డయాబెటిస్ (diabetes). ఈ మహమ్మారి గురించి మనకు తెలియంది కాదు. దీని బారిన పడిన వారు మందులు వాడాలి లేదంటే ఇన్సులిన్ ఇంజక్షన్లు చేసుకోవాలి. ఈ insulin ఇంజక్షన్లు పొడుచుకోవాల్సి రావడం చాలా బాధాకరం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఏటా ఈ డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇంత మొండి వ్యాధి కనుకనే దీని మీద ఎన్నో పరిశోధనలే జరుగుతున్నాయి. అందులో భాగంగా పరిశోధకులు ఈ ఇన్సులిన్ ఇంజక్షన్లకు ప్రత్యామ్న్యాయం కనుగొన్నారు. మరి ఎంతో మందికి ఊరట కలిగించే ఆ వివరాల్లోకి వెళ్దామా.
UK లోని Midatech అనే సంస్థ ఈ ఇన్సులిన్ ఇంజక్షన్లకు బదులుగా ఒక wafer strip ను తయారు చేసింది. దీని పేరు MSL-001. ఇది చూడడానికి మన పోస్టల్ స్టాంప్ అంత ఉంటుంది. దీన్ని తీసి మన నోట్లో బుగ్గన పెట్టుకోవడమే. అంతే, ఇది నోట్లో కరిగిపోయి, కేవలం 30 సెకండ్లలో ఇన్సులిన్ ను రక్తంలోకి విడుదల చేస్తుంది. సాధారణ ఇంజక్షన్లలో ఉండేంత ఇన్సులిన్ (యూనిట్లు) ఈ చిన్న wafer strip లో ఉండడం విశేషం. ఈ wafer strip లో ఉండే gold particles, ఇన్సులిన్ రక్తంలో కలిసిపోగానే, ఇవి కిడ్నీ ద్వారా బైటికి వచ్చేస్తాయి. ఇది ఎలా పని చేస్తుందంటే, మన నాలుక కింద, బుగ్గలో ఉండే సన్నని రక్త నాళాలు (Capillaries) ఏదైనా డ్రగ్ ను త్వరగా రక్తం లోకి తీసుకోగల సామర్ధ్యం ఉన్నవి. అందువల్ల ఈ స్ట్రిప్స్ ఇన్సులిన్ ను త్వరగా పీల్చుకుని రక్తంలోకి విడుదల చేస్తాయి. అదే సాధారణ మందులు కడుపులోకి చేరగానే అక్కడ విరిగిపోయి, పూర్తి శాతం ఇన్సులిన్ రక్తం లోకి విడుదల కాదు.
ఈ సంస్థ వారు, ఈ wafer strip పని తీరుని 27 మంది డయాబెటిస్ ఉన్న వారి మీద పరీక్షించారు. అప్పుడు వారికి సాధారణ ఇంజక్షన్ల కంటే ఈ wafer strips సమర్ధవంతంగా పని చేశాయని తేలింది. అంతే కాదు ఈ స్ట్రిప్స్ వల్ల ఎలాంటి దుష్ఫలితాలూ లేవని కూడా రుజువైంది. అయితే ఇంకా దీన్ని మరింత మంది మీద పరీక్షిస్తున్నారు.
ఈ పరిశోధన విజయవంతం అయితే డయాబెటిస్ ఉన్న వారికి ఇంజక్షన్ కష్టాలు తీరినట్టే. అలాగే ఇది త్వరలోనే అందరికీ అందుబాటు లోకి రావాలని ఆశిద్దాం.