మీ gmail ఎకౌంటు ని ఇప్పుడు తెలుగులోకి మార్చుకోవచ్చు (తెలుగు లోకే కాదు, google అందించే కొన్ని ముఖ్యమైన ఇండియన్ బాషలలోకి మార్చుకోవచ్చు) . google మీకు ఇచ్చే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, లేకపోతే సరదాగా ఒక ట్రయల్ చేసి చూడండి.
ఇపుడు ఎలా మార్చుకోవాలో చూద్దాం:
ముందుగా మీ gmail ఎకౌంటు కి లాగిన్ అవ్వండి.
లాగిన్ అయిన తరువాత మీ కుడి పక్క (right top) లో వున్నా గేర్ (Gear) ఐకాన్ ని క్లిక్ చేస్తే వచ్చే మెనూ లో సెట్టింగ్స్ (Settings) ని క్లిక్ చెయ్యండి.
ఇపుడు మీరు సెట్టింగ్స్ పేజి కి ల్యాండ్ అవుతారు, అందులో వుండే లాంగ్వేజ్ ఆప్షన్ దగ్గర వున్నడ్రాప్ డౌన్ బాక్స్ ని క్లిక్ చెయ్యండి (Gmail display language). అందులో మీకు “తెలుగు” సెలెక్ట్ చేసుకుని ఆ వెబ్ పేజి లో అడుగున వున్న సేవ్ చేంజెస్ (Save changes) బటన్ ని క్లిక్ చెయ్యండి.
ఇపుడు మీరు మీ gmail ఎకౌంటు ని తెలుగు లో చూసుకోవచ్చు.
మీరు మల్లీ ఇంగ్లీష్ లోకి మార్చాలనుకుంటే పైన చెప్పిన స్టెప్స్ ఫాలో అయ్యి లాంగ్వేజ్ ఇంగ్లీష్ గా మార్చి సేవ్ చెయ్యండి.