Pain (నొప్పి). దీనికి పరిచయం అవసరం లేదు. భాషలు వేరు కావచ్చు కానీ నొప్పి ఎవ్వరికైనా ఒక్కటే. మనిషి పుట్టుకతోనే దీని శక్తిని గ్రహిస్తాడు. పురిటి నొప్పులు పడేటప్పుడు తల్లి మాత్రమే బాధ పడుతోంది అని అనుకుంటాం కానీ బయటకు రావడానికి శిశువు కూడా ఆ నొప్పిని అనుభవిస్తాడు. అలా నొప్పితోనే ఈ లోకంలోకి వస్తాడు. పన్ను నొప్పి, మెడ నొప్పి, తల నొప్పి, నడుం నొప్పి ఇలా ఒక్కటేమిటి ఈ నొప్పుల్లో ఎన్నో రకాలు. ఆరోగ్యవంతులకు ఈ నొప్పి చిరకాలం ఉండదు కాని, ఏదైనా అనారోగ్యం వస్తే మాత్రం ఇక ఈ బాధలు అంతా ఇంతా కాదు. అసలు కొన్ని రకాల వ్యాధులకు వైద్య శాస్త్రంలో “Pain Management” అనే అంశం మీద శిక్షణ పొందుతారంటే దీనికి ఉన్న ప్రాముక్యత ఏమిటో మనం అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ నొప్పిని తగ్గించడానికి పెయిన్ కిల్లర్స్ అందుబాటులో ఉన్నా, దీర్ఘ కాలం వీటిని వాడటం వల్ల దుష్ప్రయోజనాలు కలుగుతున్నాయి. మరి మనిషికి వ్యాదుల వల్ల వచ్చే నొప్పులకు పరిష్కారమే లేదా అంటే, ఉంది అంటోంది ఒక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మరి వివరాల్లోకి వెళ్దామా!!
“Spectra Stimulator” ఇది సాంకేతికతతో సాధ్యపడిన వైద్య శాస్త్ర పరికరం. అమెరికాలోని కొలరాడో లో Dr. Kenneth Lewis, ఈ పరికరాన్ని కనుగొన్నారు. దీనిని 200 మంది రోగుల మీద పరీక్షించారు.అందరికీ దీని వల్ల నొప్పి నుంచి ఎలాంటి మందులూ లేకుండా ఉపశమనం పొందారు అంటున్నారు Dr.Lewis. ఈ Spectra Stimulator ను వెన్నులోని ఒక ఫైబెర్ కు అమర్చుతారు. ఈ పరికరానికి ఒక రిమోట్ కూడా ఉంటుంది. ఇదెలా పనిచేస్తుందంటే రోగి నొప్పిగా అనిపించినప్పుడు రేమోట్ లోని బట్టన్ నొక్కితే శారిరoలోని వెన్నులో అమర్చబడిన Spectra Stimulator వెన్ను ద్వారా మెదడుకు చేరే నొప్పి సంకేతాల బదులుగా “సంతోషపు” సంకేతాలని మెదడుకు పంపిస్తుంది. దాంతో అసలు మందులు లేకుoడానే నొప్పిని మాయం చేయొచ్చు.
రకరకాల అనారోగ్యాల వల్ల మనిషి పడే శారీరక బాధలకు ఈ “Spectra Stimulator” వంటి పరికరాలు సంజీవిని వంటివి. అయితే ఇది ప్రస్తుతానికి అమెరికాలోని అతి తక్కువ ఆసుపత్రుల్లో మాత్రమే ఉంది. ఇది తొందరగా అందరి అందుబాటులోకి రావాలని ఆశిద్దాం!!
Courtesy