మొబైల్ ఫోను ఎలక్ట్రానిక్ రంగంలోనే ఒక పెను విప్లవం తెచ్చింది అనడంలో సందేహం లేదు. ఈ రోజుల్లో అయితే ఎన్నో రంగాల ఉనికి ఈ సెల్ ఫోన్ చుట్టూ ముడి పడి ఉంది. ఇంతటి విప్లవాత్మకమైన పరికరం ఇంతటితో ఆగిపోలేదు. పరిశోధకులు దీని ద్వారా మరెన్నో లాభాలను పొందేందుకు కృషి చేస్తూనే ఉన్నారు. దీనిని మరింత సులువుగా ఉపయోగించేందుకు ఎలక్ట్రానిక్ స్కిన్ వైపు సైతం పరుగులు పెడుతున్నారు.

ఎలక్ట్రానిక్ స్కిన్ వంటివి సెల్ ఫోనుకు అనుబంధంగా ఉపయోగించాలనే ఆలోచన ఉన్నా దానికి ఉన్న పరిమితులు వల్ల ఇప్పటివరకు మార్కెట్ లోకి రాలేకపోయింది. అందువల్ల ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి సెల్ ఫోను వినియోగాన్ని మరింత సులభతరం చేసేందుకు సెల్ ఫోనును మీ చేతుల్లోకి కాదు, మీ చేతి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేసారు పరిశోధకులు. అదే Cicret Bracelet.

ఈ Cicret Bracelet అనేది fitbit మాదిరి మీ మణికట్టుకు పెట్టుకునే ఒక band లాగ ఉంటుంది. దీనిలోని pico-projector కారణంగా ఎలాంటి e-skin అవసరం లేకుండానే మీ ఫోను స్క్రీన్ మీ చేతి మీద ప్రత్యక్షమవుతుంది. మీ ఫోనును మీ bag లో లేదా మీకు దగ్గరలో మరెక్కడైనా పెట్టి ఈ బ్రాస్లెట్ పెట్టుకున్న చేతిని ఒక్కసారి అటూ ఇటూ తిప్పితే చాలు మీ ఫోను స్క్రీన్ మీ చేతి మీద కనిపిస్తుంది. ఇక సెల్ ఫోన్ టచ్ స్క్రీన్ లాగానే మీ చేతి మీద కనిపించే స్క్రీన్ మీద మీ వేళ్ళతో ప్రెస్ చేస్తే చాలు, email, మ్యూజిక్, జిపిస్, టెక్స్ట్ మెసేజెస్ వంటివి అన్నీ మీ ఫోను అవసరం లేకుండా మీ చేతి మీదే చేసుకోవచ్చు, చూసుకోవచ్చు.

ఈ బ్రాస్లెట్ పూర్తిగా వాటర్ రెసిస్టంట్ కావడంతో దీన్ని మీరు ఎక్కడికెళ్ళినా వాడుకోవచ్చు. ఇంకా దీనిలో ప్రాసెసర్, మెమరీ కార్డు, ROM, బ్లూటూత్, వైఫై, LED వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. ఈ Cicret Bracelet, iPhone మరియు ఆండ్రాయిడ్ ఫోన్లకు పని చేస్తుంది.

దీని ధర $250 – $300 వరకు ఉండవచ్చు అని ఈ సంస్థ చెబుతోంది. దీనిని ఈ సంవత్సరం చివర్లోకి మార్కెట్లోకి విడుదల చేయనున్నామని ఈ సంస్థ చెబుతోంది.

Courtesy