎస్టీఅభ్యర్థులకు రూ. 750 , జనరల్ అభ్యర్థులకు రూ.1500,గా
నిర్ణయించారు.
వయో పరిమితి పెంపు:
తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తున్న 151 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (కేటగిరీ-7) ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిలో పదేళ్ల సడలింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో భాగం గా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే చివరితేదిని (Application Date) సెప్టెంబర్ 4 వరకు పొడిగించినట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్ పీవీ శ్రీనివాసరావు వెల్లడించారు.
అభ్యర్థులు మరిన్ని వివరాలను https://www.tslprb.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.