టాటూ మన భాషలో చెప్పాలంటే ఒకప్పటి పచ్చ బొట్టు. దీనినే నానారకాలుగా మర్చి టాటూ అని పిలుస్తున్నారు. ఇది కేవలం అందానికి మాత్రమే ఇప్పటిదాకా ఉపయోగపడింది. కానీ ఇదే టాటూతో నేటి తరం వేరబుల్స్ ని మించి ఆరోగ్య సూచికలుగా దీనిని ఉపయోగించవచ్చని అంటున్నారు హార్వర్డ్-మసాచుసెట్స్ పరిశోధకులు. వీరు పరిశోధన ప్రకారం ఈ టాటూ ద్వారా డయాబెటిస్, సోడియం ఇంకా మరి కొన్ని ముఖ్య ఆరోగ్య లక్షణాలను తెలుసుకోవచ్చట. ఇప్పటిదాకా ఇలా శరీరంలో గ్లూకోజ్ మొదలైన వాటిని గమనించడానికి రకరాకాల పరికరాలు, యాప్లు అందుబాటులోకి వచ్చేసాయి. కానీ అసలే పరికరం లేకుండా కేవలం మన ఒంటి మీద టాటూ రంగును బట్టి వ్యక్తి ఆరోగ్యo గురించి తెలుసుకునే అవకాశం కలిగించడం దీని ప్రత్యేకత. అదెలాగో చూద్దామా.

Nan Jiang, హార్వర్డ్ మెడికల్ స్కూల్ కి చెందిన పరిశోధకులు. ఈయన MIT బృందంతో కలిసి పలు బయో ఇంక్ లను తయారు చేసారు. దీనితో శరీరం పై టాటూ వేస్తే, అవి మన శరీరంలోని interstitial fluids ను బట్టి రంగులు మారుతుందన్న మాట. అంటే శరీరంలో గ్లూకోజ్ ఎక్కువైతే ఈ గ్రీన్ టాటూ నీలంగా మారుతుంది, అదే సోడియం ఎక్కువైతే (dehydrate) ఇదే టాటూ బ్రౌన్ కలర్ లోకి మారుతుంది. ఇలా పలు రకాల ఆరోగ్య లక్షణాలకు పలు రకాల బయో ఇంక్ లతో టాటూ వేస్తారన్న మాట. ఆ టాటూలు శరీరంలోని interstitial fluids ను బట్టి వేరే రంగులు మారుతుంది. ఈ ప్రాజెక్ట్ ను ‘Dermal Abyss’ అని నామకరణం చేసారు Jiang. ఈ తరహా టాటూ తీవ్రమైన అనారోగ్యాలు ఉన్న వారికి, గంట గంటకు వారి ఆరోగ్య పరిస్థితిని గమనించుకోవాల్సిన అవసరం ఉన్న వారికీ, క్రీడాకారులకు బాగా ఉపయోగపడుతుంది. అంతే కాదు, ఈ టాటూ మరి కొద్ది మార్పులు చేసి అందరికీ ఈ టాటూ మార్పులు కనిపించకుండా ఒక ప్రత్యేకమైన కాంతికి మాత్రమే ఆ మార్పు కనిపించేట్టు దీనిని రూపొందిస్తున్నారు Jiang. ఈ విధంగా వ్యక్తి ఆరోగ్య సమాచారం రహస్యంగా ఉంచబడుతుంది. ఇంకా దీనికి అనుసంధానంగా ఒక యాప్ ను తయారు చేయడం టాటూ రంగును బట్టి ఈ యాప్ లో వారి ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చట.

అయితే ప్రస్తుతానికి ఇది proof-of-concept మాత్రమే. దీనిని ప్రస్తుతం పంది చర్మం పై పరీక్షిస్తున్నారు. ఇది మనుషుల పై క్లినికల్ ట్రయల్స్ కు రావాలంటే మరి కొన్నేళ్ళు పట్టచ్చు.

Courtesy