మనుషులకు సోకే ఎన్నో రకాల రోగాలకు చేసే రోగ నిర్ధారణ పద్ధతుల్లో రక్త పరీక్ష కూడా ఒకటి. కాన్సర్, అల్జ్హిమేర్స్ (Alzhimers) కాకుండా ఇంకా ప్రాణాంతకమైన రోగాలను నిర్దారించాలంటే ఎంతో పెద్ద పెద్ద పరికరాలు శిక్షణా సిబ్బంది అవసరం. కానీ అభివృద్ధి చెందుతున్న సాంకేతికత దృష్ట్యా అవి అవసరం లేకుండానే ఇటువంటి కొన్ని రోగాలకు కేవలం ఒకే ఒక్క రక్త పరీక్ష ద్వారా రోగ నిర్ధారణ చేయచ్చని మనం గతంలో ఇదే వేదిక మీద చెప్పుకున్నాం. ఉదాహరణకు ALZHEIMERS ను ఎన్నో ఏళ్ల ముందే కనిపెట్టడం వoటివి మనకు దీన్ని రుజువు చేస్తాయి.
సంప్రదాయ రక్త పరీక్షకు మాత్రం యధావిధిగా రక్తాన్ని సేకరించి ఆ రక్తాన్ని lab లో వివిధ రకాల రోగాలను గూర్చి సిబ్బంది పరీక్ష చేసి అటు తరువాత ఆ ఫలితాలను రిపోర్ట్ ద్వారా వెల్లడి చేస్తారు. ఇదంతా జరగడానికి ఎంతో సమయం పడుతుంది కదూ. సరే, ఇప్పుడు దీనిని కూడా కాదని రక్త పరీక్ష చేసే lab లకు బదులుగా కేవలం ఒక అరచేతిలో ఇమిడిపోయే ఒక చిన్న పరికరం అందుబాటులోకి వస్తే?
అదే జరగనుంది. అమెరికా లోని wellington కు చెoదిన ఒక మెడికల్ డయాగ్నొస్టిక్ సంస్థ అయిన AuramerBio, ఈ పరికరాన్ని తయారు చేసింది. డాక్టర్ల పాకెట్ లో లేదా నర్సుల యప్రాన్ లో పట్టేంత చిన్నదీ పరికరం. దీనితో 20 నిముషాలలో అంటే, సుమారుగా మీరు డాక్టర్ తో మాట్లాడే సమయంలోనే ఏ lab కు వెళ్ళనవసరం లేకుండా మీ రక్త పరీక్షా ఫలితాలు వచ్చేస్తాయి. దీనితో అనీమియా, appendicitis, హర్మోన్ అసమతుల్యం (Hormone Imbalance), థైరాయిడ్, కొలెస్ట్రాల్ స్థాయి వంటివి అన్నీ దీని ద్వారా తెలుసుకోవచ్చు అంటున్నారు దీనిని తయారు చేసిన బృందంలో ఒకరైన Professor Ken McNatty. సంప్రదాయ రక్త పరీక్షలో రోగ నిర్ధారణ కోసం antibodies ను ఉపయోగిస్తారు. కానీ AuramerBio వారి పరికరంలో antibodies కు బదులుగా aptamers ను ఉపయోగించారు. ఇదీ దీని ప్రత్యేకత. అయితే ఈ పద్ధతి ప్రస్తుతానికి proof of concept మాత్రమే. వీరు త్వరలోనే ఒక నమూనాను తయారు చేసే పనిలో ఉన్నారు.
దీని యొక్క పరిధి, సామర్ధ్యం మరియు సరళత దృష్ట్యా దీనిని రానున్న 5 నుంచీ 6 ఏళ్ళల్లో అందుబాటులోకి తెచ్చేందుకు పెద్ద పెద్ద సంస్థలతో ఒప్పందాలు చేసుకునే పనిలో ఉన్నారు McNatty బృందం.ఇది త్వరలోనే అందుబాటులోకి వచ్చి మన డబ్బునూ సమయాన్ని అలాగే డాక్టర్ల సమయాన్ని ఆదా చేస్తుందని ఆశిద్దాం.