సశస్త్ర సీమా బాల్(Sashastra Seema Bal) పలు ఉద్యోగాల(Jobs) భర్తీకి నోటిఫికేషన్(Notification) రిలీజ్(Release) చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రేడ్స్‌ మెన్, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్‌ఐ మరియు సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు రిక్రూట్‌ చేయనుంది.

ఈ రిక్రూట్‌మెంట్(Recruitment) కోసం దరఖాస్తు చేయడానికి సిద్ధంగా ఉన్న ఆసక్తి(Interested), అర్హత(Qualified) గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్(Official Website) ssbrectt.gov.in ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ(Last Date) 18 జూన్ 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1638 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటి ద్వారా హెడ్ కానిస్టేబుల్, ట్రేడ్స్‌మన్, కానిస్టేబుల్, ASI, అసిస్టెంట్ కమాండెంట్ మరియు సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ జరుగుతుంది.

ముఖ్య సమాచార:

అర్హతలు:

హెడ్ ​​కానిస్టేబుల్ (HC): అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మన్): అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

ASI (పారా మెడ్): అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి సైన్స్ స్ట్రీమ్‌తో 12వ ఉత్తీర్ణత మరియు సంబంధిత ట్రేడ్‌లో డిగ్రీ కలిగి ఉండాలి.

ASI (స్టెనో): అభ్యర్థి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

అసిస్టెంట్ కమాండెంట్ (వెటర్నరీ): అభ్యర్థి తప్పనిసరిగా వెటర్నరీ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.

సబ్ ఇన్‌స్పెక్టర్ (టెక్): అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండాలి.

దరఖాస్తు ఫీజు:    

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.100 ఫీజు(Fee) చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు(Exemption) ఉంది.

వయో పరిమితి

హెడ్ ​​కానిస్టేబుల్ (హెచ్‌సి), కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మ్యాన్) మరియు ఎఎస్‌ఐ (స్టెనో) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అసిస్టెంట్ కమాండెంట్‌కు 23 నుంచి 25 ఏళ్లు, సబ్ ఇన్‌స్పెక్టర్ (టెక్)కి 21 నుంచి 30 ఏళ్లు, ఏఎస్‌ఐ (పారామెడికల్ స్టాఫ్)కి 20 నుంచి 30 ఏళ్లు, ఏఎస్‌ఐ (స్టెనో)కి 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు(Age) ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

ఈ పోస్టులకు అభ్యర్థుల(Candidates) ఎంపిక కోసం రాత పరీక్ష(Written Test), ఫిజికల్ టెస్ట్(Physical Test), డాక్యుమెంట్ వెరిఫికేషన్(Document Verification), మెడికల్ టెస్ట్(Medical Test) నిర్వహిస్తారు.

దరఖాస్తు ఇలా:

  • ముందుగా అభ్యర్థులు nic.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
  • ఇప్పుడు అభ్యర్థి హోమ్‌పేజీలో SSB రిక్రూట్‌మెంట్ 2023 లింక్‌పై క్లిక్ చేయండి.
  • ఆపై అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే లింక్‌పై క్లిక్ చేయండి.
  • దీని తర్వాత అభ్యర్థులు అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
  • తర్వాత అభ్యర్థుల దరఖాస్తు ఫీజును చెల్లించండి.
  • ఇప్పుడు అభ్యర్థి దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • చివరగా అభ్యర్థి తమ దరఖాస్తు ఫారమ్ ప్రింట్ అవుట్ తీసుకోండి. ఇది భవిష్యత్ అవసరాల(Future Reference)కు ఉపయోగపడుతుంది.