చంద్రముఖి(Chandramukhi) విడుదలై 17 ఏళ్ళు అయ్యింది. ఇన్నేళ్ల తరువాత ఈ చిత్రానికి సీక్వెల్(Sequel) సిద్ధం అయ్యింది. ఇంతవరకూ ఈసినిమాకు సీక్వెల్ రాకపోవడమే ఆశ్చర్యం అనే చెప్పాలి. ఇంత ఆలస్యంగా సీక్వెల్ వస్తోందంటే చంద్రముఖి సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉండాలి. అయితే అందరూ ఊహించిన విధంగానే భారీ అంచనాల(Huge Expectations) మధ్య చంద్రముఖి సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది.
అయితే చంద్రముఖిలో రజనీకాంత్, నయనతార లీడ్ రోల్స్(lead roles) చేయగా, తాజాగా రూపొందుతున్న సీక్వెల్ లో రాఘవా లారెన్స్(Raghava Lawrence), చంద్రముఖిగా బాలీవుడ్ స్టార్(Bollywood Star) బ్యూటీ కంగనా రనౌత్(Knagana Ranaut) నటించారు. 2005లో వచ్చిన చంద్రముఖి సినిమా తమిళ(Tamil), తెలుగు(Telugu) బాక్సాఫీస్(Box Offices) ల దగ్గర సంచలన సక్సెస్(Success) సాధించింది.
ఒక రకంగా చెప్పాలి అంటే సౌత్ ఆడియన్స్(South Audience) కు ఓ వైవిధ్యమైన(Different) హర్రర్ థ్రిల్లింగ్(Horror Thriller) ఎక్స్ పీరియెన్స్(Experience) ను అందించింది. అంతేకాకుండా హార్రర్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్(Trend setter)గా నిలిచింది. కాగా దాదాపు 17ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను చంద్రముఖి ఫస్ట్ పార్ట్ డైరెక్ట్ చేసిన పి. వాసు నే దర్శకత్వం వహిస్తున్నాడు.
వాస్తవానికి చంద్రముఖి హిట్(Hit) తర్వాత రజినీతోనే సీక్వెల్‌ను పట్టాలెక్కించాలని దర్శకుడు(Director) p.వాసు(P.Vasu) చాలా ప్రయత్నించాడు. అయితే అది కుదరలేదు.ఇక ఈ మూవీ గురించి చాలా రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు షూటింగ్ అప్ డేట్(Shooting Update) వస్తూనే ఉంది. ఇక తాజాగా చంద్రముఖి2కు సబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
తాజాగా ఈ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయినట్లు చిత్ర యూనిట్(Movie Unit) వెల్లడించింది. అంతే కాదు విడుదల కూడా దాదాపు ఖరారు అయ్యినట్టు సమాచారం . ఈ సినిమాను వినాయక చివితి సందర్భంగా సెప్టెంబర్(September) లో రిలీజ్(Release) చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈసినిమాకు ప్రత్యేక ఆకర్షణ చంద్రముఖి పాత్రలో కనిపించబోయే బాలీవుడ్ బ్యూటీ కంగానా రనౌత్ అని చెప్పాలి.
ఇక ఈసినిమాలో రాధికా శరత్కుమర్, వడివేలు ముఖ్య పాత్రల్లో నటించగా లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, శ్రుతి డాంగే, సుభిక్ష క్రిష్ తదితరులు నటిస్తున్నారు. ఎమ్.ఎమ్ కీరవాణి(M,M.Keeravani) మ్యూజిక్(Music) అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్(LYKA Productions Banner)పై సుభాస్కరన్ నిర్మిస్తున్నాడు.
ఇప్పటికే చంద్రమఖి2 నుంచి విడుదలైన పోస్టర్లు(Posters) సినిమాపై విపరీతమైన ఆసక్తి(Interest)ని పెంచాయి.