ఈ కాలం లో సాంకేతికత సహాయంతో ఒకప్పుడు ఎంతో పెద్ద వస్తువులు సైతం ఇప్పుడు మన చేతుల్లో ఇమిడి పోయేంత చిన్నవి అయిపోయాయి. అందులో ఒకటి వీడియో కెమెరాలు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, మెమరీ కార్డుల వల్ల వీడియోలు తీయడం చాలా సులభం అయిపొయింది. ప్రతీ చిన్న సందర్భాన్ని కూడా మనం వీడియోలు తీసి భద్రపరుస్తున్నాం. అయితే మన ఫోనులో అయినా వీడియో కెమెరాలో అయినా ఒక్క వైపు నుంచి మాత్రమే వీడియో తీయగలం. అంటే మనం ఫోనులోని కెమెరా లెన్సును ఏ వైపున ఉంచితే ఆ వైపు మాత్రమే చిత్రీకరణ జరుగుతుంది. అదే నాలుగు వైపులా చిత్రించగలిగితే…ఎంత అద్భుతంగా వుంటుంది. అందుకే వచ్చేసింది ప్రపంచం లో మొట్ట మొదటి 360 డిగ్రీ  కెమెరా అదే బుబల్.

bubl-2 Bublcam_Hand

ఈ బుబల్ (bubl) ఒక చిన్న బంతి ఆకారం లో వుండే కెమెరా. దీనిలో నాలుగు కెమేర లెన్సులు నాలుగు వైపులా అమర్చబడి ఉంటాయి. దీనిలో ఒకే ఒక్క బటన్ ఉంది.అదే ఆన్/ఆఫ్ బటన్.  దీనిని ఒక ట్రైపాడ్ స్టాండ్ మీద పెట్టి ఆన్ చేస్తే చాలు, 14 మెగా పిక్సెల్ కెమెరాతో నాలుగు వైపులా (360 degrees angle) ఇది మన చుట్టూ చిత్రీకరణ చేసేస్తుంది. అంతేనా, ఇందులో ఇంకా wi-fi స్ట్రీమింగ్ కూడా ఉంది. అంటే రికార్డు చేసి విడియోను wi-fi ద్వారా మన కంప్యూటర్ కు పంపిస్తుంది. అదే కాకుండా దీనిలో ఒక యుఎస్ బి పోర్టు, మైక్రోఎస్డి స్లాట్ కూడా ఉన్నాయి.

bubble_skydiver bubble_aquarium

దీనిలోని టెట్రాహైడ్రాల్ కెమెరా విధానం పేటంట్ చేయబడింది. ఇది త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీనితో ఉపయోగాలు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇది ఏదైనా ప్రత్యేక సందర్భాలకు, షార్ట్ ఫిలం మేకర్స్ కు, వీడియె సర్వేలేన్సు ఇలా చాలా ఉపయోగాలున్నాయి. ఈ పరికరం తొందరలో మన వాడుకానికి రావాలని ఆశిద్దాం!!

Courtesy