మనిషి యొక్క బుద్ధి కేంద్రం మెదడు (brain). అక్కడ ఏమైనా తేడా కాస్తే ఇక అంతే సంగతులు. మన గుండె ఇంకా ఇతర ముఖ్యమైన అవయవాలలాగే మెదడుకు కూడా పోషణ అవసరం. వయసు పెరిగే కొద్దీ ఈ మెదడులో మార్పులు చోటు చేసుకుని మతిమరపు, dementia, Alzhimers ఇలా మరెన్నో వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి వృద్ధాప్యం లో కూడా మెదడు చురుగ్గా పని చేసి మెదడుకు సంబంధించిన అనారోగ్యాలు రాకుండా ఉండాలంటే ఎక్కువగా జంక్ ఫుడ్ (junk food) తినడం మానేయాలి. ఇది శాస్త్రీయంగా రుజువు అయింది కూడా. ఎక్కడో ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Deakin University మరియు Australian National University కి చెందిన పరిశోధకులు మెదడుకు, తీసుకునే ఆహారానికీ సంబంధించి చేసిన పరిశోధనలో ఈ విషయం తేటతెల్లమైంది. వారు ఆస్ట్రేలియా లో 60 నుంచి 64 ఏళ్ల వయసు ఉన్న వృద్ధులను కొంత మందిని తీసుకుని, వారిని రెండు బృందాలుగా విభజించారు. అందులో ఒక బృందం వారు జంక్ ఫుడ్ తింటే మరొక బృందం వారు పోషకాహారం తీసుకున్నారు. ఆ తరువాత వీరందరికీ MRI స్కాన్ చేయగా జంక్ ఫుడ్ తిన్న వారి మెదడులో hippocampus, జంక్ ఫుడ్ తినని వారి hippocampus కంటే చిన్నదిగా ఉంది.
మెదడులోని ఈ hippocampus మనకు జ్ఞ్యాపక శక్తికీ, మానసిక ఆరోగ్యానికీ, ఏదైనా ఒక విషయం నేర్చుకోగల సామర్ధ్యానికీ కేంద్రం.
సరే ఇప్పుడు తినకూడనివి తెలిసాయి, మరి మెదడు ఆరోగ్యంగా ఉండడం కోసం ఏం తినాలో చూద్దాం. అవి
- వేరుసెనగ / బాదం పప్పు / జీడి పప్పు
- టమాట
- గుమ్మడికాయ గింజలు
- చేపలు
- బ్రోకోలి
- స్ట్రాబెర్రీ / బ్లూ బెర్రీ / బ్లాకు బెర్రీ. ఈ పరిశోధన, దాని ఫలితాలను “BMC Medicine” లో ప్రచురించారు. కాబట్టి వయసు పైబడిన వారు జిహ్వ చాపల్యాన్ని అదుపులో పెట్టుకొని పోషకాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది.