మాట. ఈ సృష్టిలో భగవంతుడు మానవులకు మాత్రమే ఈ వరాన్ని ఇచ్చాడు. సకల ప్రాణి కోటి నుంచి మనుషులను ప్రత్యేకంగా నిలబెట్టగలిగేవి రెండే. అవి 1.బుద్ధి 2.మాట. మాట ద్వారానే మన సంతోషాన్ని, దుఖాన్ని అవతలి వారితో పంచుకోగలరు. అంతటి అద్భుతమైన మాటను కోల్పోవడం నిజంగా దురదృష్టమే. దేశవిదేశాల్లో వైద్య శాస్త్రంలో, సాంకేతిక రంగంలో జరిగే పరిశోధనల వల్ల మనిషి ముఖంలో కదలికల ద్వారా అవతలి వారికి మాటను తెలియచేయడం ఇప్పటికే ఉంది. కాని కొన్ని రకాల వ్యాధుల బారిన పడిన వారు, తీవ్రమైన పక్షవాతం తో మాట కోల్పోయినవారు తల కాదు కదా కనీసం కళ్ళను కూడా తిప్పలేరు.

అటువంటి వారి కోసం అందుబాటులోకి వచ్చింది ఒక అత్యాధునిక సాంకేతిక పరికరం. అదే Augmentative and Alternate Communication (ACC). దీనిని బ్రిటన్ లోని లోబొరో యూనివర్సిటీ కి చెందిన శాస్త్రజ్ఞులు తయారు చేసారు.

breath-signals

ఈ పరికరంలో ముక్కు లేదా నోటికి తగిలించుకొనే ఒక మాస్క్, గొట్టం ద్వారా ఒక కంప్యూటర్ కు అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ కంప్యూటర్ లోని software (analog to digital converter) ద్వారా ఆ వ్యక్తి ఊపిరిని (breath) బట్టి దానిని మాటగా మార్చి వినిపిస్తుంది. అయితే దీనిని ఉపయోగించాలనుకున్న వ్యక్తి కొద్దిగా సాధన చేయాలి. అంటే, ముందుగానే ప్రోగ్రాం చేయబడిన ఈ software లో నిర్దిష్టమైన ఉచ్చ్వాస నిశ్వాసలకు నిర్దిష్టమైన పదాలు ఉంటాయని గ్రహిoచాలి. దానిని గమనించి సాధన చేస్తే వారిలోని భావాన్ని ఊపిరి ద్వారా అవతలి వారికి మాటగా తెలియచేయవచ్చు.

ఇవి వ్యాధిగ్రస్తులు మాట్లాడలేక తమలో తాము పడుతున్న బాధను దూరం చేయగల అద్భుత పరికరం అని చెప్పచ్చు.

Courtesy